NFL Recruitment 2024 : నోయిడాలోని 'నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్' దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్ఎఫ్ఎల్ యూనిట్లు/ కార్యాలయాల్లోని 336 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు నవంబర్ 8వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
యూనిట్లు/ కార్యాలయాలు : కార్పొరేట్ ఆఫీస్, మార్కెటింగ్ డివిజన్, నంగల్ యూనిట్, బటిండా యూనిట్, పానిపట్ యూనిట్, విజయపూర్ యూనిట్
ఖాళీల వివరాలు :
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ప్రొడక్షన్) - 108 పోస్టులు
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) - 06 పోస్టులు
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఇన్స్ట్రుమెంటేషన్) - 33 పోస్టులు
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (ఎలక్ట్రికల్) - 14 పోస్టులు
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (కెమికల్ ల్యాబ్) - 10 పోస్టులు
- స్టోర్ అసిస్టెంట్ - 19 పోస్టులు
- లోకో అటెండెంట్ గ్రేడ్-II - 05 పోస్టులు
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) డ్రాఫ్ట్స్మన్ - 04 పోస్టులు
- జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-II (మెకానికల్) ఎన్డీటీ - 04 పోస్టులు
- నర్స్ - 10 పోస్టులు
- ఫార్మసిస్ట్ - 10 పోస్టులు
- ల్యాబ్ టెక్నీషియన్ - 04 పోస్టులు
- ఎక్స్-రే టెక్నీషియన్ - 02 పోస్టులు
- అకౌంట్స్ అసిస్టెంట్ - 10 పోస్టులు
- అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) ఫిట్టర్ - 40 పోస్టులు
- అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) వెల్డర్ - 03 పోస్టులు
- అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) ఆటో ఎలక్ట్రీషియన్ - 02 పోస్టులు
- అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) డీజిల్ మెకానిక్ - 02 పోస్టులు
- అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) టర్నర్ - 03 పోస్టులు
- అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) మెషినిస్ట్ - 02 పోస్టులు
- అటెండెంట్ గ్రేడ్-I (మెకానికల్) బోరింగ్ మెషిన్ - 01 పోస్టు
- అటెండెంట్ గ్రేడ్-I (ఇన్స్ట్రుమెంటేషన్) - 04 పోస్టులు
- అటెండెంట్ గ్రేడ్-I (ఎలక్ట్రికల్) - 33 పోస్టులు
- లోకో అటెండెంట్ గ్రేడ్-III - 04 పోస్టులు
- ఓటీ టెక్నీషియన్ - 03 పోస్టులు
- మొత్తం పోస్టుల సంఖ్య - 336.
విద్యార్హతలు : పోస్టులను అనుసరించి మెట్రిక్యులేషన్ సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీకాం, బీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి : 2024 సెప్టెంబర్ 30 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏళ్లు నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము : జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.200 చెల్లించాలి. ఇక ఈఎస్ఎం, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 అక్టోబర్ 9
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 నవంబర్ 8
- దరఖాస్తు సవరణ తేదీలు : 2024 నవంబర్ 10 నుంచి 11 వరకు.
ముఖ్యాంశాలు :
- ఎన్ఎఫ్ఎల్ యూనిట్లు/ కార్యాలయాల్లో 336 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
- అర్హులైన అభ్యర్థులు నవంబర్ 8వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.