ETV Bharat / business

మీ ఆస్తి పత్రాలు మిస్ అయ్యాయా? వెంటనే ఈ పనులు చేయండి!

మీ ల్యాండ్‌, ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయాయా? డోంట్ వర్రీ - ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!

How To Retrieve Lost Property Docs
How To Retrieve Lost Property Docs (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2024, 4:32 PM IST

How To Retrieve Lost Property Docs : మీరు ఎంతో కష్టపడి సంపాదించిన భూములు, ఆస్తులకు సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ పోయాయా? తరతరాలుగా వస్తున్న ఆస్తి పత్రాలు కూడా కనిపించడం లేదా? ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదా? డోంట్ వర్రీ. పోయిన డాక్యుమెంట్స్‌ను చాలా సింపుల్‌గా ఎలా పొందాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

Tips To Find Lost Property Documents

1. ఎఫ్‌ఐఆర్‌ నమోదు : భూములు, ఆస్తులకు సంబంధించిన పత్రాలు పోతే- ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాలి. ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే కాదు, పోగొట్టుకున్న మీ ఒరిజినల్ పత్రాలు తిరిగి పొందడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. పైగా మీకు చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ఇతరులు మీ ఆస్తులను తప్పుడు మార్గాల్లో ఉపయోగించుకోకుండా కాపాడుతుంది. మరీ ముఖ్యంగా మీ ఆస్తి పత్రాలు దొంగతనానికి గురైతే, పోలీసులు వాటిని పట్టుకుని మీకు అప్పగించే వీలుంటుంది. అయితే పోలీసులకు చేసిన ఫిర్యాదులో మీరు పోగొట్టుకున్న పత్రాలకు సంబంధించిన అన్ని వివరాలను చాలా స్పష్టంగా చెప్పాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా మీ ఆస్తి పత్రాలు మీకు దొరికే అవకాశం ఉంటుంది.

2. పత్రికా ప్రకటన : నేటి సమాచార యుగంలో ఏ విషయమైనా త్వరగా ప్రజలకు చేరాలంటే, పత్రికా ప్రకటనలు ఇవ్వడం మంచిది. చట్టపరంగానూ పత్రికా ప్రకటనలు ఇవ్వడం తప్పనిసరి. ఇది పబ్లిక్ డిక్లరేషన్‌లా పనిచేస్తుంది. పైగా దీని వల్ల మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ త్వరగా దొరికే అవకాశం ఉంటుంది. కనుక కనీసం రెండు న్యూస్‌ పేపర్లలో మీరు పొగొట్టుకున్న ఆస్తి పత్రాల గురించి ప్రకటన ఇవ్వాలి. అవి బాగా ప్రాచుర్యం కలిగిన స్థానిక పత్రికలైతే మరీ బాగుంటుంది.

3. సబ్‌-రిజిస్ట్రార్‌ను కలవాలి : ఎఫ్‌ఐఆర్ నమోదు, పత్రికా ప్రకటనలు చేసిన తరువాత, సదరు ఆస్తులను రిజిస్టర్ చేసిన సబ్‌-రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లాలి. పూర్తి వివరాలతో ఒక అప్లికేషన్ నింపి, దానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్‌కు సంబంధించిన కాపీలను జత చేసి ఇవ్వాలి. దీనితో మీ ఒరిజినల్ పత్రాలు పోయినట్లు ప్రకటించే అధికారిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. దీని వల్ల ఇతరులు మీ ఆస్తులను తప్పుడు మార్గాల్లో క్లెయిమ్ చేసుకునే, అక్రమంగా ఇతరులకు విక్రయించే అవకాశం తగ్గుతుంది. చట్టపరంగా మీకొక రక్షణ ఏర్పడుతుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, సబ్‌-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో చాలా బ్రూరోక్రటిక్ కష్టాలు ఎదురవుతాయి. అంటే మీ డాక్యుమెంటేషన్‌ ప్రక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. సరైన వివరాలు ఇవ్వకపోతే, ఆ ప్రక్రియే నిలిచిపోతుంది. కనుక ఇది చాలా సహనంతో కూడుకున్న వ్యవహారమని మీరు గుర్తుంచుకోవాలి.

4. డూప్లికెట్ కాపీస్‌ కోసం దరఖాస్తు : మీరు కచ్చితంగా ఎఫ్‌ఐఆర్ నమోదు, పత్రికా ప్రకటన, సబ్‌-రిజిస్ట్రార్ ఆఫీస్‌లో అప్లికేషన్ దాఖలు చేయాలి. లేకుంటే మీకు డూప్లికెట్ కాపీలు ఇవ్వరు. కనుక పై ప్రక్రియలు అన్నీ పూర్తి చేసిన తరువాత, మీరు సబ్‌-రిజిస్ట్రార్ ఆఫీస్‌లోనే డూప్లికెట్‌ కాపీలు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీనితోపాటు పోయిన పత్రాలను వెతకడానికి మీరు చేసిన ప్రయత్నాలను వివరిస్తూ ఓ అఫిడవిట్‌ను కూడా తప్పనిసరిగా ఇవ్వాలి. వీటన్నింటినీ పరిశీలించి మీ భూములు, ఆస్తులకు సంబంధించిన డూప్లికెట్ కాపీలను సబ్‌-రిజిస్ట్రార్ జారీ చేస్తారు. మీ చట్టపరమైన యాజమాన్యాన్ని తిరిగి పునరుద్ధరిస్తారు. ఒకవేళ ఎప్పుడైనా మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లభిస్తే, వాటిని కూడా మీకు అందజేస్తారు.

5. ఈ జాగ్రత్తలు తప్పనిసరి : సాధారణంగా మనకు వారసత్వంగా కొన్ని ఆస్తులు సంక్రమిస్తూ ఉంటాయి. కొన్నింటి మనం ఎంతో కష్టపడి సంపాదించుకుంటా ఉంటాం. ఇలాంటి వాటికి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ పోతే, మనకు ఎంతో బాధగా ఉంటుంది. కనుక మీ భూములు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను స్కాన్ చేసి, ఆ కాపీలను డిజిటల్ వాలెట్లలో, మీ ఈ-మెయిల్స్‌లో దాచుకోవాలి. అలాగే ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను అగ్ని, జల ప్రమాదాలు లేని, సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలి. దీని వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి.

ఒకవేళ మీ ఆస్తి పత్రాలు పోతే, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ప్రాపర్టీ లాలో ఎక్స్‌పర్ట్ అయిన న్యాయనిపుణిడిని సంప్రదించాలి. వారు మీకు సరైన మార్గదర్శకత్వం చేస్తారు. చట్టపరమైన అన్ని రకాల ప్రోటోకాల్స్ ఎలా పాటించాలో చెబుతారు. మీ పత్రాలు మీకు వీలైనంత త్వరగా లభించేలా చేస్తారు.

నోట్ : ఈ ఆర్టికల్‌లో చెప్పిన అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. చట్టపరమైన అంశాల విషయంలో కచ్చితంగా న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.