What Is Interim Budget : భారత పార్లమెంట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇది పూర్తిస్థాయి బడ్జెట్ కాదు. లోక్‌సభ ఎన్నికల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
అసలు మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి? దీన్ని ఎప్పుడు, ఎందుకు ప్రవేశపెడతారు? దీని ప్రాముఖ్యత ఏమిటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మధ్యంతర బడ్జెట్ అంటే ఏమిటి?
What is Interim Budget 2024 : కేంద్ర ప్రభుత్వం ఏటా ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనవాయితీ. దానికంటే ముందు రోజు ఆడిట్ రిపోర్ట్‌ను పార్లమెంట్‌కు సమర్పించడం జరుగుతుంది. ఈ 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కనుక ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి వీలుపడదు. అందుకే కొత్త ప్రభుత్వం వచ్చి, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేంత వరకు, ప్రభుత్వ పాలన కోసం, వ్యయాల కోసం బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. దీనినే మధ్యంతర బడ్జెట్ అని అంటారు. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం సహా, ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన అంచనాల సమాచారాన్ని ఇందులో సవివరంగా పేర్కొంటారు. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు తగినంత సమయం లేనప్పుడు, కేంద్రప్రభుత్వం ఇలాంటి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. దీనిని పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది.
భారత ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం, ఎలక్షన్స్ టైమ్‌లో ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి పథకాలను మధ్యంతర బడ్జెట్‌లో పొందుపరచకూడదు.
చర్చ లేకుండానే ఆమోదం!
మధ్యంతర బడ్జెట్‌లో ప్రభుత్వ వ్యయాలకు సంబంధించిన కేటాయింపులే ఉంటాయి. అది కూడా ఎన్నికలు అయ్యేంత వరకు మాత్రమే. అందువల్ల నిధుల మంజూరుకు సంబంధించి ఆమోదం తెలియజేసేందుకు ఎలాంటి చర్చ అవసరం ఉండదు. కానీ పూర్తిస్థాయి బడ్జెట్ విషయంలో విస్తృతస్థాయిలో చర్చ జరగాల్సి ఉంటుంది.
రాజ్యాంగంలో లేదు- కానీ
వాస్తవానికి మన రాజ్యాంగంలో మధ్యంతర బడ్జెట్ అనే పదం లేదు. కానీ, మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం 1962-63లో మొదటిసారిగా మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి అవసరమైన సందర్భాల్లో ఈ మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ వస్తున్నారు.
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీదారులకు గుడ్‌న్యూస్- ఇకపై అన్ని ఆస్పత్రుల్లో క్యాష్‌లెస్
పిల్లల ఉన్నత విద్యకోసం ప్లాన్ చేస్తున్నారా?- ఈ సూచనలు తప్పక పాటించండి!