ETV Bharat / education-and-career

టెన్త్​, ఇంటర్​ అర్హతలతో ​- NPCILలో భారీగా ఉద్యోగాల భర్తీ - ఇలా అప్లై చేసుకోండి! - NPCIL Recruitment 2024 - NPCIL RECRUITMENT 2024

NPCIL Jobs 2024: నిరుద్యోగులకు.. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐఎల్) సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. 270కి పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి, ఈ పోస్టులకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? జీతం, వయో పరిమితి, అర్హతలు తదితర వివరాలు ఇప్పుడు చూద్దాం..

NPCIL Recruitment 2024
NPCIL Jobs For Freshers (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Aug 22, 2024, 6:50 AM IST

NPCIL Recruitment 2024 Details: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎన్​పీసీఐఎల్​) 279 Category-II Stipendiary Trainees (Operator/Maintainer) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలని సూచించింది. మరి, ఈ జాబ్స్​కి(Jobs) అప్లై చేసుకోవాలంటే కావాల్సిన విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, పరీక్ష విధానం, ఎంపిక విధానం వంటి తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఖాళీల వివరాలు : ​Category-II Stipendiary Trainee (ST/TN)-Operator విభాగం కింద 153 ఉద్యోగాలకు, Category-II Stipendiary Trainee (ST/TN)-Maintainer విభాగం కింద 126 పోస్టులకు NPCIL నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

విద్యార్హతలు(Eligibility Criteria): Category-II Stipendiary Trainee (ST/TN)-Operator, Maintainer పోస్ట్​కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్​స్టిట్యూట్​ నుంచి 10th, ITI, ఇంటర్​ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి(Age Limit): Category-II Stipendiary Trainee (ST/TN)-Operator, Maintainer జాబ్స్​కి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 18 ఏళ్ల నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

అప్లికేషన్ ఫీజు(Application Fee): జనరల్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కేటగిరీలకు చెందిన వారందరూ అప్లికేషన్ ఫీజు కింద రూ. 100 చెల్లించాలి. అదే.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు, మహిళలు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ(Selection Process): NPCIL నోటిఫికేషన్ 2024 ప్రకారం.. ఎంపిక విధానం రెండు స్టేజెస్​లో ఉంటుంది. ఇందులో మొదటిది ప్రిలిమినరీ ఎగ్జామ్ కాగా.. రెండోది Advance టెస్ట్ ఉంటుంది. అలాగే.. Maintainer ఉద్యోగం కోసం అప్లై చేసినవారికి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అదే.. Operator జాబ్ కోసం అప్లై చేసినవారికి ఎలాంటి స్కిల్ టెస్ట్ ఉండదు.

జీతం(Salary): Category-II Stipendiary Trainee (ST/TN)-Operator, Maintainer పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండు సంవత్సరాల ట్రైనింగ్​ ఉంటుంది. ఆ రెండు సంవత్సరాలలో మొదటి సంవత్సరం స్టైపండ్​గా రూ.20వేలు చెల్లిస్తారు. రెండో సంవత్సరం రూ.22వేలు చెల్లిస్తారు. ట్రైనింగ్​ పూర్తయి కన్ఫర్మేషన్​ తర్వాత అన్ని అలవెన్సులు కలిపి నెల జీతంగా రూ.32వేల పైనే చెల్లిస్తారు.

అప్లికేషన్ విధానం(Application Process):

  • ఇందుకోసం ముందుగా NPCIL అధికారిక వెబ్​సైట్​ను సందర్శించాలి. ఆ తర్వాత లాగిన్ డీటెయిల్స్​తో లాగిన్ కావాలి.
  • ఒకవేళ మీరు మొదటిసారి అప్లై చేస్తున్నట్లయితే ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకోవాలి. అనంతరం ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అయ్యాక.. అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు కరెక్ట్​గా నమోదు చేయాలి.
  • అలాగే.. అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్​ చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • ఇక చివరగా డీటెయిల్స్ అన్ని కరెక్ట్​గా ఎంటర్ చేశారో లేదో ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని "సబ్మిట్" ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • అయితే, అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేశాక ప్రింట్ అవుట్ తీసుకోండి. ఇది భవిష్యత్తులో ఇతర అవసరాలకు యూజ్ అవుతుంది.

ముఖ్యమైన తేదీలు :

  • దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 2024 ఆగస్టు 22, ఉదయం 10 గంటల నుంచి
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 సెప్టెంబర్ 11, సాయంత్రం 4 గంటల వరకు.
  • అఫీషియల్​ నోటిఫికేషన్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

ఇవీ చదవండి :

ఇంటర్​, డిప్లొమా అర్హతలతో - వాయుసేనలో అగ్నివీర్​ (స్పోర్ట్స్‌) పోస్టులు - దరఖాస్తు చేయండిలా!

డిప్లొమా అర్హతతో - రైల్వేలో 7951 జేఈ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.