10 Best Career Options After 12th Arts : ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏ కోర్సు చేయాలన్న అయోమయం చాలా మంది విద్యార్థులకు ఉంటుంది. ముఖ్యంగా ఆర్ట్స్ విద్యార్థులకు ఎలాంటి కెరీర్ ఆప్షన్ ఎంచుకోవాలి? అనే సంశయం ఉంటుంది. అయితే విద్యార్థులు తమ అభిరుచికి అనుగుణమైన కోర్సులను ఎంచుకుంటేనే, కెరీర్ పూలబాటలా ఉంటుంది. అందుకే ఆర్ట్స్ విద్యార్థులకు ఉపయోగపడే టాప్-10 కెరీర్ ఆప్షన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ : బీఎఫ్ఏ అనేది ఒక డిజైన్ కోర్సు. ఇందులో చిత్రలేఖనం, శిల్పం, మ్యూజిక్, డ్యాన్స్, చిత్ర నిర్మాణం లాంటి కోర్సులు ఉంటాయి. డిజైనింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. ప్రస్తుత మేధో ఆర్థిక వ్యవస్థలో మార్కెట్లోకి వచ్చిన ప్రతి వస్తువు వెనకా ఓ డిజైనర్ పాత్ర ఉంటుంది. అందుకే ఈ కోర్సుకు బాగా డిమాండ్ పెరుగుతోంది.
- ఫ్యాషన్ డిజైన్ : ఇంటర్మీడియట్ తర్వాత బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు కూడా చేయవచ్చు. బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును అందించే అనేక కళాశాలలు ఉన్నాయి. ఇది కాకుండా, బ్యాచిలర్ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్ కోసం NIFT కోర్సు చేయవచ్చు.
- జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ : 12వ తరగతి తర్వాత విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా చదవవచ్చు. మాస్ మీడియాలో కోర్సులను అందించే అనేక సంస్థలు ఉన్నాయి. బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్న తర్వాత, విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ కూడా చేయవచ్చు.
- ఈవెంట్ మెనేజ్మెంట్ : 12వ తరగతి తర్వాత, ఆర్ట్స్ విద్యార్థులు ఈవెంట్ మేనేజ్‌మెంట్ చదువుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్‌మెంట్ చదువిన విద్యార్థులు ఈవెంట్ మేనేజర్, వెడ్డింగ్ ప్లానర్‌గా కెరీర్ ప్రారంభించవచ్చు.
- ఆర్థిక శాస్త్రం : విద్యార్థులు ఎకనామిక్స్‌లో బీఏ కూడా చదువుకోవచ్చు. ఎకనామిక్స్‌లో బీఏ చేసిన తర్వాత విద్యార్థులు ఎంబీఏ, పీహెచ్‌డీ చేయవచ్చు. లేదా సొంతంగా స్టార్టప్‌ను ప్రారంభించవచ్చు. ఇది కాకుండా, చాలా కంపెనీలు బీఏ ఎకనామిక్స్ చదివిన యువతను రిక్రూట్ చేసుకుంటాయి.
- మనస్తత్వ శాస్త్రం : ఇంటర్ తర్వాత బీఏ సైకాలజీ చేస్తే మంచి భవిష్యత్ ఉంటుంది. ఈ కోర్సును ఎన్నో కాలేజీలు ఆఫర్ చేస్తున్నాయి. ఈ కోర్సు చేసిన విద్యార్థులు ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు కావచ్చు.
- టీచింగ్ : ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. మారుతున్న కాలానికి అనుగుణంగా బోధనా పద్ధతులను మెరుగుపరుచుకోవాలి. విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. అందుకే ఇంటర్ తర్వాత టీచింగ్ కోర్సులు చేయవచ్చు. భవిష్యత్తు తరాన్ని రూపొందించేందుకు ఈ కోర్సు ఎంతో ఉపయోగపడుతుంది.
- బీఏ+ ఎల్ఎల్బీ : 12వ తరగతి తర్వాత విద్యార్థులు బీఏ+ఎల్ఎల్బీ చదివి న్యాయవాదులు కావచ్చు. దేశవ్యాప్తంగా ఈ కోర్సులను అందిస్తున్న అనేక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
- సివిల్ సర్వీసెస్ : ప్రజాసేవ చేయాలనుకునేవారు 12వ తరగతి తర్వాత, డిగ్రీ పూర్తి చేయాలి. తరువాత సివిల్ సర్వీసెస్ కోసం ప్రయత్నించవచ్చు. కానీ చాలా కఠినమైన శ్రమించాల్సి ఉంటుంది.
- సోషల్ వర్క్ : భారతదేశంలో అత్యంత ఆదరణ ఉన్న కోర్సుల్లో సోషల్ వర్క్ కూడా ఒకటి. భారతదేశంలో సోషల్ వర్క్ ఫీల్డ్‌లో ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కెరీర్ స్కోప్ పెరుగుదల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులు ఇప్పుడు సోషల్ వర్క్ కోర్సులను అభ్యసించాలనుకుంటున్నారు. ఇంటర్ తర్వాత ఈ కోర్సు చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది.