ETV Bharat / business

అదిరే ఫీచర్స్​తో - 2024లో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే!​ - Upcoming Cars In India 2024 - UPCOMING CARS IN INDIA 2024

Upcoming Cars In India 2024 : కార్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. త్వరలో మారుతి సుజుకి, టాటా, మహీంద్రా, హ్యుందాయ్​ బ్రాండ్​లకు చెందిన 8 కార్లు ఇండియాలో లాంఛ్ కానున్నాయి. వీటిలో పెట్రోల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా ఉన్నాయి. మరెందుకు ఆలస్యం వాటిపై ఓ లుక్కేద్దాం రండి.

upcoming Cars in India 2024
upcoming cars 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 1:03 PM IST

Upcoming Cars In India 2024 : ప్రస్తుత కాలంలో కుటుంబంతో కలిసి టూర్ వెళ్లాలన్నా, సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలన్నా కారు ఉండాల్సిందే. మంచి సీటింగ్, ఫీచర్స్​ & స్పెక్స్​ ఉన్న కార్లను కొనుగోలు చేసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ భారతీయ వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త మోడల్స్ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే మరికొద్ది నెలల్లో మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా, మహీంద్రా​ లాంటి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమకు చెందిన 8 లేటెస్ట్ కార్లను భారత మార్కెట్లో లాంఛ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. మరెందుకు ఆలస్యం, వాటి స్పెక్స్, ఫీచర్లుపై ఓ లుక్కేద్దామా?

1. Mahindra Thar Armada & XUV.e8 :
మహీంద్రా థార్​ అర్మడా కారు ఈ ఏడాది ఆగస్టులో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో ఈ కారు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వెర్షన్ త్రి డోర్ మోడల్ కంటే కాస్త పెద్దదిగా ఉంటుంది. పెద్ద టచ్‌ స్క్రీన్, ADAS, డ్యూయల్-ప్యాన్​ సన్​రూఫ్, డిజిటల్ కన్సోల్ వంటి అధునాతన సాంకేతికతలతో రిచ్ ఇంటీరియర్​ను కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. అలాగే XUV.e8 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ కూడా ఈ ఏడాది చివర్లో భారత మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం. ఇది ఎక్స్​యూవీ 700 తరహా లుక్స్​తో, ఫీచర్లతో రానున్నట్లు తెలుస్తోంది.

2. Tata Curvv EV & ICE, Nexon iCNG :
టాటా కర్వ్ ఈవీ మరికొద్ది నెలల్లో భారత్​లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది. దీన్ని ఒకసారి ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. టాటా ఐసీఈ మోడల్ కారు 1.2 లీటర్​ డైరెక్ట్-ఇంజెక్షన్ పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటరు డీజిల్ ఇంజిన్​తో మార్కెట్లోకి వస్తుంది. నెక్సాన్ ఐసీఎన్​జీ మోడల్ కారును ఈ ఏడాది ప్రారంభంలో భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. ఇది కూడా ఈ ఏడాది చివర్లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.

3. Hyundai Creta EV & Alcazar Facelift :
హ్యూందాయ్ క్రెటా ఈవీ దేశ, విదేశాల్లో టెస్ట్ రన్ పూర్తి చేసుకుంటోంది. ఈ మోడల్ కారు వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్​లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో గ్లోబల్ స్పెక్ కోనా ఈవీ నుంచి తీసుకున్న ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటారును పొందుపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 450 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని సమాచారం. దీని ఫీచర్లు క్రెటా కారులానే ఉంటాయి. మరోవైపు అల్కాజార్ ఫేస్ లిఫ్ట్ ఈ ఏడాది చివర్లో లాంఛ్ కానున్నట్లు తెలుస్తోంది.

4. New Maruti Suzuki Dzire :
న్యూ మారుతి సుజుకి డిజైర్ మోడల్ కారు భారత గడ్డపై పలుసార్లు టెస్ట్ రన్ చేస్తూ కనిపించింది. మరికొద్ది నెలల్లో ఈ కారు భారత విపణిలోకి రానున్నట్లు తెలుస్తోంది. దీని డిజైన్ న్యూ స్విఫ్ట్ కారులాగే ఉండనున్నట్లు సమాచారం. ఇది 1.2 లీటర్ Z-సిరీస్ పెట్రోల్ ఇంజిన్ లైనప్​లో రానుంది. అంతేకాదు దీనిలో సీఎన్​జీ వేరియంట్ కూడా ఉంది.

టూ-వీలర్​పై సాహస యాత్రలు చేయాలా? ఈ టాప్​-10 ఆఫ్​ రోడ్​ బైక్​లపై ఓ లుక్కేయండి! - Best Off Road Bikes In India

రూ.7 లక్షల్లో మంచి మైలేజ్​ ఇచ్చే కారు కొనాలా? టాప్​-10 మోడల్స్​ ఇవే! - Best Cars Under 7 Lakh

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.