Lab Technicians Job Notification 2024 : తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు(TG MHSRB) నోటిఫికేషన్ను విడుదల చేసింది. 1284 పోస్టులకు ఆహ్వానిస్తోంది. సెప్టెంబరు 21 నుంచి ఈ పోస్టులకు దరఖాస్తుల చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అక్టోబరు 5వ తేదీన నిర్ణయించారు. దరఖాస్తు సవరణకు అక్టోబర్ 7వ తేదీ నుంచి 8వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. ఈ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ - II పోస్టులకు 10.11.2024న పరీక్ష నిర్వహిస్తారు.
పోస్టు వివరాలు :
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ -II: 1,284 పోస్టులు
ఏ విభాగంలో ఎన్ని పోస్టులు :
1. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ : 1088 పోస్టులు
2. తెలంగాణ వైద్య విధాన పరిషత్ : 183 పోస్టులు
3. ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్ : 13 పోస్టులు
జీతం : రూ.32,810 - రూ.96,890(నెలకు)
విద్యార్హతలు :
లాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు/ ఎంఎల్టీ ఓకేషనల్/ ఇంటర్మీడియట్(ఎంఎల్టీ ఓకేషనల్)/ బీఎస్సీ(ఎంఎల్టీ)/ ఎంఎస్సీ(ఎంఎల్టీ)/ డీఎంఎల్టీ/ బీఎంఎల్టీ/ పీజీడీ ఎంఎల్టీ/ బీఎస్సీ(మైక్రో బయాలజీ)/ ఎంఎస్సీ(మైక్రో బయాలజీ/ మెడికల్ బయో కెమిస్ట్రీ/ క్లీనికల్ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ)
వయో పరిమితి : 18 నుంచి 46 సంవత్సరాలు(01/07/2024కి)
జీతం : రూ.58,850 - రూ.1,37,050(నెలకు)
ఆన్లైన్ పరీక్ష రుసుం : రూ.500
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి :
దరఖాస్తును ఆన్లైన్లో మాత్రమే పంపాలి. ఆన్లైన్లో పంపిన దరఖాస్తునే పరిగణనలోకి తీసుకుంటారు.
పరీక్షా కేంద్రాలు : హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తెనపల్లి, కరీంనగర్, మహబూబ్నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్.
ముఖ్యమైన తేదీలు :
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 21-09-2024
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 5-10-2024
- ఆన్లైన్లో పంపిన దరఖాస్తు సవరణ తేదీలు : 7-10-2024 - 8-10-2024
- పరీక్ష నిర్వహణ తేదీ : 10-11-2024
- Telangana Lab Technician Posts అప్లై చేసుకునేందుకు ఇక్క Click చేయండి