Successful Student Quit Habits : పాఠశాల విద్యలో కావొచ్చు.. కాలేజీ, యూనివర్సిటీలో కావొచ్చు.. క్లాస్‌లో కొందరే టాప్‌లో ఉంటారు. మిగిలిన వారు వెనుకబడిపోతారు. ఇలా వెనకున్న వారందరూ మదనపడుతుంటారు. మేము ఎందుకిలా తయారయ్యాం? మేమెందుకు టాప్‌లోకి రాలేకపోతున్నాం అని బాధపడుతుంటారు. కానీ.. కారణాలు వాళ్లు కనుక్కోలేకపోతారు. మరి.. అవేంటో మీకు తెలుసా? లేదంటే మాత్రం.. ఈ స్టోరీ చదివేయండి. వాటిని సరిచేసుకోండి. సక్సెస్ మీ వెంట నడిచి వస్తుంది!
ప్రతి పనినీ వాయిదా వేయడం :
కొంత మంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత హోమ్‌వర్క్ కంప్లీట్ చేయరు. తర్వాత చేస్తానని అంటారు. రాత్రి అయ్యాక.. ఉదయాన్నే లేచి చేస్తానని అంటుంటారు. కానీ పొద్దున హడావిడిగా నిద్రలేచి స్కూల్‌కు పరిగెడతారు. హోం వర్క్ చేయలేదనే భయంతో టెన్షన్ పడుతుంటారు. ఈ అలవాటు ముదిరితే.. ప్రతి పనిలోనూ ఇదే పద్ధతి ఫాలో అవుతారు. ఇలా వాయిదా వేసుకుంటూ వెళ్లేవారు లైఫ్‌లో సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి.. ఎప్పటి పని అప్పుడే చేయాలని ఎవరికి వారు రూల్ పెట్టుకోవాలని సూచిస్తున్నారు.
మల్టీ టాస్కింగ్ వద్దు :
కొంతమంది పిల్లలు హోమ్‌వర్క్ చేస్తున్నప్పుడు, చదువుకుంటున్నప్పుడు టీవీ చూస్తుంటారు. ఇలా.. మల్టీ టాస్కింగ్ చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఏ పని చేస్తే.. దానిపైనే శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు.
క్లాసులు మిస్ అవ్వడం :
స్కూల్ లేదా కాలేజీకి ఒక్కోసారి డుమ్మాకొట్టాల్సి వస్తుంది. అనివార్యమైనప్పుడు ఏమీ చేయలేం. కానీ.. కొందరు అవసరం లేకున్నా సెలవు పెడుతుంటారు. ఇలా ఎప్పటికీ చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. ప్రతి క్లాస్‌లో కూడా టీచర్‌లు ఎంతో విలువైన పాఠాలను చెబుతారు. మిస్సైన వారికోసం మళ్లీ ఆ పాఠాలు చెప్పరు. ఇలా క్లాసులు వినకుండా ఉంటే.. మీరు ఆ సబ్జెక్టుల్లో వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
టైమ్ మేనెజ్‌మెంట్ లేకపోవడం :
లైఫ్‌లో సక్సెస్ అవ్వాలంటే ప్రతి ఒక్కరూ టైమ్ మేనెజ్‌మెంట్‌ను తప్పకుండా ఫాలో కావాలి. మీరు ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నారో ఒక రోజు ముందుగానే ప్లాన్ చేసుకుని పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
హెల్దీ ఫుడ్ :
మనం ఆరోగ్యంగా ఉండటానికి హెల్దీ ఫుడ్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే.. పిల్లలు చిన్నప్పటి నుంచే జంక్‌ఫుడ్, ఫాస్ట్‌ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండడం వల్ల అధిక బరువు సమస్య లేకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు. విద్యార్థి దశలో ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని నిపుణులంటున్నారు. తాజా పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు.
మరి కొన్ని టిప్స్ :
- రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి.
- ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది పిల్లల ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్‌లు, టీవీలు ఎక్కువ సేపు చూస్తూ టైమ్ వృథా చేసుకుంటున్నారు. అయితే, స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోకుండా.. ఈ అలవాటును తగ్గించుకోవాలి.
- పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని, మంచి ర్యాంక్ రాలేదని ఎప్పుడూ కూడా పిల్లలు బాధపడకూడదు. మీరు చేసిన తప్పులను మళ్లీ చేయకుండా, ఉంటే తర్వాత కచ్చితంగా విజయం సాధిస్తారు.
- అలాగే పిల్లలు ఎప్పుడూ కూడా మైండ్‌లో నుంచి నెగటివ్ ఆలోచనలను తీసేసి.. పాజిటివ్ మైండ్‌సెట్‌తో ముందుకు వెళ్లాలని సూచిస్తున్నారు.
పరీక్షలు అంటేనే భయంగా ఉందా? ఈ 9-టిప్స్ పాటిస్తే విజయం మీదే! - Exam Anxiety
బిగ్ అప్డేట్ - అతి త్వరలో CBSE ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి! - CBSE Results 2024 date