ETV Bharat / education-and-career

ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడాలా? - ఈ టిప్స్‌తో సులభంగా నేర్చుకోవచ్చు! - Spoken English Skill Tips

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Spoken English Skill Tips : ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయమా? మాట్లాడాలని ఉన్నా, తప్పులొస్తే పక్కవారు బట్లర్‌ ఇంగ్లీష్‌ అని హేళన చేస్తారని జంకుతున్నారా? ఈ కింది మెళకువలు ప్రయత్నించి నేర్చుకోవడం ప్రారంభిస్తే ఇంట్లోనే సులభంగా ఆంగ్ల భాషా నైపుణ్యాలు నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్‌ను ఎలా నేర్చుకోవాలో ఈ కింది స్టోరీలో తెలుసుకుందాం.

Spoken English Tips
Spoken English Skill Tips (Etv Bharat)

Spoken English Tips in Telugu : ఉన్నత చదువులు చదివినా చాలా మంది ఇంగ్లీష్‌లో మాట్లాడాలంటే భయపడిపోతుంటారు. భాషపై అవగాహన ఉన్నా ఎదుటి వ్యక్తులు తప్పులు ఎత్తిచూపుతారేమోనని ఒకవైపు, సందర్భానుసారం పదాలు దొరక్క ఇంకో వైపు వెనకడుగేస్తారు. ఈ భయాలు పోవాలంటే సమాధానం ఒక్కటే.. అదే ఇంగ్లిష్‌ నేర్చుకోవడమే! ఈ ఉరుకుల పరుగుల జీవితంలో కొత్తగా నేర్చుకోవడం కాదులే అనుకుంటే ఇక ఎప్పటికీ నేర్చుకోలేరు. మీ ఇంట్లో రోజువారీ పనుల్లో భాగంగానే కొన్ని మెళకువలు పాటించి ఆడుతూ పాడుతూ మీ ఇంగ్లీష్ స్కిల్స్‌ను పెంచుకోవచ్చు. మరి, ఆ టిప్స్‌ చూద్దామా!

సినిమాలు చూడాలి : మీ చుట్టు పక్కల ఉన్నవారితో వీలైనంత మేర ఇంగ్లీష్‌లో మాట్లాడడానికి ప్రయత్నించండి. ఇంగ్లీష్‌లో మూవీలు చూడటం, పాటలు వినడం వంటివి చేయండి. ఇంగ్లీష్‌పై పట్టు పెంచుకొనేందుకు ఆంగ్ల పుస్తకాలు చదవడం ప్రారంభించండి. ఇంగ్లీషు సినిమాలు అనగానే ‘సూపర్‌మ్యాన్‌, ‘స్పైడర్‌ మ్యాన్‌’, బ్యాట్‌మ్యాన్‌, ‘అవెంజర్స్‌’ వంటి సూపర్‌ హీరోల చిత్రాలే చాలా మందికి గుర్తొస్తాయి. అవి చూసేది కేవలం యాక్షన్‌, థ్రిల్లర్‌ కోసం మాత్రమే.

కానీ అంతకంటే మరెన్నో మంచి చిత్రాలు ఉన్నా అవి ఇంగ్లీష్‌లో ఉండటంతో చాలా మంది జంకుతారు. ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అనే సామెతలా ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటే అవే అర్థం అవుతూ భాషపై పట్టువస్తుంది. వారు పలికేది అర్థం కాకపోతే సబ్‌టైటిల్స్‌తో చూస్తే చాలా ఉపయోపడుతుంది. తెలుగు చిత్రాలకు కూడా ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌ వస్తున్నాయి. వాటిని ఆన్‌లో పెట్టుకుని చూడడం ఉత్తమం.

పాడ్‌కాస్ట్ వినండి : ప్రస్తుతకాలంలో దాదాపు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌, హెడ్‌సెట్‌ ఉంటున్నాయి. వీలు చిక్కినప్పుడల్లా చాలా మందికి మ్యూజిక్ వినడం అలవాటే. అప్పుడప్పడు ఇంగ్లీషు పాటలు వింటుంటే మేలు జరగుతుంది. ఇప్పుడు దాదాపు అన్ని మ్యూజిక్‌ ప్లేయర్లలో పాడ్‌కాస్ట్‌లు వస్తున్నాయి. మీకిష్టమైన సబ్జెక్ట్‌కు సంబంధించిన పాడ్‌కాస్ట్‌ను ఇంగ్లీష్‌లో వినండి. అలాగే వీలైతే ఆడియో బుక్స్‌ కూడా వినండి. దీని వల్ల ఆంగ్ల పదాలు పలికే విధానం తెలుస్తుంది.

మీకు వార్తలంటే ఇష్టముంటే రోజూ ఇంగ్లీష్ న్యూస్‌పేపర్లను తిరగేయండి. మీ చుట్టూ జరిగే వార్తల గురించి చదువుతూ ఉంటే కొత్త కొత్త పదాలు అవే వస్తాయి. ఏవైనా తెలియకపోతే డిక్షనరీని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మొబైల్స్‌లోనూ డిక్షనరీ యాప్‌లున్నాయి. టైప్‌ చేసిన వెంటనే పదానికి అర్థం తెలుస్తుంది. రోడ్లపై కనిపించే ప్రకటనల యాడ్‌బోర్డులు ఎక్కువగా ఇంగ్లీష్‌లో ఉంటాయి. వీటిని చదివి అర్థం తెలియకపోతే డిక్షనరీలో వెతికితే ఎప్పటికీ గుర్తుంటాయి.

అలాగే, ఎక్కువగా కార్లను గమనించండి. వీటి పేర్లు అనేకం ఉంటాయి. omni అనేది మారుతి సుజుకీ కంపెనీ వాహనం. దీని అర్థం a vehicle used for several purposes.ఇలా నూతన పదాలు, అర్థాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు అందరూ వాట్సాప్‌ను వాడుతున్నారు. ఏదో ఒక గ్రూపులో మీరూ సభ్యులుగా ఉంటారు. అప్పుడప్పుడూ మీ అభిప్రాయాలను ఇంగ్లీషులో తెలియజేస్తూ ఉండండి. అలాగని గ్రూపులో మీ భాషా తప్పుల్ని ఎత్తి చూపుతారని భయపడకండి. చాలా మంది ఇలా భయపడే ముందడుగు వేయలేరు.

ఆంగ్లభాషా పరిజ్ఞానం పెంచుకొనేందుకు సోషల్‌మీడియా గ్రూప్‌లు, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ ఫోరమ్‌లు, లాంగ్వేజ్‌ ఎక్స్‌ఛేంజ్‌ మొదలగు వేదికల్లో చేరండి. వీటి ద్వారా స్థానిక స్పీకర్లతో పాటు తోటి అభ్యాసకులతో మీరు మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. అలా చేస్తే మాండలికాలు తెలియడంతో పాటు భాషోచ్చారణ మెళకువలు తెలుస్తాయి. మీ మాటలు, ఆలోచనలు అన్నీ ఇంగ్లీష్‌లోనే ఉండేలా చూసుకోండి. మీరు పక్కవారితో జరిపే చర్చలు, మీ ఆలోచనలను ఇంగ్లీష్‌ భాషలోనే చెప్పండి.

ఈ యాప్స్‌తో సులభం : మీ భాషా ఉచ్ఛారణపైనా దృష్టిపెట్టి, అప్పుడప్పుడూ కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేసి మాట్లాడుతుండండి. మనకు ఉచితంగా లభించే సేవ ఇది. మీతో మాట్లాడే వ్యక్తి ఎవరో తెలియదు కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారన్న భయం ఉండదు. ఇంగ్లీష్‌ నేర్చుకొనేందుకు hello English, Rosetta Stone, Duolingo, Babbel, fluentU, Memrise వంటి యాప్‌లను ఉపయోగించవచ్చు. వీటిలో ఇంటరాక్టివ్‌ అభ్యాసాలు, లాంగ్వేజ్‌ ప్రక్రియల్లో పాల్గొనడం ద్వారా భాష నేర్చుకోవచ్చు.

మీ డైరీని ఇంగ్లీష్‌లో రాయడం అలవాటు చేసుకోండి. మీ ఆలోచనలు, అనుభవాలు మీకు ఇష్టమైన అంశాలను ఒక పుస్తకంలో రాయడం ద్వారా మీ వొకబ్యూలరీ పెరుగుతుంది. వాక్య నిర్మాణం మెరుగుపడుతుంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడటం వచ్చే వారితో స్నేహం చేయండి. వారితో ప్రతిరోజూ ఇంగ్లీష్‌లో మాట్లాడటం ద్వారా త్వరగా మెరుగుపడుతారు. మీరు ఏదైనా తప్పులు మాట్లాడితే వారు సరిచేయడం ద్వారా ఇంకా బాగా నేర్చుకోవచ్చు.

ఇంగ్లీష్ నేర్చుకోవంలో మరీ ముఖ్యంగా భారంగా అనుకోకూడదు. ఆడుతూ పాడుతూ నేర్చుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. నేర్చుకోవడం ప్రారంభించి మధ్యలో ఆపేయడం మంచిది కాదు. నేర్చుకోవాలన్న కోరిక నిత్యం కొనసాగించాలి. మొదట్లో కష్టం అనిపించినా కొన్నాళ్లకు కొద్దికొద్దిగా మాట్లాడడం వస్తున్నప్పుడు వచ్చే ఆ కిక్కు వేరుంటుంది. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు. ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇప్పటి నుంచే ప్రారంభించండి!!

SBI భారీ నోటిఫికేషన్‌ - 1511 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ - దరఖాస్తుకు మరో 3రోజులే ఛాన్స్‌! - SBI SO Recruitment 2024

నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌ - రైల్వే శాఖలో 14,298 టెక్నీషియన్ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB Technician Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.