Junior Lineman Notification Soon in Telangana : రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల్లో జూనియర్ లైన్‌మెన్ (జేఎల్‌ఎం) ఖాళీల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. నగరంలోని కేంద్రంగా ఉన్న దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్), వరంగల్ కేంద్రంగా ఉన్న ఉత్తర తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థల్లో (టీఎన్‌ఎస్పీడీసీఎల్) కలిపి 3,500 వరకు జూనియర్ లైన్‌మెన్, ఇతర పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు వీటి భర్తీకి ఈనెలలోనే ఉద్యోగ ప్రకటన జారీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాయి. వీటి భర్తీకి ఈ నెలలోనే ఉద్యోగ ప్రకటన జారీచేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
టీజీఎస్పీడీసీఎల్‌లో 1,550 వరకు జూనియర్ లైన్‌మెన్ పోస్టులు ఉండగా నగర పరిధిలోనే 550 ఖాళీలున్నాయి. గతంలో నియామక నోటిఫికేషన్ మేరకు అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో హైదరాబాద్‌లో 200 వరకు పోస్టులు మిగిలిపోయాయి. తాజాగా వీటన్నిటిని కలిపి నోటిఫికేషన్ జారీకి అధికారులు చర్యలు చేపట్టారు. మహిళలు కూడా జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు అర్హులే. జేఎల్‌ఎంతో పాటు 50 వరకు అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు టీజీఎస్పీడీసీఎల్ నియామక ప్రకటన జారీ చేయనుంది.
ఎస్సీ వర్గీకరణపై ఎలా ? : ఈ నెలలోనే జూనియర్ లైన్‌మెన్, ఏఈ పోస్టుల భర్తీకి నోటిఫికెషన్ ఇచ్చేందుకు డిస్కంలు ప్రయత్నిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ అనుమతి మేరకే ముందుకు వెళ్లనున్నాయి. ఎస్సీ వర్గీకరణ గురించి తేలిన తర్వాతే తదుపరి ఉద్యోగ నోటిఫికేషన్లు ఇటివలే ఉపసంఘం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగానే ఉద్యోగ ప్రకటన ఇచ్చి, పోస్టుల భర్తీ నాటికి వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వనిర్ణయం ఆధారంగా వ్యవహరించాలని డిస్కంలు ఆలోచనలు చేస్తున్నాయి. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర సర్కార్ అనుమతిస్తే ఈనెలలోనే జూనియర్ లైన్‌మెన్, ఏఈ పోస్టుల ప్రకటన వెలువడనుంది.
ఇప్పటికే కొందరు అభ్యర్థులు సన్నద్ధమవుతుండగా నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు మహిళలను కూడా అర్హులుగా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూనియర్ లైన్‌మెన్ పోస్టులకు మహిళలు సైతం పోటీ పడుతున్నారు.
భారీ వేతనంతో ఇన్సూరెన్స్ కంపెనీలో జాబ్స్ - మీ చేతిలో డిగ్రీ ఉందా- ఐతే అప్లై చేసుకోండిలా!
20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు - 'జాబ్ ఫస్ట్' థీమ్‌తో ఏపీ సర్కార్ ముందడుగు