CIBIL Score Vs Credit Score: క్రెడిట్ కార్డు వినియోగదారులందరికీ.. క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ గురించి తెలుసు. ఇది చాలా ముఖ్యమైనది కూడా! ఎందుకంటే.. ఈ స్కోర్ ఆధారంగానే రుణ సంస్థలు లేదా బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. కస్టమర్ ఆర్థిక సామర్థ్యాన్ని కూడా రుణ సంస్థలు క్రెడిట్ స్కోర్‌తోనే అంచనా వేస్తాయి. అందుకే ఈ స్కోరుకు అంత ప్రాధాన్యం ఉంటుంది. అయితే.. చాలా మంది సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ రెండూ ఒకటే అని భావిస్తారు. కానీ.. ఈ రెండు ఒకటి కాదు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
క్రెడిట్ స్కోర్ అంటే ఏమిటి: క్రెడిట్ స్కోర్ అనేది.. ఒక వ్యక్తి క్రెడిట్ హిస్టరీ గురించి తెలిపే సూచిక. ఇది 300 నుంచి 900 మధ్య ఉంటుంది. ఈ నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే.. ఆ వ్యక్తి క్రెడిట్ హిస్టరీ అంత క్లీన్‌గా ఉన్నట్టు లెక్క. 700 ప్లస్‌లో ఉంటే చాలా బాగా మెయింటెయిన్ చేస్తున్నట్టు లెక్క. మరి, దీన్ని ఎలా నిర్ణయిస్తారంటే.. సదరు వ్యక్తి ఎంతెంత అప్పులు తీసుకున్నాడు? సమయానికి తిరిగి చెల్లించాడా? డిఫాల్టర్‌గా మారాడా? ఎన్నిసార్లు ఫైన్‌తో చెల్లించాడు? అతని క్రెడిట్ లిమిట్ ఎంత? ఎంత వాడుతున్నాడు? ఇలా.. ప్రతినెలా కస్టమర్ వివరాలన్నీ సేకరించి.. అతని క్రెడిట్ హిస్టరీ ప్రిపేర్ అవుతుంది. ఈ హిస్టరీ ఆధారంగానే క్రెడిట్ స్కోర్ ప్రిపేర్ అవుతుంది. కొత్తగా అతనికి రుణం కావాలంటే.. బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు ఈ క్రెడిట్ స్కోర్‌నే ఆధారంగా చేసుకుంటాయి.
సిబిల్ స్కోర్ అంటే ఏమిటి? : CIBIL అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(ఇండియా) లిమిటెడ్. పైన చెప్పుకున్న క్రెడిట్ స్కోర్ ఉంది కదా.. దాన్ని అందించే ఒక సంస్థ. ఇలాంటి సంస్థలు, ఏజెన్సీలు ఇంకా చాలా ఉంటాయి. మరి.. సిబిల్ మాత్రమే ఎందుకు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది అంటే.. ఇది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) అధీకృత క్రెడిట్ ఏజెన్సీ. ఇది ఎప్పటి నుంచో ఉన్న సంస్థ కావడంతో.. అందరికీ ఇది ఎక్కువగా పరిచయం. బ్యాంకులు, ఇతర ఫైనాన్స్ సంస్థల నుంచి.. వ్యక్తులకు సంబంధించిన లోన్స్, క్రెడిట్ కార్డ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ సమాచారం తీసుకొని.. క్రెడిట్ రిపోర్ట్స్ తయారుచేస్తుంది. ఈ రిపోర్ట్స్ ద్వారానే క్రెడిట్ స్కోర్‌ను ఫైనల్ చేస్తుంది. సిబిల్.. ఎన్నో ప్రధాన బ్యాంకులు, నాన్- బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు, హౌజింగ్ ఫైనాన్స్ కంపెనీలతో ఇంటరాక్ట్ అవుతుంది. సిబిల్తోపాటు మరికొన్ని సంస్థలూ క్రెడిట్ స్కోర్ అందిస్తాయి.
క్రెడిట్ స్కోర్ అందించే ప్రధాన బ్యూరోలు:
- CIBIL: భారత్‌లో అత్యంత ప్రసిద్ధ క్రెడిట్ ఏజెన్సీగా ‘సిబిల్’ ఉంది. ఈ కంపెనీని 2000లో స్థాపించారు. 60 కోట్లకు పైగా భారతీయులు, 3.2 కోట్ల కార్పొరేట్ సంస్థల క్రెడిట్ రిపోర్ట్‌లను ఈ సంస్థ నిర్వహిస్తోంది.
- Equifax: ప్రపంచంలోని మూడు అతిపెద్ద క్రెడిట్ బ్యూరోలలో ఒకటైన ‘ఈక్విఫాక్స్’ 1899లో రిటైల్ క్రెడిట్ బిజినెస్‌గా ప్రారంభమైంది. ఇది 2010లో ఆపరేటింగ్ లైసెన్స్‌ను పొందింది. ఇది 1 నుంచి 999 వరకు క్రెడిట్ స్కోరును సూచిస్తుంది.
- Experian: ఇది కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) గుర్తింపు పొందింది. దీన్ని 2006లో స్థాపించగా.. 2010 నుంచి భారత్‌లో పనిచేస్తోంది.
- CRIF High Mark: ఈ బ్యూరోను 2007లో స్థాపించగా.. 2010లో లైసెన్స్ పొందింది. దీని స్కోర్ పరిధి 300 నుంచి 850 వరకు ఉంటుంది.
క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తున్నారా? ఇకపై బిల్లింగ్ డేట్‌ను మీరే ఫిక్స్ చేసుకోవచ్చు!
భవిష్యత్ కోసం పొదుపు చేయాలా? 50-30-20 సూత్రాన్ని పాటించండి!
క్రెడిట్ కార్డ్ 'రివార్డ్ పాయింట్స్' పెంచుకోవాలా? ఈ సింపుల్ టిప్స్ పాటించండి!