Highest Salary Courses : చాలా మంది తమ చదువుకు తగిన ఉద్యోగం రాలేదని నిరాశ చెందుతుంటారు. అలాంటి వారు ప్రస్తుతం జాబ్ మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న కోర్సులను చేస్తే వేగంగా ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. దీంతో పాటు అత్యధిక వేతనం వచ్చే ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం 2024లో జాబ్మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉన్న కోర్సులు డేటా సైన్స్, బిజినెస్ అనలిటిక్స్. వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
అసలేంటీ డేటా సైన్స్?
ప్రస్తుత సమాచార సాంకేతిక విప్లవంలో డేటా సైన్స్ అన్నిరంగాలకు విస్తరించింది. పెద్ద మొత్తంలో డేటాను సేకరించి విశ్లేషించడమే ఈ డేటా సైన్స్ పని. ఇది ఒక మల్టీ డిసిప్లినరీ కోర్స్. స్ట్రక్చర్డ్, అన్స్ట్రక్చరిడ్ డేటా నుంచి వివిధ శాస్త్రీయ పద్ధతులు, అల్గారిథంలు ద్వారా సమాచారాన్ని విశ్లేషిస్తారు. దీనినే డేటా సైన్స్ కోర్స్ అంటారు. వీటికి జాబ్మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి అత్యధిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ఈ రంగంలో ఉద్యోగం సాధించాలంటే గణాంకాలు, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ థియరీ వంటి సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉండాలి.
బిజినెస్ అనలిటిక్స్
వివిధ డేటా విశ్లేషణ పరికరాలు, టెక్నిక్‌లు, పద్ధతుల ద్వారా సమాచారాన్ని విశ్లేషించి, డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం, వ్యూహాలను అమలు చేయడానికి డాటా అనలిటిక్స్ అస్త్రం లాంటిది. ప్రస్తుతం శక్తిమంతమైన ఉద్యోగాల్లో ఒకటిగా మార్పు చెందింది. అందువల్ల ఈ సాంకేతికతపై పట్టున్నవారు మంచి జాబ్ సాధించడం సులువే. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో నైపుణ్యాన్ని పొందితే ఆకాశమే హద్దుగా దూసుకుపోవచ్చు.
ఈ కోర్సులను అందించే సంస్థలు, ఫీజుల వివరాలు
మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డేటాసైన్స్, బిజినెస్ అనలిటిక్స్‌లో కోర్సులను అందించే సంస్థలు, ఫీజుల వివరాలు ఇవే.
1. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లమో ఇన్ డేటా సైన్స్
- విద్యాసంస్థ : ఐఐఐటీ బెంగళూరు
- కోర్సు ఫీజు : రూ.3.25 లక్షలు (జీఎస్టీతో కలిపి)
- కోర్సు వ్యవధి : 12 నెలలు
- ఈ సంస్థ ప్లేస్మెంట్ గణాంకాల ప్రకారం శాలరీ హైక్ 57% , అత్యధిక వేతన ప్యాకేజీ 1.23 కోట్లు.
2. ఎంబీఏ ఇన్ బిజినెస్ అనలిటిక్స్
- విద్యా సంస్థ : బిట్స్ పిలానీ
- ఫీజు : రూ.2.5 లక్షలు,
- కోర్సు వ్యవధి : 18 నెలలు
- బిజినెస్ అనలిటిక్స్‌లో ఎంబీఏ కోర్సును బిట్స్ పిలానీ ప్రొఫెషనల్స్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.
- ఈ కోర్సులో భాగంగా నాలుగు సెమిస్టర్ల ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రొగ్రామ్ ఉంటుంది.
3. అడ్వాన్సిడ్ మేనేజ్మెంట్ ప్రొగ్రామ్ ఇన్ బిజినెస్ అనలిటిక్స్
- కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థ : ఐఎస్బీ
- కోర్సు ఫీజు : రూ. 11 లక్షలు
- అప్లై చేయడానికి చివరి తేదీ : 2024 జనవరి 28.
- ఈ కోర్సు క్లాస్రూమ్, టెక్నాలజీ ఆధారిత లెర్నింగ్ ప్రొగ్రాం.
ఛాలెంజింగ్ జాబ్స్ చేయాలా? 2024లో ఉన్న టాప్-6 కెరీర్ ఆప్షన్స్ ఇవే!