ISRO Jobs 2024 : బెంగళూరులోని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) 224 టెక్నీషియన్, టెక్నికల్ అసిస్టెంట్ సహా వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (యూఆర్ఎస్సీ), ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్‌వర్క్‌ల్లో పనిచేయాల్సి ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
సైంటిస్ట్/ ఇంజినీర్ | 5 పోస్టులు |
టెక్నికల్ అసిస్టెంట్ | 55 పోస్టులు |
సైంటిఫిక్ అసిస్టెంట్ | 6 పోస్టులు |
లైబ్రరీ అసిస్టెంట్ | 1 పోస్టు |
టెక్నీషియన్-బీ/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బీ | 142 పోస్టులు |
ఫైర్‌మ్యాన్-ఏ | 3 పోస్టులు |
కుక్ | 4 పోస్టులు |
లైట్ వెహికల్ డ్రైవర్-ఏ | 6 పోస్టులు |
హెవీ వెహికల్ డ్రైవర్-ఏ | 2 పోస్టులు |
మొత్తం పోస్టులు | 224 |
విభాగాలు
మెకాట్రానిక్స్, మెటీరియల్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ప్లంబర్, టర్నర్, కార్పెంటర్, వెల్డర్
విద్యార్హతలు
ISRO Jobs Qualifications : అభ్యర్థులు ఆయా పోస్టులను అనుసరించి 10వ తరగతి, ఇంటర్ సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డ్రైవర్ పోస్టులకు డ్రైవింగ్ లైసెన్స్, పని అనుభవం కూడా కచ్చితంగా ఉండాలి.
ఉద్యోగాలు - వయోపరిమితులు
ISRO Jobs Age Limit :
సైంటిస్ట్/ ఇంజినీర్ | 18 - 30 ఏళ్లు |
టెక్నికల్ అసిస్టెంట్ | 18 - 35 ఏళ్లు |
సైంటిఫిక్ అసిస్టెంట్ | 18 - 35 ఏళ్లు |
లైబ్రరీ అసిస్టెంట్ | 18 - 35 ఏళ్లు |
టెక్నీషియన్-బీ/ డ్రాఫ్ట్స్‌మ్యాన్-బీ | 18 - 35 ఏళ్లు |
ఫైర్‌మ్యాన్-ఏ | 18 - 25 ఏళ్లు |
కుక్ | 18 - 35 ఏళ్లు |
లైట్ వెహికల్ డ్రైవర్-ఏ | 18 - 35 ఏళ్లు |
హెవీ వెహికల్ డ్రైవర్-ఏ | 18 - 35 ఏళ్లు |
దరఖాస్తు రుసుము
ISRO Jobs Application Fee :
- టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టులకు అప్లికేషన్ ఫీజుగా రూ.250, ప్రాసెసింగ్ ఫీజుగా రూ.750 చెల్లించాలి. అయితే ప్రాసెసింగ్ ఫీజును తరువాత రీ-ఫండ్ చేస్తారు.
- టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్-బీ, కుక్, ఫైర్‌మ్యాన్-ఏ, లైట్ వెహికల్ డ్రైవర్-ఏ, హెవీ వెహికల్ డ్రైవర్-ఏ పోస్టులకు రూ.500 దరఖాస్తు రుసుముగా చెల్లించాలి. దీనిలో రూ.100 రీ-ఫండ్ చేస్తారు.
ఎంపిక విధానం
ISRO Jobs Selection Process : అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష/ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. దీనిలో ఉత్తీర్ణులైన వారికి స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. వీటన్నింటిలో క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం
ISRO Jobs Online Application Process :
- అభ్యర్థులు ముందుగా ఇస్రో అధికారిక వెబ్సైట్ https://www.isro.gov.in/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజ్‌లోని Careers ట్యాబ్‌పై క్లిక్ చేయాలి.
- కెరీర్స్ సెక్షన్లో ఉన్న అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ ఫారమ్‌లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి.
- దరఖాస్తు రుసుమును కూడా ఆన్లైన్లోనే చెల్లించాలి.
- అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకొని, అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
ISRO Recruitment 2024 Apply Last Date :
- ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 10
- ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 3
నాన్-ఇంజినీరింగ్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? ఈ టాప్-10 కెరీర్ ఆప్షన్స్‌పై ఓ లుక్కేయండి!
IDBI బ్యాంకులో 500 ఉద్యోగాలు- రూ.50వేల శాలరీ, అప్లైకు లాస్ట్ డేట్ ఎప్పుడంటే?