ETV Bharat / business

హైదరాబాద్​లో ఇల్లు లేదా స్థలం కొనాలా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్​! - Property Buying Tips

Home Buying Checklist : మీరు హైదరాబాద్ లాంటి సిటీల్లో మంచి ఇల్లు లేదా స్థలం కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ఇల్లు లేదా స్థలం​ కొనేముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏయే అంశాలు చూసుకోవాలి? అనే విషయాలను ఈ ఆర్టికల్​లో తెలుసుకుందాం.

Real estate
Real estate (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2024, 3:01 PM IST

Home Buying Checklist : సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. ఇందుకోసం జీవితాంతం కష్టపడి పనిచేసి, పోగు చేసుకున్న డబ్బు మొత్తాన్ని ఖర్చు చేస్తారు. మరికొందరు బ్యాంకు లోన్స్ తీసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని చూస్తారు. అయితే ప్రస్తుత కాలంలో ఒక ఇంటిని కొనుగోలు చేయడం లేదా నిర్మించడం అనేది కష్టమైన పనో అందరికీ తెలిసిందే.

ఇటీవల తెలంగాణా రాష్ట్రంలో 'హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ సెల్( హైడ్రా)' అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ ఉంది. దీనితో బడాబాబులతో పాటు, సామాన్యుల గుండెల్లోనూ రైళ్లు పరుగెడుతున్నాయి. ధనవంతులకైతే ఏం ఫర్వాలేదు. కానీ తమ కష్టార్జితంలో ఇళ్లు కట్టుకున్నవారి పరిస్థితి ఏమిటి? తాము నిర్మించుకున్న లేదా కొనుగోలు చేసిన ఇంటిని అక్రమ నిర్మాణమంటూ హైడ్రా కూల్చివేస్తే, అప్పుడు ఏం చేయాలి? మీకు కూడా ఇలాంటి భయమే ఉందా? అయితే ఇది మీ కోసమే.

హైదరాబాద్ లాంటి పెద్దపెద్ద నగరాల్లో స్థలాలకు, ఇళ్లకు, ఫ్లాట్​లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే కొంత మంది రియల్​ ఎస్టేట్ వ్యాపారులు ప్రభుత్వ స్థలాల్లో, చెరువుల్లో, నదీ గర్భాల్లో, అటవీ ప్రాంతాల్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి, వాటిని సామాన్యులకు అంటగడుతుంటారు. మరికొందరు ఇతరుల ఆస్తులను కబ్జా చేసి, మరొకరికి అమ్ముతుంటారు. ఇంకొందరు ప్రభుత్వం నుంచి సరైన అనుమతులు తీసుకోకుండానే, నిర్మాణాలు చేపడుతుంటారు. ఇలాంటి వాటిని కొని సామాన్యులు నష్టపోతుంటారు. అందుకే ఈ ఆర్టికల్​లో పట్టణాల్లో, నగరాల్లో ఆస్తులు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.

1. అక్రమ నిర్మాణమా? కాదా?
హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇల్లు, స్థలం లేదా ఫ్లాట్​లు కొనుగోలు చేయాలని అనుకునేవారు, ముందుగా అవి అక్రమ నిర్మాణాలా, కాదా అనేది తెలుసుకోవాలి. ఇందుకోసం మీరు లీగల్ అడ్వైజర్లను, రెవెన్యూ అధికారులను సంప్రదించాలి. మరీ ముఖ్యంగా కమర్షియల్, రెసిడెన్షియల్ ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు అక్రమాస్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

2. రెరా
భారత పార్లమెంట్​ 2016లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (RERA) చట్టాన్ని ఆమోదించింది. స్థిరాస్తి రంగంలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని ప్రోత్సహిస్తూ, కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. రెరా చట్టం ప్రకారం, డెవలపర్లు తమ ప్రాజెక్టులను RERAలో కచ్చితంగా నమోదు చేసుకోవాలి. ప్రాజెక్ట్ ప్లాన్స్, లేఅవుట్స్​, ప్రాజెక్ట్ పూర్తి చేసే తేదీ వివరాలను ముందుగానే కొనుగోలుదారులకు తెలియజేయాలి. అంతేకాదు డెవలపర్లు నిర్దిష్ట ప్రమాణాలు, మార్గదర్శకాలు పాటించాలి. ఒక వేళ డెవలపర్లు నిబంధనలు అతిక్రమిస్తే, వారికి రెరా జరిమానాలు కూడా విధిస్తుంది.

మీరు కనుక అపార్ట్​మెంట్​/ ఫ్లాట్​ లాంటి రియల్ ఎస్టేట్ ఆస్తులను కొనుగోలు చేయాలని అనుకుంటే, కచ్చితంగా రెరా వెబ్​సైట్​లో నిర్మాణంలో ఉన్న ఆస్తి వివరాలను ముందుగానే తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ మీకు దీనిపై సరైన అవగాహన లేకుంటే, నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిది.

3. న్యాయపరమైన చిక్కులు
ఆస్తి కొనడం, దాన్ని మన పేరు మీదకి మార్పించుకోవడమనేది అనుకున్నంత తేలికైన వ్యవహారం కాదు. న్యాయపరమైన చిక్కులు వచ్చినప్పుడు కానీ తెలియదు అందులో ఎన్ని లోటుపాట్లు ఉన్నాయో! మీ పేరున రిజిస్టర్​ అయిన స్థలం, మరొకరి పేరుపై కూడా రిజిస్టర్ అయ్యుండవచ్చు. లేదా మీ స్థలాన్ని ఇతరులు కబ్జా చేయవచ్చు. లేదా ఆ స్థలంతో ఏమాత్రం సంబంధంలేని వ్యక్తులు మీపై దావా వేయవచ్చు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు వ్యవస్థను నిందించడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే ఆస్తి కొనేటప్పుడే తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

4. అమ్మేవారికి అన్ని హక్కులు ఉన్నాయా?
ఆస్తులు కొనాలనుకునే చాలా మంది సదరు స్థలం/ ప్లాట్​ ధర గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ అమ్మేవారి హక్కుల గురించి తెలుసుకోరు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అధిక ధర పెట్టి కొన్నంత మాత్రాన ఆ ఆస్తి మనకు సొంతం అయిపోతుందని చెప్పలేం. ఇందుకంటే, చాలా సార్లు ఆస్తులపై తగిన హక్కులు లేనివారు, మోసపూరితంగా ఇతరులకు వాటిని అమ్మేస్తుంటారు. అందుకే అమ్మేవారికి సదరు ఆస్తిపై పూర్తి హక్కులు ఉన్నాయో, లేదో ముందుగానే తెలుసుకోవాలి.

కొన్ని మతాల్లో బహుభార్యత్వం ఉంటుంది. కనుక యజమానికి అనేక మంది సంతానం ఉంటారు. వారందరికీ ఆస్తి హక్కులు ఉంటాయి. కనుక మీరు ఈ విషయాన్ని కచ్చితంగా చూసుకోవాలి. లేకుంటే భవిష్యత్​లో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఏ ఆస్తి అయినా కొనే ముందు, అమ్మే వారికి అన్ని హక్కులు ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవాలి. ఇందుకోసం కొన్ని ప్రశ్నలు వేయాలి. అవి ఏమిటంటే?

  • అమ్ముతున్న వారికి సదరు ఆస్తి ఎలా వచ్చింది?
  • వారసత్వం అయితే వారసులు అందరూ సంతకాలు పెడుతున్నారా?
  • మైనర్లు ఉంటే కోర్టు అనుమతి తీసుకున్నారా?
  • తండ్రి/తల్లి/ సంరక్షకులు తమ అధికార పరిధిలోనే వ్యవహరిస్తున్నారా?
  • ఇతర హామీలు ఏవైనా ఇస్తారా?
  • అసలు యజమాని నుంచి అమ్మేవారికి హక్కులు సరిగ్గానే సంక్రమించాయా?
  • అమ్మేవాళ్లు చూపించిన రిజిస్టర్డ్​ దస్తావేజులు సరైనవేనా?
  • సదరు ఆస్తిని ఎక్కడైనా తనఖా పెట్టారా?
  • ఆస్తి ఇంతకు ముందే ఎవరికైనా అమ్మారా?
  • ప్రభుత్వం/ప్రభుత్వ సంస్థలకు చెందిన ఆస్తా? లేదా ప్రభుత్వ సంస్థలు ఆ భూమిని తీసుకునే అవకాశం ఉందా?
  • సదరు ఆస్తిపై ఏమైనా దావాలు, తగాదాలు ఉన్నాయా?
  • నిర్మాణాలకు, ఇళ్ల స్థలాలకు సరైన అనుమతులు ఉన్నాయా?
  • ఆస్తులు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి?
  • సదరు భూములు నదీ గర్భాల్లో, చెరువుల్లో ఉన్నాయా?
  • అది అటవీ ప్రాంతానికి చెందినదా?

ఇలాంటి అనేక విషయాలు కచ్చితంగా వాకబు చేయాలి. ఎలాంటి మొహమాటం లేకుండా సదరు ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను అడిగి చూడాలి. వాటిని అనుభవజ్ఞులైన న్యాయవాదులకు చూపించి, తగిన సలహాలు తీసుకోవాలి. ఆ తరువాతనే సదరు ఆస్తి కొనాలా? లేదా? అనేది నిర్ణయించుకోవాలి. కొనాలనుకుంటే, సరైన రైటర్​తో దస్తావేజును రాయించుకోవాలి.

6. సమస్యలేమీ ఉండవా?
ఆస్తుల కొనుగోలు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ, సమస్యలు ఏమీ రావని కచ్చితంగా చెప్పడానికి వీలుండదు. కాకపోతే అనవసర సమస్యలు ఎక్కువగా రాకుండా ఉంటాయి. పైగా చట్టం మీకు అదనపు రక్షణ కల్పిస్తుంది. అంటే, మీరు సొమ్ము చెల్లించి ఆస్తి కొన్నారు కాబట్టి, నిజాయతీగా ఆస్తి పొందిన వ్యక్తిగా మిమ్మల్ని న్యాయస్థానాలు పరిగణిస్తాయి. మీ హక్కులను కాపాడతాయి. కానీ దీనికి కూడా కొన్ని షరతులు వర్తిస్తాయి. అవి ఏమిటంటే?

  • మీరు కచ్చితంగా డబ్బు లేదా ప్రతిఫలం ఇచ్చి సదరు ఆస్తిని పొందినవారు అయ్యుండాలి.
  • ఆస్తిపై ఇతరులకు ఉన్న హక్కులు గురించి మీకు తెలిసి ఉండకూడదు.

ఈ రెండింటిలో ఏది వర్తించకపోయినా, మీరు సదుద్దేశంతో ఆస్తి కొన్న వారు కాదని న్యాయస్థానాలు భావిస్తాయి. తెలిసి ఉండటం అంటే నోటీసు కలిగి ఉండటం అని అర్థం. చట్టం దీన్ని చాలా స్పష్టంగా, విపులంగా విశదీకరించి చెప్పింది. మనకున్న హక్కుల్ని కాదని, ఎవరైనా మన ఆస్తి అమ్మాలని కానీ, ఇతరులకు బదిలీ చేయాలని గానీ ప్రయత్నిస్తే, కొనేవాళ్లకు నేరుగా గానీ, పత్రికా ముఖంగా గానీ తెలియజేయాలి. ఒక ఆస్తిని మనం కొనాలనుకున్నా, పత్రికా ముఖంగా ప్రకటన ఇవ్వవచ్చు. ఇవన్నీ మన సదుద్దేశాన్ని చూపించే చర్యలు అవుతాయి. మన హక్కుల్ని చెప్పినా లెక్క చేయకుండా ఎవరైనా కొన్నారనుకోండి, మనం చేపట్టే చర్యలకు వాళ్లు బాధ్యులు అవుతారు. అమాయకపు నటన చేయడానికి వీలుండదు. కోర్టు తుది ఉత్తర్వు (డిక్రీ)లకు లోబడే అన్ని లావాదేవీలు ఉంటాయని మనం గమనించాలి.

7. బుకాయించినంత మాత్రాన ఫలితం ఉండదు!
చాలా మంది తెలిసి కూడా, తెలియదని బుకాయిస్తుంటారు. అయితే ఎదురుగా ఉన్న దాన్ని తెలియదని బుకాయిస్తే చట్టం ఒప్పుకోదు. అది ఎలా అంటే?

  • కావాలని వాకబు చేయకపోవడం!
    స్థిరాస్తికి సంబంధించిన వివరాలను కచ్చితంగా ముందే తెలుసుకోవాలి. రిజిస్టరు దస్తావేజులను, రెవెన్యూ రికార్డులను పరిశీలించాలి. అది మీ బాధ్యత. ఒక వేళ మీరు పొరపాటున తెలుసుకోకపోయినా, అది మీకు తెలిసినట్టే చట్టం భావిస్తుంది. మీకు వచ్చిన రిజిస్టర్​ కవర్ మీరు తీసుకోకుండా తిరిగి పంపించినా, అందులోని విషయాలు మీకు తెలిసినట్టే కోర్టు భావిస్తుంది.
  • నిర్లక్ష్యం
    మీరు నిర్లక్ష్యంగా ఉండడం, అనుమానం ఉన్నా దానిని విస్మరించడం లాంటివి చేస్తే, అది మీ తప్పే అవుతుంది. ఉదాహరణకు, మీరు చూసిన దస్తావేజుల్లో కోర్టు సీలు ఉందనుకోండి. అది ఎందుకు వచ్చిందో, ఆ దావా సంగతులు ఏమిటో, ఉత్తర్వులు ఏమిటో, దరిమిలా ఆ హక్కులు ఎవరికి ఉన్నాయో తెలుసుకోవాలి. ఇవేవీ నాకు తెలీదు అంటే కుదరదు.
  • రిజిస్టర్​ దస్తావేజులు
    రిజిస్టర్ అయ్యి, ఇండెక్స్​ పుస్తకాల్లో పొందుపర్చిన అంశాలను ప్రతి వ్యక్తీ తెలుసుకున్నట్టే చట్టం భావిస్తుంది. అందుకే రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చే మొక్కుబడి పుస్తకాల మీద ఆధార పడకూడదు. ఇండెక్స్ పుస్తకాల్ని కచ్చితంగా పరిశీలించాలి.
  • స్వాధీనం
    ఆస్తి ఎవరి స్వాధీనంలో ఉందో, ఆ వ్యక్తికి ఉన్న హక్కుల్ని గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే, అలాంటి వ్యక్తులకు యాజమాన్య హక్కుల పురోభావన ఉంటుంది. అందుకే, ఎవరి స్వాధీనంలో ఉన్నా, వారి హక్కుల గురించి విచారణ చేయాల్సి ఉంటుంది.

ఫ్లాట్​ కొనేటప్పుడు చూడాల్సిన అంశాలు!

1. బిల్ట్-అప్‌ ఏరియా
మనం ఫ్లాట్​ లేదా అపార్ట్​మెంట్ కొనుగోలు చేసినప్పుడు బిల్డ్​-అప్​ ఏరియా గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. ఈ బిల్డ్​-అప్ ఏరియాను అనుసరించే మనం బిల్డర్లకు డబ్బులు చెల్లించాలి. ఆస్తికి సంబంధించిన బిల్డ్​-అప్​ ఏరియాలోనే ఇంటి కార్పెట్​ ఏరియా, గోడలు, బాల్కనీ, కామన్​ ఏరియాలు ఉంటాయి. సాధారణంగా కార్పెట్ ఏరియా కంటే ఈ బిల్డ్-అప్ ఏరియా 15-25 శాతం ఎక్కువగా ఉంటుంది.

2. కార్పెట్‌ ఏరియా
కార్పెట్ ఏరియా అనేది ఆస్తికి సంబంధించిన వాస్తవ వినియోగ ప్రాంతాన్ని సూచిస్తుంది. అంటే గోడల మందాన్ని మినహాయించి, ఇంటిలో నివసించేవారి అవసరాలకు ఉపయోగపడే ప్రాంతమే కార్పెట్ ఏరియా. వాస్తవానికి ఆస్తి విలువను ఆ కార్పెట్ ఏరియా ఆధారంగా నిర్ణయిస్తారు. కనుక దీని గురించి బిల్డర్​ను ముందుగానే అడిగి తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే టెర్రస్​​, బాల్కనీ, యుటిలిటీ ఏరియాలు లాంటి ప్రాంతాలు కార్పెట్​ ఏరియా కిందకు రావు.

3. సేల్​ డీడ్​
మీరు ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు కచ్చితంగా సబ్​-రిజిస్ట్రార్​ ఆఫీస్​లో ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అంటే విక్రేత ద్వారా కొనుగోలుదారులు తప్పనిసరిగా సేల్​ డీడ్ పొందాలి. ఈ చట్టబద్ధమైన సేల్​ డీడ్ లేకుండా ఏ రియల్ ఎస్టేట్ లావాదేవీ చెల్లుబాటు కాదు. ఈ విషయాన్ని అందరూ కచ్చితంగా గుర్తించుకోవాలి.

4. స్టాంప్ డ్యూటీ
ఆస్తి అమ్మకం, కొనుగోలు, బదిలీలు చేసేటప్పుడు కచ్చితంగా స్టాంప్​ డ్యూటీ చెల్లించాలి. ఆస్తి విలువను బట్టి ఈ స్టాంప్ డ్యూటీ మారుతూ ఉంటుంది. సాధారణంగా ఆస్తి విలువలో 3-8% వరకు ఈ స్టాంప్​ డ్యూటీ ఉంటుంది. పురుషుల కంటే స్త్రీల పేరు మీద చేసే రిజిస్ట్రేషన్లకు స్టాంప్‌ డ్యూటీ తక్కువగా ఉంటుంది. అందువల్ల, మహిళా కుటుంబ సభ్యుల పేరు మీద ఆస్తిని రిజిస్టర్ చేయిస్తే, చాలా వరకు డబ్బులు ఆదా అవుతాయి.

5. క్లోజింగ్ ఛార్జెస్​
చాలా మందికి క్లోజింగ్ ఛార్జెస్ గురించి అవగాహన ఉండదు. సాధారణంగా బ్యాంకులు, బీమా సంస్థలు, న్యాయవాదులు, స్థిరాస్తి ఏజెంట్లు, పన్ను విధించే వర్గాలు, ఇంటి యజమానుల అసోసియేషన్​లు స్థిరాస్తి కొనుగోలుదారుల నుంచి కొన్ని రకాల రుసుములను వసూలు చేస్తుంటారు/ చేస్తుంటాయి. అందుకే వీటిని క్లోజింగ్ ఛార్జీలు లేదా క్లోజింగ్ కాస్ట్​లు అని అంటుంటారు.

6. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (OC)
స్థానిక అధికారులు బిల్డర్లు కట్టిన బిల్డింగ్​/ అపార్ట్​మెంట్​/ ఫ్లాట్​లను పరిశీలిస్తారు. అన్నీ నిబంధనల ప్రకారమే ఉంటే, ప్లాన్ ప్రకారమే నిర్మాణం జరిగిందని ఒక సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీనిని బిల్డర్ ఇంటి కొనుగోలుదారులకు అందజేస్తాడు. ఇదే ఆక్టుపెన్సీ సర్టిఫికెట్​.

సదరు అపార్ట్​మెంట్​/ ఫ్లాట్​కు విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజీ లాంటి సౌకర్యాలు అన్నీ ఉన్నాయని, కనుక అది నివాసయోగ్యమేనని ఈ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్​ (ఓసీ) కొనుగోలుదారుడికి హామీనిస్తుంది.

7. హోమ్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ (HOA)
ఒక అపార్ట్​మెంట్​లో అనేక ఫ్లాట్స్ ఉంటాయి. కనుక వీటిని సక్రమంగా మెయింటైన్ చేయడానికి, అందరి అవసరాలు తీర్చడానికి, కమ్యూనిటీ నియమాలను, నిబంధనలను సక్రమంగా నిర్వహించడానికి ఒక అసోసియేషన్ అవసరం అవుతుంది. కనుక ఇంటి యజమానులు సదరు అసోసియేషన్‌కు ప్రతి నెలా క్రమం తప్పకుండా నిర్ణీత రుసుములు చెల్లించాల్సి ఉంటుంది.

8. బిల్డింగ్‌ బైలాస్‌
పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఆర్గనైజేషన్‌ కొన్ని నియమాలు, నిబంధనలను రూపొందిస్తుంది. ఈ నియమాలకు అనుగుణంగానే భవనం రూపకల్పన, ఎత్తు, నిర్మాణం, భద్రత అంశాలు ఉండాలి.

ఈ 5 డాక్యుమెంట్లు చెక్ చేయాల్సిందే!
ఆస్తులు కొనేటప్పుడు ఇక్కడ చెప్పిన 5 డాక్యుమెంట్లను కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది.

1. టైటిల్ డీడ్ : ఇది చాలా ముఖ్యమైన డాక్యుమెంట్‌. మీరు ఇల్లు కొనుగోలు చేయడానికి ముందు కచ్చితంగా దీనిని చెక్ చేయాలి. ఈ డాక్యుమెంట్ సరిగా ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్‌కు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడవు. అలాగే కన్వర్షన్, డివిజన్, మ్యుటేషన్ వంటి వాటికి సైతం ఏ సమస్యలు రావు. అలాగే ఇల్లు నిర్మించిన భూమి చట్టబద్ధంగా కొనుగోలు చేశారో, లేదో ఈ పత్రం తెలియజేస్తుంది. మీకు వీటిపై సరైన అవగాహన లేకుండా నిపుణులైన డాక్యుమెంట్ రైటర్ల చేత, లేదా న్యాయవాదుల చేత తనిఖీ చేయించుకోవాలి.

2. ఎన్​కంబరెన్స్​ సర్టిఫికెట్ : ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేసే ముందు ఆ ప్రాపర్టీపై బ్యాంక్ రుణాలు ఏవైనా ఉన్నాయా?లేదా? అనేది చెక్ చేయాలి. అందుకు ఎన్​కంబరెన్స్​ సర్టిఫికెట్​ను చూడాలి. ఎన్​కంబరెన్స్​ సర్టిఫికెట్‌లో ఆ ప్రాపర్టీపై ఉన్న రుణాల వివరాలు ఉంటాయి. అలాగే మున్సిపల్ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన పన్నులు, బకాయిల వివరాలు కూడా ఉంటాయి. సబ్​రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లి దీనిని తీసుకోవచ్చు.

3. కన్‌స్ట్రక్షన్ సర్టిఫికెట్ : దీనిని కన్‌స్ట్రక్షన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ అని కూడా పిలుస్తారు. నిర్మాణంలో ఉన్న ప్రాపర్టీని కొనుగోలు చేయాలనుకున్నప్పుడు ఈ సర్టిఫికెట్ తీసుకోవాలి. నిర్మాణం ప్రారంభించాలని భావిస్తే ముందుగా స్థానిక సంస్థల నుంచి మీరు అనుమతులు పొందాల్సి ఉంటుంది. ఈ విషయాలు కన్‌స్ట్రక్షన్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ద్వారా తెలుసుకోవచ్చు

4. బిల్డింగ్ ప్లాన్ : ప్లానింగ్ అథారిటీస్ లేఔట్ ప్లాన్‌కు ఆమోదం తెలిపిన తరువాతే నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. కనుక ఇంటిని కొనుగోలు చేయాలనుకునేవారు లేఔట్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. డెవలపర్లు లేఔట్‌కు అనుగుణంగానే నిర్మాణం చేశారా? లేదంటే అనుమతికి మించి ఎక్కువ ఫ్లోర్స్ కట్టారా? అనే విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.

5. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ : దీనినే ఓసీ సర్టిఫికెట్‌ అంటారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తైన తర్వాత స్థానిక అధికారులు ఈ సర్టిఫికెట్‌ జారీ చేస్తారు. ప్రాపర్టీ నిర్మాణంలో ఏ తప్పులూ లేవని, చట్టబద్దంగానే అంతా ఉందని ఈ డాక్యుమెంట్ తెలుపుతుంది. అలాగే నీటి కనెక్షన్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వంటి సమాచారం కూడా ఈ డాక్యుమెంట్‌లోనే ఉంటుంది.

నోట్​ : ఆ ఆర్టికల్​లో చెప్పిన విషయాలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. రియల్​ ఎస్టేట్​కు సంబంధించిన వ్యవహారాలు చేసేటప్పుడు ఈ రంగంలోని నిపుణులను లేదా సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్​ను సంప్రదించడం చాలా మంచిది.

Own House Benefits : అద్దె ఇళ్లు కంటే సొంతిల్లు బెటర్​​!.. ఎందుకో తెలుసా?

కొత్త ఇల్లు కొనుగోలు చేశారా?- అయితే మీరు తప్పనిసరిగా చేయాల్సిన పనులివే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.