ETV Bharat / business

ఫస్ట్​టైం బైక్​ కొంటున్నారా? ఈ టాప్​-10 టిప్స్​ మీ కోసమే!​ - Two Wheeler Buying Tips

Two-Wheeler Buying Tips : మొదటిసారి టూ-వీలర్​ కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. బైక్​/ స్కూటర్​లను కొనేముందు ఏయే అంశాలను పరిశీలించాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

What To Check Before Buying A Bike
Two Wheeler Buying Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 29, 2024, 5:19 PM IST

Updated : Mar 29, 2024, 5:32 PM IST

Two-Wheeler Buying Tips : మీరు బైక్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. అవి: 1 గేర్స్ ఉన్న బైక్స్​ 2. గేర్స్​ లేని బైైక్స్​. వీటిలో మీకు నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. గేర్స్ ఉన్న బైక్​ కొనాలంటే, కాస్త ట్రైనింగ్​ అవసరం. అదే గేర్ లేని బైక్స్ అయితే నేర్చుకోవడం చాలా ఈజీ. ఇవే కాదు టూ-వీలర్స్ కొనేముందు మరికొన్ని కీలకమైన విషయాలు తెలుసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Tips For Buying A Bike :

  1. బ్రాండ్ సెలెక్షన్​ : టూ-వీలర్ కొనాలంటే చాలా డబ్బులు ఖర్చు చేయాలి. వాస్తవానికి ఇది కొన్ని సంవత్సరాల పాటు మీకు సర్వీస్ అందించాల్సి ఉంటుంది. కనుక మంచి బ్రాండెడ్​ బైక్​ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే వీటి క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇండియాలో హీరో మోటోకార్ప్, హోండా మోటార్‌ సైకిల్స్ & స్కూటర్స్ ఇండియా, టీవీఎస్​, మహీంద్రా, కైనెటిక్, సుజుకి సహా బోలెడు ద్విచక్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో బైక్ రీసేల్ వ్యాల్యూ ఎక్కువగా ఉండే బ్రాండ్‌ను సెలెక్ట్ చేసుకోవడం చాలా కీలకం.
  2. బడ్జెట్​ : టూ-వీలర్స్​ ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రస్తుతానికి కనీసం రూ.60వేలు లేకపోతే కొత్త బైక్​ కొనలేము. అత్యంత తక్కువ ధరలో హోండా, టీవీఎస్​, మహీంద్రా మొదలైన పాపులర్ బ్రాండ్‌ బైక్ సులభంగా కొనుగోలు చేయవచ్చు. మీ బడ్జెట్‌ను మరికొంత పెంచుకోగలిగితే, అదనపు ఫీచర్లు, కలర్ ఆప్షన్లతో మీకు నచ్చిన బైక్​ను ఎంచుకునే వీలుంటుంది.
  3. మైలేజ్ : ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే ముందు, అది అందించే మైలేజీని కచ్చితంగా పరిశీలించాలి. ఒక వాహనం లీటరు ఫ్యూయెల్​తో ప్రయాణించగల దూరమే మైలేజీ. ఒక మంచి బైక్ సగటున 35kmpl నుంచి 40kmpl వరకు మైలేజ్​ అందిస్తుంది. అయితే హైవేలపై ఇచ్చే మైలేజీతో, రూరల్ ఏరియాల్లో వచ్చే మైలేజ్​లో చాలా తేడా ఉంటుందనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి.
  4. మీకు సరిపోయే ఎత్తు ఉండే బైక్​ : బైక్​ను ఆపరేట్ చేయడానికి, మెయింటెయిన్ చేయడానికి దాని ఎత్తు మీకు తగినట్లుగా ఉండాలి. అప్పుడే అవసరమైతే మీ పాదాలతో దానిని బ్యాలెన్సింగ్ చేయగలుగుతారు. వాహనం మీ కంటే ఎత్తుగా ఉంటే దానిని ఆపరేట్ చేయడం కూడా కష్టమవుతుంది.
  5. బరువూ ముఖ్యమే : టూ-వీలర్ఎత్తు​తో పాటు, దాని బరువు కూడా మీరు హ్యాండిల్​ చేయగలిగేలా ఉండాలి. ఇందుకోసం బైక్​ను టెస్ట్​ రైడ్​కు అడగవచ్చు. అప్పుడే ఆ బైక్​ను మీరు హ్యాండిల్​ చేయగలరా? లేదా? అనేది తెలుస్తుంది. ఒకవేళ మీకు అది బరువుగా అనిపిస్తే, తక్కువ బరువున్న బైక్​ను ఎంచుకోవాలి.​
  6. ఆటో స్టార్ట్​ : చాలా బైక్స్ ఇప్పుడు గేర్​, గేర్​లెస్​గా వస్తున్నాయి. ముఖ్యంగా ట్రెడిషనల్​ కిక్-స్టార్ట్ ఆప్షన్​తో పాటు ఆటో-స్టార్ట్ లేదా పుష్-స్టార్ట్ ఆప్షన్​తో వస్తున్నాయి. ఆటో స్టార్ట్‌తో, ఇంజిన్‌ను రన్ చేయడానికి ఒక బటన్‌ను మాత్రమే నొక్కాలి. ఇలాంటి ఆప్షన్స్ ఉండే బైక్స్ సెలెక్ట్ చేసుకోవడం మంచిది.
  7. కస్టమర్ రివ్యూ, ఆన్-రోడ్ రివ్యూ : బైక్ కొనేముందు కచ్చితంగా కస్టమర్​ రివ్యూలను చూడాలి. అప్పుడే సదరు వాహనం పనితీరు, ఫీచర్లు, రియల్​ టైమ్​ మైలేజ్ తదితర అన్ని విషయాలు తెలుస్తాయి.​ అలాగే ​షోరూమ్ సేల్స్‌మ్యాన్ మీకు చెప్పని అనేక ఇతర అంశాలు ఆన్​-రోడ్ రివ్యూల ద్వారా తెలుసుకోవాలి.
  8. సర్వీస్​ సెంటర్​ : బైక్ కొనేటప్పుడు, సదరు కంపెనీ సర్వీస్ సెంటర్లు గురించి కూడా కచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే, దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు, ద్విచక్ర వాహనాన్ని దూరంగా ఉన్న సర్వీస్ లేదా రిపేర్ సెంటర్‌కు తీసుకెళ్లడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మీ సౌలభ్యం కోసం కంపెనీ లేదా కంపెనీతో ఒప్పందం చేసుకున్న సర్వీస్ సెంటర్ తప్పనిసరిగా మీ ఇంటికి సమీపంలో ఉండేలా చూసుకోవాలి.
  9. మెయింటెనెన్స్​ ఖర్చులు : వాహనం కొనుగోలు చేసిన తర్వాత దానిని బాగా మెయింటైన్ చేయాలి. ఇందుకోసం వాహనం కొనుగోలు చేసినప్పుడే, ఉచిత సర్వీసింగ్​ గురించి తెలుసుకోవాలి. సాధారణ సర్వీసింగ్​, టెక్​-అప్​ల కోసం అయ్యే ఖర్చులు గురించి కూడా ఆరా తీయాలి.
  10. స్పేర్​ పార్ట్స్​​ లభ్యత : వాహనం కొనేటప్పుడే దాని స్పేర్ పార్ట్స్ లభ్యత గురించి కూడా తెలుసుకోవాలి. కొన్ని బ్రాండ్​ల లేదా మ్యానుఫ్యాక్చరర్​ల స్పేర్ పార్ట్స్ అంత సులభంగా అందుబాటులో ఉండవు. అందువల్ల సదరు కంపెనీ వాహనం రిపేర్ వచ్చినప్పుడు మనకు చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే టూ-వీలర్స్ కొనేముందు కచ్చింతంగా స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంటాయో, లేదో తెలుసుకోండి.
  11. రీ-సేల్​ వ్యాల్యూ : వాహనం రీ-సేల్ వ్యాల్యూ ప్రధానంగా దాని బ్రాండ్, కండిషన్​పై ఆధారపడి ఉంటుంది. కనుక మంచి బ్రాండ్​ వెహికల్​నే కొనాలి. అలాగే కొనుగోలు చేసిన సంవత్సరంపై కూడా దాని రీసేల్ వాల్యూ ఆధారపడి ఉంటుంది.

రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్​ కొనాలా? ఈ టాప్​-5 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

బైక్​ వాషింగ్​కు ఎక్కువ డబ్బు ఖర్చు అవుతోందా? ఈ టిప్స్​ పాటిస్తే మనీ సేవ్​! - bike washing tips

Last Updated : Mar 29, 2024, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.