ETV Bharat / education-and-career

నాన్​-ఇంజినీరింగ్ జాబ్స్​ కోసం ట్రై చేస్తున్నారా? ఈ టాప్​-10 కెరీర్​ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

Best Non Engineering Jobs For Engineers : మీరు ఇంజినీరింగ్ చేశారా? నాన్​- ఇంజినీరింగ్​ ఉద్యోగాల కోసం కూడా ప్రయత్నిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం జాబ్​ మార్కెట్​లో మంచి డిమాండ్ ఉన్న టాప్​-10 నాన్​- ఇంజినీరింగ్​ జాబ్స్​ వివరాలు మీ కోసం.

non engineering career options
Best Non Engineering Jobs For Engineers
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2024, 12:46 PM IST

Best Non Engineering Jobs For Engineers : ప్రస్తుత కాలంలో ఇంజినీరింగ్ ఉద్యోగాలకే కాదు నాన్-ఇంజినీరింగ్ ఉద్యోగాలకు కూడా బాగా ప్రాధాన్యం పెరిగింది. కొంత మంది ఇంజినీరింగ్ చేసినప్పటికీ, సరైన అవకాశాలు లేక నాన్​ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్​. జాబ్​ మార్కెట్​లో బెస్ట్​ నాన్​-ఇంజినీరింగ్ ఉద్యోగాలేంటి? వాటిని పొందాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

  1. టెక్నికల్ రైటర్స్ : సైంటిఫిక్​, మెకానికల్​, టెక్నాలజీ అంశాలకు సంబంధించి ఇన్​స్ట్రక్షన్​ మెటీరియల్స్​, ఆపరేషన్​ డాక్యుమెంట్లను రాయడమే ఈ టెక్నికల్ రైటర్స్​ ప్రధానమైన పని. ఉదాహరణకు తయారీ రంగంలో పనిచేస్తున్న వారికి ఇన్​స్ట్రక్షన్​ మాన్యువల్​ లాంటివి రూపొందించవచ్చు. దీనివల్ల ఆ సంస్థలో పనిచేస్తున్న వారికి ఆ మాన్యువల్​ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  2. లాజిస్టిక్స్ : రవాణా కంపెనీలు, వేర్​హౌస్​లు లేదా తయారీ ప్లాంట్లలో ప్రొడక్ట్​లను నిల్వ చేయడం, డెలివరీస్​ అందివ్వడం లాజిస్టిక్స్​ మేనేజర్​ ప్రధానమైన విధి. హోల్​సేల్​ లేదా ఇతర వేర్​హౌస్​ సిబ్బందితో ప్రొడక్ట్​ ఆర్డర్​లు, డెలివరీ టైమింగ్స్ నిర్వహణ లాంటి విషయాలను చూసుకునేందుకే ఈ లాజిస్టిక్స్​ మేనేజర్లను నియమిస్తుంటారు.
  3. మాన్యుఫాక్చురింగ్​ మేనేజర్ : తయారీ సంస్థల్లో రోజువారీ పనులను పర్యవేక్షించడం మాన్యుఫాక్చురింగ్​ మేనేజర్ల ముఖ్యమైన పని. వీటితో పాటు సూపర్​వైజర్లను నియమించడం, శిక్షణ ఇవ్వడం మొదలైన వ్యవహరాలన్నింటిని చూసుకోవాల్సిన బాధ్యత ఈ మాన్యుఫాక్చురింగ్​ మనేజర్స్​పై ఉంటుంది.
  4. టెక్నికల్ సేల్స్ రిప్రజెంటేటివ్​ : ప్రొడక్టులను గురించి వివరించి సేల్స్​ను పెంచేందుకు ఈ టెక్నికల్ సేల్స్ రిప్రజెంటేటివ్​ పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఆయా ప్రొడక్టుల గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఈ రంగంలో మంచి స్థాయికి వెళ్లాలంటే గొప్ప నైపుణ్యాలను ఉపయోగించి పనిచేయాల్సి ఉంటుంది.
  5. టెక్నికల్​ కన్సల్టెంట్ జాబ్​ : వ్యాపార సంస్థలకు ఏవైనా బిజినెస్​ సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు సలహాలు, సూచనలు అందించడమే ఈ టెక్నికల్​ కన్సల్టెంట్​ల ముఖ్యమైన పని. మీరు సూచించే పరిష్కార మార్గాల వల్ల సంస్థ మరింత లాభాల్లోకి వెళ్లవచ్చు. అందువల్లే చాలా సంస్థలు టెక్నికల్​ కన్సల్టెంట్​లను రిక్రూట్​ చేసుకుంటూ ఉంటాయి. ఒక వేళ మీకు ఈ రంగంపై ఆసక్తి ఉంటే వ్యాపార రంగంలో మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
  6. టీచింగ్ జాబ్స్ : ఇంజినీరింగ్​ కాలేజ్​లో టీచింగ్​ విభాగంలో జాబ్​లకు మంచి డిమాండ్ ఉంటుంది. స్టూడెంట్స్​కు సబ్జెక్టుతో పాటు విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంచడం, ప్రొబ్లమ్ సాల్వింగ్ స్కిల్​ను పెంపొందించడంమే ఈ టీచింగ్​ జాబ్స్ ముఖ్యమైన పని. సబ్జెక్టుపై అవగాహన ఉంటే మంచి వేతనంతో జాబ్​ను సొంతం చేసుకోవచ్చు.
  7. స్టాక్ ట్రేడర్​ : స్టాక్​ ట్రేడర్​ షేర్​ మార్కెట్​లో అమ్మకాలు కొనుగోలును చేస్తుంటారు. సాధారణంగా ఈ ట్రేడర్లు వివిధ సంస్థల ట్రేడింగ్ చేస్తుంటారు.
  8. కన్​స్ట్రక్షన్ మేనేజర్ : కన్​స్ట్రక్షన్​ కంపెనీలు వారు చేపడుతున్న నిర్మాణాలను పర్యవేక్షించడానికి మేనేజర్లను నియమించుకుంటాయి. ఈ ఉద్యోగాలు సైతం మంచి ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది.
  9. కంటెంట్ క్రియేటర్ : హెల్త్​, టెక్నాలజీ, బిజినెస్​, రాజకీయాలు ఇలా వివిధ అంశాలను డిజిటల్​ మీడియాకు, బ్లాగ్​లకు రాసేవారినే కంటెంట్ క్రియేటర్​ అంటారు. ప్రస్తుతం జాబ్​మార్కెట్​లో ఈ ఉద్యోగాలకు చాలా డిమాండ్ ఉంది.
  10. గ్రాఫిక్స్ డిజైనర్స్ : సాఫ్ట్​వేర్​ ప్రోగ్రాంలను ఉపయోగించి వెబ్​సైట్​ లేఔట్స్​, ఇన్ఫోగ్రాఫిక్స్​, మ్యాగజైన్స్​ను క్రియేట్ చేసేవారిని గ్రాఫిక్ డిజైనర్లు అంటారు. వీరికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారా? 2024లో ఫుల్​ డిమాండ్ ఉన్న టాప్​-6 జాబ్స్​ ఇవే!

ఛాలెంజింగ్ జాబ్స్ చేయాలా? 2024లో ఉన్న టాప్-6​ కెరీర్ ఆప్షన్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.