TS Inter Results 2024 : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని నాంపల్లి ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను ప్రకటించారు. ఉదయం 11 గంటలకు ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. ఫిబ్రవరి 28వ తేదీ నుంచి మార్చి 19వ తేదీ వరకు జరిగిన పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 9,80,978 మంది విద్యార్థులు రాశారు. ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం ఇక్కడ https://results.cgg.gov.in క్లిక్ చేయండి. ఫలితాలను ఇక్కడ కూడా results.eenadu.netలో చెక్ చేసుకోవచ్చు.
- ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
- ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
- ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
- ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ రిజల్ట్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Telangana Inter Results Released 2024 : తెలంగాణ వ్యాప్తంగా ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు సంబంధించి 9.81 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఇందులో ప్రథమ సంవత్సరంలో 2.87 లక్షల మంది, ద్వితీయ సంవత్సరంలో 3.22 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్లో 60.01 శాతం, సెకండ్ ఇయర్లో 64.19 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.
Girls Topped in TS Intermediate Results 2024 : ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 68.35 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో 72.53 శాతం మంది అమ్మాయిలు పాస్ అయ్యారు. అలాగే ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 51.5 శాతం బాలురు పాస్ అవ్వగా, సెకండియర్లో 56.1 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు.
మేడ్చల్ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఇక సెకండ్ ఇయర్లో ములుగు జిల్లా విద్యార్థులు టాప్ చేయగా, రెండో స్థానంలో మేడ్చల్ జిల్లా నిలిచింది. ఇక మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో కామారెడ్డి జిల్లా ఆఖరి స్థానంలో నిలవటం గమనార్హం. ప్రభుత్వ ఎయిడెడ్లోనూ రెండు సంవత్సరాల్లో 50 శాతం పాస్ పర్సంటేజ్ సాధించకపోవటం ఆందోళనకరం.
ఏపీ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్ - రిజల్ట్స్ చెక్ చేసుకోండిలా - ap Inter Results 2024
ఒకేసారి 3 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - విజయ రహస్యం అదేనట - Man Got Three Government Jobs