ETV Bharat / business

ఆర్థిక కష్టాల్లో ఆదుకునే బీమా పాలసీలు- ఇన్సూరెన్స్ రకాలు, వాటి​ ప్రయోజనాలేంటో తెలుసా? - types of general life insurance

Types of General Life Insurance : అనుకోకుండా వచ్చే కష్టాల నుంచి జీవిత బీమా పాలసీలు కుటుంబాన్ని ఆదుకుంటాయి. దీని ప్రాముఖ్యాన్ని గుర్తించిన వారు పాలసీ తీసుకునేందుకు ముందుకు వస్తారు. ఇందులో సాధారణ బీమా ప్రముఖమైనది. బీమాలో అనేక రకాల బీమా పథకాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం

general insurance types and features
general insurance types and features
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 14, 2024, 2:25 PM IST

Types of General Life Insurance : జీవిత బీమా అనేది అనేక దశాబ్దాల నుంచి దేశంలో ఉంది. ఇది అందరికీ సుపరిచితమే. అయితే, బీమా పరిధిలో సాధారణ బీమా (జనరల్‌ ఇన్సూరెన్స్‌) కూడా ముఖ్యమైనది. ఇందులో ఆరోగ్య, మోటారు బీమా గురించి అందరికీ తెలిసిందే. ఈ సాధారణ బీమాలో అనేక రకాల బీమా పథకాలు ఉన్నాయి. ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ఇతర ఊహించలేని పరిస్థితుల కారణంగా ఏ వ్యక్తి/సంస్థ అయినా సాధారణ బీమా పాలసీని కలిగి ఉన్నప్పుడు పాలసీ ఆర్థికంగా ఆదుకుంటుంది. సాధారణ బీమా పథకాలు సంబంధిత నష్టాలకు పరిహారం అందిస్తాయి. కొన్ని ముఖ్యమైన సాధారణ బీమా పథకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

గృహ బీమా
గృహ బీమా కలిగి ఉన్న పాలసీదారుడికి ఏదైనా అనుకోని ఘటన వల్ల నష్టం జరిగితే, ఆస్తికి సంబంధించిన వస్తువులు, మౌలిక సదుపాయాలకు పూర్తి కవరేజీ ఉంటుంది. ఉదాహరణకు అగ్ని ప్రమాదాలు, భూకంపం, పిడుగులు, తుఫానులు, వరదలు, కొండచరియలు విరిగిపడడం, సుడిగాలి వంటి విపత్తులు తలెత్తినప్పుడు ఇంటికి కలిగిన నష్టానికి ఆర్థిక రక్షణ ఇస్తుంది. సంఘ విద్రోహ శక్తులు సృష్టించే అల్లర్లు/ దోపిడీ వంటి విపత్తుల నుంచి కూడా గృహ బీమా ఇంటి యజమానికి ఆర్థిక రక్షణ అందిస్తుంది. ఈ ప్లాన్‌తో పాలసీ వ్యవధిలో పాలసీదారుడు తమ ఇంటికి సంబంధించి ఏదైనా ఘటన జరిగినప్పుడు ఆర్థిక భద్రతను పొందవచ్చు. ఇది మీ ఇంటికి ఆర్థిక రక్షణను అందించడమే కాకుండా, ఇంటి లోపల విలువైన వస్తువులకు కూడా కవరేజీని ఇస్తుంది.

ప్రయాణ బీమా
ప్రస్తుతం దూర ప్రాంతాలకు విమాన ప్రయాణాలు బాగా పెరిగాయి. ఈ ప్రయాణాల్లో కొన్ని సార్లు అనేక ఊహించని ఘటనలు జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్తగా ప్రయాణ బీమా తీసుకుంటే కొంత వరకు ఆర్థిక రక్షణను పొందొచ్చు. ఉదాహరణకు ట్రిప్‌ క్యాన్సిలేషన్‌, మెడికల్‌ ఎమర్జెన్సీలు, అత్యవసర వైద్య ఖర్చులు, సామగ్రి కోల్పోవడం, పాస్‌పోర్ట్‌ కోల్పోవడం, హైజాకింగ్‌, ప్రమాదవశాత్తు మరణం లేదా దేశీయ/అంతర్జాతీయ ప్రయాణ సమయంలో విమాన ఆలస్యం వంటి వాటికి ప్రయాణ బీమా కవరేజీని అందిస్తుంది. పాలసీదారుడు ప్రయాణించేటప్పుడు వైద్య, వైద్యేతర అత్యవసర పరిస్థితుల వల్ల ఉత్పన్నమయ్యే ఏవైనా ఆర్థిక నష్టాలకు ప్రయాణ బీమా పరిహారం ఇస్తుంది. ప్రయాణ బీమాలో డొమెస్టిక్‌/అంతర్జాతీయ ప్రయాణ బీమా, విద్యార్థి ప్రయాణ బీమా, సింగిల్‌ ట్రిప్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, మల్టీట్రిప్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, కుటుంబ ప్రయాణ బీమా, సీనియర్‌ సిటిజన్‌ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ వంటి వివిధ రకాల పాలసీలు ఉన్నాయి.

మెరైన్‌ ఇన్సూరెన్స్‌
వ్యాపారులు తామ ఉత్పత్తి చేసిన వస్తువులను దేశంలో/వెలుపలికి ఎగుమతి, దిగుమతి చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అటువంటి సందర్భాల్లో రోడ్డు, సముద్రం, రైలు, వాయు మార్గాలను ఉపయోగిస్తారు. భారత్‌ నుంచి సముద్రం మీద ఎగుమతి, దిగుమతులు భారీగానే జరుగుతున్నాయి. ఈ సమయంలోనే వస్తువుల ఎగుమతి, దిగుమతిలో సంభవించే నష్టాలకు పరిహారాన్ని ఇవ్వడంలో మెరైన్‌ బీమా సహాయపడుతుంది. వీటిలో శత్రువుల దాడి, ఓడ ఢీకొనడం, అగ్ని ప్రమాదం మొదలైన నష్టాలకు పరిహారం ఉంటుంది. మెరైన్‌ ఇన్సూరెన్స్‌ రెండుగా విభజించారు. ఓషన్‌ మెరైన్‌ ఇన్సూరెన్స్‌, ఇన్‌ల్యాండ్‌ మెరైన్‌ ఇన్సూరెన్స్‌. మొదటి బీమాలో సముద్రంలో జరిగే ప్రమాదాలకు మాత్రమే బీమా వర్తిస్తుంది. ఇన్‌ల్యాండ్‌ ఇన్సూరెన్స్‌లో దేశం లోపల/సరిహద్దుల వరకు సముద్రంలో, నౌకాశ్రయాలవద్ద, సరకు రవాణాలో ఉన్నప్పుడు జరిగే ప్రమాదాలకు కూడా బీమా వర్తిస్తుంది.

ఫైర్‌ ఇన్సూరెన్స్‌
ఫైర్‌ ఇన్సూరెన్స్‌ అనేది ఒక రకమైన ఆస్తి బీమా. దాదాపుగా అన్ని సంస్థల్లో విద్యుత్ వినియోగం ఎక్కువే. ఇలాంటి చోట ప్రమాదాలు అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫైర్‌ ఇన్సూరెన్స్‌ అనేది చాలా ముఖ్యమైనది. దీన్ని చాలా మంది వివిధ ఆస్తులకు (షాపులు, ఆఫీసులు, గొడౌన్‌లకు) చేయిస్తుంటారు. వ్యాపార సంస్థలు సాధారణంగా అగ్ని ప్రమాదాల నుంచి తమ స్టాక్స్‌/యంత్రాలను రక్షించడానికి దీన్ని ఎంచుకుంటాయి. అయితే, ఈ ప్లాన్‌ ఇళ్లు, వ్యక్తిగత వస్తువులను రక్షించుకోవాలనుకునే వ్యక్తులకు కూడా అందుబాటులో ఉంటుంది. ఇది సాధారణంగా ఆస్తికి అగ్ని ప్రమాదం కారణంగా సంభవించే నష్టాలను భర్తీ చేయడానికి అయ్యే ఖర్చుతో పాటు సంబంధిత ఖర్చులను కవర్‌ చేస్తుంది. అగ్ని ప్రమాదాల కారణంగా థర్డ్‌ పార్టీ ఆస్తికి జరిగిన నష్టాన్ని కూడా ఈ పాలసీ వర్తిస్తుంది. వీటితో పాటు ప్రమాదం కారణంగా జీవనోపాధి కోల్పోయిన వారి ఖర్చులను చెల్లిస్తుంది.

ఇదే కాకుండా అగ్ని ప్రమాదాలకు సంబంధించి వివిధ రకాల పాలసీలున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

  • స్టాండర్డ్‌ ఫైర్‌ పాలసీ: ఈ బీమా పథకం అగ్ని, పేలుడు, పిడుగుల వల్ల కలిగే నష్టాన్ని మాత్రమే కవర్‌ చేస్తుంది.
  • సమగ్ర ఫైర్‌ పాలసీ: ఈ ప్లాన్‌ విస్తృత కవరేజీని అందిస్తుంది. ఇది కేవలం అగ్ని ప్రమాదానికే కాకుండా వరదలు, భూకంపాలు వంటి అదనపు ప్రమాదాల నుంచి ఉత్పన్నమయ్యే నష్టాలను కూడా కవర్‌ చేస్తుంది.
  • వాల్యూడ్‌ పాలసీ: అగ్ని ప్రమాదంలో జరిగిన నష్టానికి ఆస్తికి సంబంధించిన వాస్తవ విలువతో సంబంధం లేకుండా ఈ ప్లాన్‌ ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని చెల్లిస్తుంది.
  • ఫ్లోటింగ్‌ పాలసీ: ఈ ప్లాన్‌ ఎక్కువ కార్యాలయాలు, కర్మాగారాలు ఉన్న వ్యాపార సంస్థలకు అనువుగా ఉంటుంది. ఒకే పాలసీ అన్ని కార్యాలయాలకు అగ్ని ప్రమాదం వల్ల కలిగి నష్టాలకు కవరేజ్‌ చేస్తుంది.

రూరల్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఇన్సూరెన్స్‌
ఈ బీమా గ్రామీణ ప్రాంతాలకు ఎంతో ప్రధానమైనది. గ్రామీణ, వ్యవసాయ బీమా పథకాలు రైతులు, గ్రామీణ వర్గాలను వివిధ ప్రమాదాలు, నష్టాల నుంచి రక్షించడానికి దీనిని రూపొందించారు. ఇది సాధారణంగా కరవు, పంటల తెగుళ్లు, వరదలు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏర్పడే నష్టాల నుంచి పంటలు, పశువులు, వ్యవసాయ పరికరాలను కవర్‌ చేస్తుంది. గ్రామీణ భారతదేశంలో వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవనోపాధిని కాపాడడంలో ఈ బీమా కీలక పాత్ర పోషిస్తుంది.

అసెట్‌ ఇన్సూరెన్స్‌
ఆస్తి బీమా ప్లాన్స్‌ ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్‌, కార్లు, విలువైన ఆభరణాలు మొదలైన ఆస్తులకు ఆర్థిక రక్షణ కల్పిస్తాయి. సాధారణంగా దొంగతనం లేదా ఏదైనా ప్రమాదాల కారణంగా ఆస్తిని పోగొట్టుకున్నప్పుడు కవరేజీ ఉంటుంది.

  • పబ్లిక్‌ లయబిలిటీ కవరేజ్‌: ఈ బీమా కవరేజ్‌ తీసుకున్నప్పుడు ఆ ప్రాపర్టీలో వేరే వ్యక్తి లేదా అతిథికి నష్టం జరిగితే కవరేజీని అందిస్తుంది.
  • వ్యక్తిగత ప్రమాద బీమా: పాలసీదారుడు ప్రమాదంలో మరణించినా లేదా శాశ్వతంగా అంగ వైకల్యం చెందినా కూడా బీమా పరిహారం అందుతుంది.
  • ల్యాండ్‌ లార్డ్‌ ఇన్సూరెన్స్‌: ఇంటి యాజమాని అద్దెను కోల్పోయినప్పుడు జరిగిన ఆర్థిక నష్టానికి బీమా పరిహారం లభిస్తుంది.
  • వ్యాపార బీమా: ఈ పాలసీ వ్యాపార కార్యకలాపాల సమయంలో సంభవించే నష్టాల నుంచి ఆర్థిక రక్షణ అందిస్తుంది. ఇది వ్యక్తులు, ఆస్తికి సంబంధించిన నష్టాలకు కవరేజీని ఇస్తుంది. వ్యాపార కార్యకలాపాల కారణంగా లేదా వృత్తిపరమైన సేవలను అందించేటప్పుడు కలిగే నష్టాలను బీమా భర్తీ చేస్తుంది. వ్యాపారం, దాని ఆర్థిక అవసరాల ఆధారంగా ఈ పాలసీని తీసుకోవాలి.

చివరిగా: ప్రస్తుతం మార్కెట్లో ఇంకా అనేక రకాల బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయి. కానీ, పాలసీ కొనుగోలు చేసేముందు మీ అవసరాలను, ప్రాధాన్యాలను పరిగణనలోకి తీసుకోవడం మంచిది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.