India Post GDS Recruitment 2024 : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 44,228 పోస్టుల భర్తీ కోసం గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం)
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం)
- డాక్ సేవక్
తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య
- ఆంధ్రప్రదేశ్ - 1355 పోస్టులు
- తెలంగాణ - 981 పోస్టులు
విద్యార్హతలు
India Post GDS Jobs Eligibility : అభ్యర్థులు పదో తరగతి పాసైతే చాలు.
వయోపరిమితి
India Post GDS Age Limit : అభ్యర్థుల వయస్సు 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
India Post GDS Application Fee : అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం
India Post GDS Selection Process : పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు.
జీతభత్యాలు
India Post GDS Salary :
- బ్రాంచ్ పోస్ట్ మాస్టర్‌కు నెలకు రూ.12,000 నుంచి 29,380 వరకు జీతం ఉంటుంది.
- అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, డాక్ సేవక్ పోస్టులకు నెలకు రూ.10,000 నుంచి రూ.24,470 జీతం ఇస్తారు.
దరఖాస్తు విధానం
India Post GDS Application Process :
- అభ్యర్థులు ముందుగా ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేయాలి.
- మీ వ్యక్తిగత వివరాలు, ఈ-మెయిల్, ఫోన్ నంబర్లను ఎంటర్ చేసి, పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
- తరువాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
- తరువాత Apply Online లింక్‌పై క్లిక్ చేసి, మీ డివిజన్, పోస్ట్ ప్రిఫరెన్స్‌లను ఎంచుకోవాలి.
- మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
- మీ ఫొటో, సిగ్నేచర్లను కూడా అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
- ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 జులై 15
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఆగస్టు 5
- దరఖాస్తు సవరణ తేదీలు : 2024 ఆగస్టు 6 నుంచి 8 వరకు