ETV Bharat / business

మంచి టూ-వీలర్​ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్​-3 అప్​కమింగ్​ బైక్స్ ​& స్కూటీస్​ ఇవే!

Upcoming Bikes Under 1 Lakh : మీరు రూ.1 లక్ష బడ్జెట్లో మంచి టూ-వీలర్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. మీ బడ్జెట్లోనే ఈ 2024లో లాంఛ్ కానున్న టాప్​-3 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Upcoming Bikes Under 1 Lakh In India 2024
Bikes Under 1 Lakh Price
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 19, 2024, 12:06 PM IST

Upcoming Bikes Under 1 Lakh : ఇండియాలో బైక్స్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇండియాలో ఉన్న ఆటో మార్కెట్ పరంగా చూస్తే, సగటున ఒక కారు ఉంటే నాలుగు బైక్స్ ఉంటున్నాయి. చాలా మంది ఏ బైక్ కొనాలి అనే సందిగ్ధంలో ఉంటారు. వీటన్నింటికి చెక్ పెడుతూ మేము మీకోసం వివిధ కంపెనీలకు చెందిన రూ.1 లక్ష లోపు లభించే అప్​కమింగ్​ బైక్స్ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం. ఈ బైక్స్ అన్నీ బహుశా ఈ సంవత్సరంలోనే లాంఛ్​ అయ్యే అవకాశం ఉంది.

Honda Activa 7G :
హోండా యాక్టివా 7జీ ఇండియాలో ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.79,000 (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. యాక్టివా 7జీ బీఎస్-6 ఇంజన్‌తో వస్తుంది. యాక్టివా 7జీ వివరాలు పూర్తిగా తెలియడంలేదు. కానీ ఈ స్కూటర్ పూర్తిగా డిజిటల్ కాకపోయినా, ప్రైమరీ బ్లూటూత్ కనెక్టివిటీతో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో రావచ్చని సమాచారం. బహుశా దీనిలోని 109.51సీసీ సింగిల్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్​ను కూడా మార్చకపోవచ్చు. ఇది 7.79 పీఎస్ పవర్​, 8.84 ఎన్​ఎమ్​ టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏప్రిల్-2024లో లాంఛ్​ అయ్యే అవకాశం ఉంది.

Bajaj CNG Bike
బజాజ్ సీఎన్‍జీ బైక్​ ఇండియాలో సింగిల్​ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.80,000 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో హారిజాంటల్​గా అమర్చిన 110 సీసీ ఇంజిన్ పెట్రోల్-పవర్డ్ బైక్ లాంటి పెర్ఫార్మెన్స్​ను అందిస్తుందని కంపెనీ చెప్తోంది. దీని ధర సుమారు రూ.80,000 (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. బహుశా దీనిని ఏప్రిల్ 2024 - జూన్ 2024 మధ్య లాంఛ్​ చేసే అవకాశం ఉంది.

Vespa Elettrica
వెస్పా ఎలక్ట్రికా ఒక ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. దీని ప్రారంభ ధర రూ.90,000 (ఎక్స్-షోరూం) ఉండవచ్చు. ఎలక్ట్రికా ఫ్రంట్​లో డిస్క్ బ్రేక్, రియర్​లో డ్రమ్ బ్రేక్‌ కలిగి ఉంటుంది. వెస్పా ఎలక్ట్రికా లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో జత చేయబడిన 4kW ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్​ని ఛార్జ్ చేస్తే, ఎకో మోడ్‌లో 100 కిలోమీటర్లు, పవర్ మోడ్‌లో 70 కిలోమీటర్లు రేంజ్​ వరకు ప్రయాణించవచ్చు. 220V సాకెట్‌ని ఉపయోగించి ఫుల్ ఛార్జ్ చేయడానికి 3.5 గంటల సమయం పడుతుంది. దీని ముఖ్యమైన ఫీచర్లలో ఎల్ఈడీ లైటింగ్ సిస్టమ్, టీఎఫ్​టీ స్క్రీన్, వెస్పా మొబైల్ యాప్ కనెక్టివిటీతో కూడిన కాల్/మెసేజ్ డిస్‌ప్లే ఉన్నాయి. ఇది జూన్-2024లో లాంఛ్​ అయ్యే అవకాశం ఉంది.

భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే?

వాహనాలకు 'BH' సిరీస్ నంబర్ ప్లేట్లు- ఎలా అప్లై చేయాలి? లాభాలేంటి?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.