ETV Bharat / education-and-career

అమెరికాలో చదువుకోవాలా? అక్కడి జీవన వ్యయాలపై సమగ్ర సమాచారం మీ కోసం! - Cost of Studying in America - COST OF STUDYING IN AMERICA

US Study Guide : ఎంతో మంది భారతీయ విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తుంటారు. అయితే అమెరికాకు వెళ్లేముందే అక్కడి వివిధ ప్రాంతాల జీవన వ్యయాలపై విద్యార్థులు కనీస అవగాహనకు రావాలి. అందుకు సంబంధించిన ఉపయోగకర సమాచారమిది.

US Study Guide
US Study Guide (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 1:07 PM IST

US Study Guide : మన దేశం నుంచి నిత్యం ఎంతో మంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తుంటారు. అక్కడికి వెళ్లి చదువుకుంటే అయ్యే ఖర్చులపై విద్యార్థులకు ముందుగానే మంచి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే ఆయా యూనివర్సిటీలు ముందే తమ ఫీజు వివరాలను స్పష్టంగా ప్రకటిస్తాయి. కానీ అమెరికాలోని వివిధ ప్రాంతాలకు సంబంధించిన జీవన వ్యయాలపై విద్యార్థులకు ముందస్తు క్లారిటీ లభించదు. ఒకవేళ కొంత ఫీడ్ బ్యాక్‌ను సేకరించినా, అది అంత కచ్చితత్వంతో ఉండకపోవచ్చు. అందుకే అమెరికాలోని ఏయే ప్రాంతాల్లో జీవన వ్యయాలు ఎలా ఉంటాయనే వివరాలను ఈ ఆర్టికల్​లో ఇచ్చాం.

భిన్నంగా జీవన వ్యయాలు
అమెరికాలోని ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, మిడ్ వెస్ట్ అండ్ ఉత్తర మైదానాలు, సౌత్​ అండ్ మౌంటెయిన్ స్టేట్స్‌లో జీవన వ్యయాలు భిన్నంగా ఉంటాయి. ఆయా ప్రాంతాల ద్రవ్యోల్బణం, మార్కెట్ స్థితిగతులు భిన్నంగా ఉంటాయి. ఇంటి అద్దెలు కాకుండా, ఒక వ్యక్తి సగటు నెలవారీ ఖర్చులే దాదాపు రూ.1లక్ష దాకా ఉంటాయని ఒక అంచనా. వరల్డ్ పాపులేషన్ రివ్యూ నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు.

2024లో అమెరికాలోని ఏయే ప్రాంతాల్లో జీవన వ్యయాలు ఎలా ఉన్నాయనే వివరాలను కింద చూడొచ్చు.

1. ఈస్ట్ కోస్ట్ ప్రాంతం

  • న్యూ ఇంగ్లాండ్ ఏరియా : బోస్టన్, ప్రొవిడెన్స్, హార్ట్‌ఫోర్డ్ నగరాలు
  • మధ్య అట్లాంటిక్ ఏరియా : న్యూయార్క్, ఫిలడెల్ఫియా, బాల్టిమోర్, వాషింగ్టన్ డీసీ నగరాలు
  • ఆగ్నేయ ఏరియా : మయామి, అట్లాంటా, షార్లెట్, ఓర్లాండో నగరాలు

అద్దె ఖర్చులు : న్యూయార్క్ నగరంలో అపార్ట్‌మెంట్ అద్దెకు నెలకు రూ.2.85 లక్షలు. బోస్టన్‌లో నెల అద్దె సగటున రూ.2.43 లక్షలు. బాల్టిమోర్, ప్రొవిడెన్స్ వంటి ప్రదేశాలలో సగటు నెలవారీ అద్దెలు రూ.1.25 లక్షల నుంచి రూ.1.42 లక్షల మధ్య ఉంటాయి.

రవాణా ఖర్చులు : న్యూయార్క్ నగరంలో రవాణా ఖర్చులు, నెలవారీ సబ్‌వే పాస్ ఖర్చులు దాదాపు రూ.10వేలకుపైనే ఉంటాయి. కానీ ప్రొవిడెన్స్ వంటి చిన్న నగరాల్లో ఈ ఖర్చు రూ.6వేలలోపే ఉంటుంది.

ఆహారం, కిరాణా సరుకుల ధరలు: అమెరికాలోని ఈస్ట్ కోస్ట్‌ ప్రాంతంలోని నగరాల్లో కిరాణా సామాన్లు బాగా రేట్లు ఎక్కువ. ఇక్కడ హోటళ్లలో ఫుడ్స్ కూడా చాలా కాస్ట్లీ. ఉదాహరణకు న్యూయార్క్ నగరంలోని మధ్య శ్రేణి రెస్టారెంట్‌లో ఇద్దరు వ్యక్తులు భోజనం చేస్తే దాదాపు రూ.6,200 ఖర్చవుతుంది.

యుటిలిటీ, ఇంటర్నెట్ బిల్స్ : బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో యుటిలిటీ బిల్లుల ఖర్చులు సాధారణంగా నెలకు రూ.12,500 నుంచి రూ.17,000 వరకు ఉంటాయి. ఇంటర్నెట్ బిల్స్ ప్రతినెలా రూ.5వేల నుంచి రూ.5,800 వరకు వస్తాయి.

2. వెస్ట్ కోస్ట్ ప్రాంతం

  • పసిఫిక్ నార్త్‌వెస్ట్ ఏరియా : సియాటెల్, పోర్ట్‌ల్యాండ్ నగరాలు
  • కాలిఫోర్నియా ఏరియా : లాస్ ఏంజిల్స్, శాన్​ఫ్రాన్సిస్కో, శాన్ డియాగో, శాక్రమెంటో నగరాలు

అద్దె ఖర్చులు: శాన్​ఫ్రాన్సిస్కో ఏరియాలో అద్దెలు చాలా ఎక్కువ. ఇక్కడ సగటు నెలవారీ అద్దె దాదాపు రూ.3.18 లక్షలు ఉంటుంది. లాస్ ఏంజిల్స్‌లో సగటు నెలవారీ అద్దె దాదాపు రూ.2.94 లక్షలు ఉంటుంది. పసిఫిక్ నార్త్‌వెస్ట్‌ ఏరియాలో, సియాటెల్‌ ఏరియాలో నెలవారీ సగటు అద్దె దాదాపు రూ.2.43 లక్షలు ఉంటుంది. పోర్ట్‌ల్యాండ్ ఏరియాలో నెలవారీ అద్దెలు దాదాపు రూ.1.93 లక్షల మేర ఉంటాయి.

రవాణా ఖర్చులు: లాస్ ఏంజిల్స్, శాన్​ఫ్రాన్సిస్కో వంటి నగరాల్లో రవాణా ఖర్చులు, నెలవారీ పాస్ ధర దాదాపు రూ.8,300 రేంజ్​లో ఉంటాయి. ప్రపంచ జనాభా సమీక్ష నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించారు.

ఆహారం, కిరాణా సరుకుల ధరలు: కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాన్​ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజెల్స్ వంటి నగరాల్లో ఆహారం, కిరాణా సరుకుల ధరలు చాలా ఎక్కువ. అమెరికాలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ కిరాణా సామాగ్రిపై దాదాపు 10 నుంచి 15 శాతం ఎక్కువ రేట్లను చెల్లించాల్సి వస్తుంటుంది.

యుటిలిటీ, ఇంటర్నెట్ బిల్స్ : శాన్​ఫ్రాన్సిస్కో, సియాటెల్ వంటి నగరాల్లో విద్యుత్ బిల్లులు, హీటింగ్ బిల్లులు, నీటి బిల్లులు సగటున ప్రతినెలా రూ.12 వేల నుంచి రూ.17వేల వరకు ఉంటాయి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రాథమిక స్థాయి ప్యాకేజీ కోసం ప్రతి నెలా రూ.6వేల దాకా పే చేయాల్సి ఉంటుంది.

3. మిడ్ వెస్ట్ అండ్ నార్తెర్న్ ప్లెయిన్స్ ప్రాంతం

  • గ్రేట్ లేక్స్ ఏరియా : చికాగో, క్లీవ్‌ల్యాండ్, డెట్రాయిట్, మిల్వాకీ నగరాలు
  • సెంట్రల్ ప్లెయిన్స్ ఏరియా : మిన్నియాపాలిస్, సెయింట్ లూయిస్, కాన్సాస్ సిటీ, ఒమాహా నగరాలు
  • డకోటాస్ ఏరియా : ఫార్గో, సియోక్స్ జలపాతం నగరాలు
  • నెబ్రాస్కా అండ్ అయోవా ఏరియా : లింకన్, డెస్ మోయిన్స్ నగరాలు

అద్దె ఖర్చులు : చికాగోలో సగటు అద్దె నెలకు రూ1.42 లక్షలు ఉంటుంది. అయితే ఫార్గో, నార్త్ డకోటా వంటి చిన్న నగరాల్లో అద్దె నెలకు దాదాపు రూ.75వేల వరకు ఉంటుంది.

రవాణా ఖర్చులు : చికాగోలో నెలవారీ ప్రజా రవాణా పాస్ ధర దాదాపు రూ.8,800. ఒమాహా వంటి చిన్న నగరాల్లో ఈ ఖర్చు దాదాపు రూ.4,600 ఉంటుంది.

ఆహారం, కిరాణా సరుకుల ధరలు : మిన్నియాపాలిస్‌ ఏరియాలో కిరాణా ఖర్చులు అమెరికా జాతీయ సగటు కంటే దాదాపు 5 శాతం తక్కువగా ఉంటాయి. ఇక్కడ భోజనం ఖర్చులూ తక్కువే. మధ్య శ్రేణి రెస్టారెంట్‌లో ఇద్దరు భోజనం చేస్తే దాదాపు రూ.5వేలు ఖర్చవుతుందని ప్రపంచ జనాభా సమీక్ష నివేదికలో ప్రస్తావించారు.

యుటిలిటీ, ఇంటర్నెట్ బిల్స్ : మిడ్‌వెస్ట్‌ ప్రాంతంలోని యుటిలిటీ బిల్లులకు ప్రతినెలా దాదాపు రూ.13వేల దాకా ఖర్చవుతుంది. ఇక్కడ ఇంటర్నెట్ బేస్ ప్యాకేజీని వాడినా ప్రతినెలా రూ.5వేల దాకా బిల్లు కట్టాల్సి ఉంటుంది.

4. సౌత్ అండ్ మౌంటెయిన్ స్టేట్స్ ప్రాంతం

  • డీప్ సౌత్ ఏరియా : న్యూ ఓర్లీన్స్, బర్మింగ్‌హామ్, మెంఫిస్ నగరాలు
  • నైరుతి ఏరియా : డల్లాస్, హ్యూస్టన్, ఆస్టిన్, శాన్ ఆంటోనియో నగరాలు
  • రాకీ పర్వత ఏరియా : డెన్వర్, సాల్ట్ లేక్ సిటీ, బోయిస్ నగరాలు
  • నైరుతి ఎడారి ఏరియా: ఫీనిక్స్, లాస్ వెగాస్, అల్బుకెర్కీ నగరాలు

అద్దె ఖర్చులు: డల్లాస్‌ ఏరియాలో సగటు అద్దె నెలకు రూ.1.21 లక్షలు. ఫీనిక్స్‌ సగటు నెల అద్దె రూ.1.66 లక్షలు.
రాకీ మౌంటైన్ ప్రాంతంలో, డెన్వర్ నగరాల్లో సగటు అద్దె నెలకు రూ.1.46లక్షలు. ఈ వివరాలను ప్రపంచ జనాభా సమీక్ష నివేదిక వెల్లడించింది.

రవాణా ఖర్చులు: హ్యూస్టన్, డల్లాస్ వంటి నగరాల్లో నెలవారీ ప్రజా రవాణా పాస్ ధర దాదాపు రూ.6వేలు దాకా ఉంటుంది.

ఆహారం, కిరాణా సరుకుల ధరలు: అల్బుకెర్కీ ఏరియాలో కిరాణా సరుకుల ధరలు అమెరికా జాతీయ సగటు కంటే 5 శాతం తక్కువగా ఉంటాయి. ఇక్కడ భోజనం ఛార్జీలు తక్కువే. మెంఫిస్, న్యూ ఓర్లీన్స్ నగరాల్లో ఉన్న మధ్య-శ్రేణి రెస్టారెంట్‌లో ఇద్దరు వ్యక్తులు కలిసి భోజనం చేస్తే దాదాపు రూ.4,100 ఖర్చవుతాాయి.

యుటిలిటీ, ఇంటర్నెట్ బిల్స్ : లాస్ వెగాస్, సాల్ట్ లేక్ సిటీలలో యుటిలిటీ బిల్స్ సగటున నెలకు రూ.13వేల నుంచి రూ.17వేల దాకా ఉంటాయి. ప్రతినెలా ఇంటర్నెట్ బేస్ ప్యాకేజీ సేవల కోసం దాదాపు రూ.5వేల దాకా చెల్లించాల్సి ఉంటుంది.

స్పష్టమైన అవగాహన కోసం
అమెరికాకు వెళ్లే వారు పై అంశాలపై ముందే ఒక అవగాహనకు వస్తే అందుకు అనుగుణంగా ప్లానింగ్ చేసుకోవచ్చు. అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకొని అక్కడ ఉంటూ కార్యకలాపాలను సాగించేందుకు వీలు కలుగుతుంది. విద్యార్థులు ముందస్తుగా ఈ అంశాలపై ప్లానింగ్ చేసుకుంటే వారిపై అదనపు ఒత్తిడి ఉండదు. ఆర్థిక భారం కూడా చాలా వరకు తగ్గిపోతుంది. స్పష్టమైన విజన్‌తో చదువుపై ఫోకస్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ ఆర్టికల్​లో చెప్పినవి మీ అవగాహన కోసం మాత్రమే. కాలానుగుణంగా ఈ జీవన వ్యయాల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయని మీరు గుర్తుంచుకోవాలి.

యుద్ధానికి సిద్ధమవుతున్న ఇరాన్, ఇజ్రాయెల్​ - అగ్నికి ఆజ్యం పోస్తున్న రష్యా! - Israel Iran War Preparations

'పది రూపాయల నాణెం చెల్లుతుంది - కాదంటే శిక్ష తప్పదు' - ఆర్​బీఐ - Awareness On Ten Rupees Coin

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.