Where Does Mukesh Ambani Invest His Money : బాగా డబ్బున్నవాళ్లు సాధారణంగా రియల్ ఎస్టేట్ లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంటారు. సాధారణ ప్రజలు మ్యూచువల్ ఫండ్స్‌లో, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారు. మరి అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఏయే వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారో మీకు తెలుసా?
ఫోర్బ్స్ ప్రకారం ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ. ఈ దిగ్గర వ్యాపారవేత్త ఆస్తి విలువ 116.1 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ.9,69,600 కోట్లు). ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ - టెలికాం, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్ సహా అనేక రంగాల్లో వ్యాపారాలు చేస్తోంది. 66 ఏళ్ల ముకేశ్ IPL అగ్రశ్రేణి జట్టు 'ముంబయి ఇండియన్స్' టీమ్‌కు యజమానిగా ఉన్నారు. అలాగే ఆయనకు ముంబయిలో అత్యంత ఖరీదైన యాంటిలియా అనే భవనం ఉంది.
Mukesh Ambani Investments : అత్యంత ఐశ్వర్యంతో తులతూగే ముకేశ్ అంబానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తుంటారో తెలుసుకోవాలని చాలా మందికి కుతూహలంగా ఉంటుంది. అంబానీ ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తుంటారా? మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడుతుంటారా? అనే సందేహాలు ఉంటాయి. కానీ ముకేశ్ అంబానీ తన దగ్గర ఉన్న లక్షల కోట్ల రూపాయలను మనలా ఎఫ్‌డీల్లో, మ్యూచువల్ ఫండ్లలో పెట్టరు. ఆయన మంచి భవిష్యత్ ఉన్న ఆధునిక వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతుంటారు.
ఇటీవల మెడిసిన్ డెలివరీ కంపెనీ నెట్‌మెడ్స్‌లో ముకేశ్ 60 శాతం వాటాను కొనుగోలు చేశారు. అలాగే 'యాడ్‌వెర్బ్ టెక్నాలజీస్' అనే భారతీయ రోబోటిక్స్ స్టార్టప్‌లో దాదాపు రూ.983 కోట్లు వెచ్చించి మెజారిటీ వాటాను దక్కించుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ రిటైల్ విభాగం 2020లో ఆన్‌లైన్ ఫర్నిచర్ రిటైలర్ అర్బన్ లాడర్‌లో 96 శాతం వాటాను రూ. 182 కోట్లకు కొనుగోలు చేసింది. త్వరలో టీవీ, స్ట్రీమింగ్ కంపెనీ వయాకామ్ 18లో 13 శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ విధంగా ముకేశ్ తన డబ్బులను బ్యాంకుల్లో, మ్యూచువల్ ఫండ్లలో పెట్టకుండా వివిధ బిజినెస్‌ల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు.
తొలిసారి చేతులు కలిపిన అంబానీ, అదానీ
దేశంలో అత్యంత శక్తిమంతమైన వ్యాపారవేత్తలు ముకేశ్ అంబానీ- గౌతమ్ అదానీ విద్యుత్ రంగంలో ఒక పెద్ద ప్రాజెక్ట్‌లో కలిసి పనిచేయాలని ఇటీవలే నిర్ణయించారు. 500 మెగావాట్ల కోసం అదానీ పవర్ లిమిటెడ్‌తో రిలయన్స్ ఇండస్ట్రీస్ 20 సంవత్సరాల దీర్ఘకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. తద్వారా అదానీ పవర్ ప్రాజెక్ట్‌లో 26 శాతం వాటాను కైవసం చేసుకుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. అదానీ పవర్ లిమిటెడ్‌కు చెందిన అనుబంధ సంస్థ మహాన్ ఎనర్జెన్ లిమిటెడ్‌లో 5 కోట్ల ఈక్విటీ షేర్ల్ కోసం కోసం రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టనుంది రిలయన్స్ ఇండస్ట్రీస్. క్యాప్టివ్ యూజర్స్ పాలసీ ప్రకారం ఈ ఒప్పందం జరిగింది. స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో రెండు సంస్థలు ఈ విషయాన్ని తెలిపాయి.
జీఎస్టీ రిటర్న్ అంటే ఏమిటి? దీనిని ఎవరు దాఖలు చేయాలి? - What Is GST Return