ETV Bharat / business

ఇకపై అన్నింటీకీ ఒకే KYC - డాక్యుమెంట్ వెరిఫికేషన్ సో సింపుల్! - What Is Uniform KYC - WHAT IS UNIFORM KYC

What Is Uniform KYC : బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు, మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెట్టేటప్పుడు, జీవిత బీమా పాలసీ కొనుగోలు చేసేటప్పుడు, ఇలా ప్రతిసారీ 'నో యువర్ కస్టమర్' (కేవైసీ) చేస్తుంటాం. ఇలా ప్రతిసారీ కేవైసీ చేసే ఇబ్బంది లేకుండా చేసేదే 'యూనిఫామ్ కేవైసీ'. ఇంతకూ యూనిఫామ్ కేవైసీ అంటే ఏమిటి? దాని ద్వారా కేవైసీ ప్రాసెస్ ఎలా ఈజీ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

uniform kyc norms
What Is Uniform KYC?
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 14, 2024, 11:35 AM IST

What Is Uniform KYC : బ్యాంక్ ఖాతా తెరవాలన్నా, బీమా తీసుకోవాలన్నా, స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనుకున్నా లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఇలా ప్రతి దానికి ప్రత్యేకంగా కేవైసీ చేయాల్సిందే. అంటే కేవైసీ లేకుండా మీరు బ్యాంక్ ఖాతాను తెరవలేరు. జీవిత, ఆరోగ్య బీమాలను కొనుగోలు చేయలేరు. అవసరమైన పత్రాలు ఇచ్చి, కేవైసీ అప్​డేట్ చేసిన తర్వాత మాత్రమే మీరు ఆర్థిక సేవలను ఉపయోగించుకోగలరు. ఇలా వేర్వేరు పనుల కోసం పదే పదే కేవైసీ చేయడం, మళ్లీ వాటిని విడివిడిగా అప్‌డేట్ చేస్తుండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి పరిష్కారించేందుకు 'యూనిఫామ్ కేవైసీ' పద్ధతిని తీసుకువచ్చేందుకు ఫైనాన్స్ స్టెబిలిటీ, డెవలప్​మెంట్​ కౌన్సిల్ ఒక ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం, ఆర్థిక రంగంలోని అన్ని వ్యవహారాల్లో యూనిఫామ్ కేవైసీ అమలు చేయవచ్చని కేంద్ర ప్రభుత్వానికి తెలిపింది. దీనితో కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ సెక్రటరీ టీవీ సోమనాథన్ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇది యూనిఫామ్ కేవైసీ అమలుకు ఓకే చెబితే, ఇకపై ప్రతిదానికీ విడివిడిగా కేవైసీ చేయాల్సిన అవసరం ఉండదు.

సెంట్రలైజ్డ్ కేవైసీ రిజిస్ట్రీ :
ఆర్థిక మంత్రిత్వ శాఖ 2016 సంవత్సరంలో 'సెంట్రల్ కేవైసీ రికార్డ్స్ రిజిస్ట్రీ' (CKYCR)ని ఏర్పాటు చేసింది. ఇది క్యాపిటల్ మార్కెట్ పెట్టుబడులకు సంబంధించిన కేవైసీ రికార్డులను మాత్రమే మెయింటైన్ చేస్తుంది. బ్యాంకింగ్, బీమా వంటి ఇతర ఆర్థిక సేవలకు సంబంధించిన కేవైసీ రికార్డ్​లను ఇది కవర్ చేయదు.

ప్రతిపాదిత మార్పులు:
ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం, కేవైసీ వివరాలు సమర్పించిన తర్వాత వినియోగదారులు - వారి ఐడీ ప్రూఫ్​న​కు లింక్ చేసిన ప్రత్యేక సీకేవైసీ ఐడెంటిఫైయర్​ను పొందుతారు. ఈ ఐడెంటిఫైయర్ రిపోర్టింగ్ ఎంటిటీస్​లకు సెంట్రల్ రిజిస్ట్రీ నుంచి కేవైసీ రికార్డులను యాక్సెస్ చేసేందుకు పర్మిషన్ ఇస్తుంది. దీని వల్ల ప్రతిసారీ కేవైసీ చేయాల్సిన పని తప్పుతుంది.

కస్టమర్లకు, సంస్థలకు ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి:
యూనిఫాం కేవైసీ వల్ల వినియోగదారులు వివిధ ఆర్థిక కార్యకలాపాలను చాలా సులువుగా చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వివిధ ఆర్థిక సంస్థల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారు. దీని వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. ప్రక్రియలను కూడా క్రమబద్ధం చేయడానికి వీలవుతుంది. పైగా భద్రత పెరుగుతుంది. ఆర్థిక మధ్యవర్తుల కోసం, ఇది ఆన్​బోర్డింగ్ కేపాసిటిని మెరుగుపరుస్తుంది. ఖర్చులను కూడా తగ్గిస్తుంది. ఈ విధంగా యూనిఫామ్ కేవైసీ కస్టమర్లకు మేలైన ప్రయోజనాలను అందిస్తుంది. డేటా గోప్యత, భద్రత రెండూ ఉంటాయి. అయితే ఈ విధానం వినియోగదారుల రిస్క్ ప్రొఫైల్ ఆధారంగా పలు స్థాయిల్లో కేవైసీ వెరిఫికేషన్​ చేయడానికి అనుమతి ఇస్తుంది.

లేడీస్​ స్పెషల్​ - జీవితంలో ఆర్థికంగా స్థిరపడాలా? ఈ స్కీమ్స్​పై ఓ లుక్కేయండి! - National Womens Savings Day

రిటైర్మెంట్ తర్వాత ఎంత నిధి అవసరం? రూ.1 కోటి సరిపోతుందా? - Retirement Investment Planning

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.