ETV Bharat / education-and-career

ITBPలో 128 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా! - ITBP Recruitment 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 10:04 AM IST

ITBP Recruitment 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​. ఐటీబీపీ 128 హెడ్ కానిస్టేబుల్​, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

ITBP
ITBP (ANI)

ITBP Recruitment 2024 : కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ) నాన్ గెజిటెడ్‌ (నాన్-మినిస్టీరియల్) గ్రూప్-సీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్టెంబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు

  • హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) (పురుషులు/ మహిళలు) : 09 పోస్టులు
  • కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) (పురుషులు/ మహిళలు) : 115 పోస్టులు
  • కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) (పురుషులు మాత్రమే) : 4 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య : 128

విద్యార్హతలు

  • హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీ సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు చేసి ఉండాలి.
  • కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి

  • హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 2024 సెప్టెంబర్​ 10 నాటికి 18 ఏళ్లు నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.
  • కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 2024 సెప్టెంబర్​ 10 నాటికి 18 ఏళ్లు నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
  • మహిళలు, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతభత్యాలు

  • హెడ్ కానిస్టేబుల్‌కు నెలకు రూ.25,500 వేతనం ఇస్తారు.
  • కానిస్టేబుల్‌కు నెలకు రూ.21,700 జీతం అందిస్తారు.

దరఖాస్తు విధానం :

  • అభ్యర్థులు ముందుగా ITBP అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • రిక్రూట్​మెంట్ సెక్షన్​లోకి వెళ్లి అప్లికేషన్ లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్​ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 ఆగస్టు 30
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 సెప్టెంబర్​ 29

ముఖ్యాంశాలు :

  • ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ఐటీబీపీ)- 128 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
  • అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.