ETV Bharat / business

ఆగస్టులో లాంఛ్ కానున్న టాప్​-8 కార్స్ ఇవే! ఫీచర్స్ అదుర్స్ - ధర ఎంతో తెలుసా? - Cars Launching In August 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 1:10 PM IST

Top 8 Cars Launching In August 2024 : మీరు కొత్త కారు కొనాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. లేటెస్ట్ ఫీచర్స్​, స్పెక్స్​తో, మంచి మైలేజ్ ఇచ్చే కార్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి. వాటిలో ఆగస్టు నెలలో లాంఛ్ కానున్న టాప్​-8 కార్ల గురించి ఇప్పుడు తెలుసుుకందాం.

UPCOMING Cars Launching in August 2024
Top Cars Launching in August 2024 (ETV Bharat)

Top 8 Cars Launching In August 2024 : భారతదేశంలో కార్లకు భారీగా డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో, ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ లేటెస్ట్ టెక్నాలజీతో, అడ్వాన్స్​డ్​, మోడ్రన్ వెహికల్స్​ను మార్కెట్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటిలో ఈ ఆగస్టు నెలలో ఇండియన్​ మార్కెట్లోకి వస్తున్న టాప్​-8 కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. Mahindra Thar Roxx
మహీంద్రా కంపెనీ ఆగస్టు 15న 'థార్ రోక్స్'​ ఎస్​యూవీని భారత మార్కెట్లోకి తేనుంది. ఈ 5-డోర్​ వెర్షన్ కారు పూర్తిగా​ రగ్గడ్​, బోల్డ్ డిజైన్​తో వస్తుంది. దీనిలో సర్క్యులర్​ హెడ్​ల్యాప్స్ -​ ఎల్​ఈడీ ప్రొజక్టర్స్​తో, C-షేప్డ్​ డీఆర్​ఎల్స్​తో ఉంటాయి. ఈ కారు సిల్వర్​ బంపర్​తో, డైమండ్​-కట్​ అల్లాయ్ వీల్స్​తో వస్తుంది.

ఈ మహీంద్రా థార్ రోక్స్ కారు 2.2 లీటర్​ డీజిల్ ఇంజిన్​, 2.0 లీటర్​ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వస్తుంది. ఇవి ఆటోమేటిక్/ మాన్యువల్ ట్రాన్స్​మిషన్​తో పనిచేస్తాయి. ఈ 5 సీటర్ కారులో 10.25 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​, ఆటోమేట్​ క్లైమేట్ కంట్రోల్ ఉన్నాయి. ఇంకా దీనిలో​ రెండు ట్వీటర్స్​, 4 స్పీకర్లు ఉంటాయి. ఇది యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటోలకు సపోర్ట్ చేస్తుంది.

2. Citroen Basalt
ఆగస్టులో మార్కెట్లోకి రానున్న బెస్ట్ మోడల్ 'సిట్రోయెన్ బసాల్ట్​'. ఈ కూపే ఎస్​యూవీ కారు - నేరుగా టాటా కర్వ్​తో పోటీ పడనుంది. ఈ సిట్రోయెన్ బసాల్ట్ చూడడానికి సీ3, సీ3 ఎయిర్​క్రాస్​లాగా ఉంటుంది.

ఈ సిట్రోయెన్ బసాల్ట్​లో 1.2 లీటర్​, 3-సిలిండర్​ టర్బో ఛార్జ్​డ్​ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 110 హెచ్​పీ పవర్​, 190 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. అలాగే ఇది 6 స్పీడ్​ మాన్యువల్​/ ఆటోమేటిక్ ట్రాన్స్​మిషన్​తో పనిచేస్తుంది. ఈ కారులో 17 అంగుళాల అల్లాయ్ వీల్స్​ ఉంటాయి. దీనిలో క్రూయిజ్ కంట్రోల్​, ఆటోమేటిక్ ఎయిర్​ కండిషనింగ్​, పుష్​-బటన్​ ఇంజిన్​ స్టార్ట్​/ స్టాప్​, కీలెస్​ ఎంట్రీ, 7.2 అంగుళాల డిజిటల్​ డ్రైవర్స్ డిస్​ప్లే ఉంటాయని సమాచారం. ఈ కారులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్​ (ESC), రియర్ పార్కింగ్ కెమెరా, 6 ఎయిర్​ బ్యాగ్​లు ఉంటాయని తెలుస్తోంది. ఈ సిట్రోయెన్ కారు ప్రారంభ ధర సుమారుగా రూ.10 లక్షలు (ఎక్స్​-షోరూం) ఉండవచ్చు.

3. Hyundai Palisade
హ్యుందాయ్ పాలెసేడ్​ కారులో వైర్​లెస్ ఫోన్ ఛార్జర్​, ప్రతి వరుసలోనూ మల్టిపుల్​ యూఎస్​బీ ఛార్జింగ్ కనెక్షన్స్​ ఉంటాయి. అలాగే 12-స్పీకర్​ హర్మాన్​ కార్డాన్ సౌండ్ సిస్టమ్​, బ్లూలింక్​ కనెక్టెడ్​ కార్ టెక్నాలజీతో 10.25 అంగుళాల టచ్​స్క్రీన్​ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్ ఉంటాయని తెలుస్తోంది. ఈ కారులో మూడు వరుసల్లో కలిపి 8 సీట్లు ఉంటాయి.

4. Honda WR-V
హోండా కంపెనీ తీసుకువస్తున్న WR-V కారులో ఆటో ఎయిర్​ కండిషనింగ్​, పుష్ బటన్​ స్టార్ట్​/స్టాప్​, 7 అంగుళాల టచ్​స్క్రీన్​, ఆండ్రాయిడ్​ ఆటో, యాపిల్​ కార్​ప్లే ఉంటాయని సమాచారం. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, దీనిలో ఎలక్ట్రానిక్​ స్టెబిలిటీ కంట్రోల్​ (ESP), ఏబీఎస్​ విత్​ ఈబీడీ, ఆరు ఎయిర్​బ్యాగ్​లు ఉంటాయి.

5. Nissan X-Trail
నిస్సాన్ మోటార్ ఇండియా ఈ ఆగస్టులో X-Trail ఎస్​యూవీ లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. పైగా దీని బుకింగ్స్, డెలివరీ కూడా ఆగస్టులోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నిస్సాన్ ఎక్స్​-ట్రైల్ కారులో 2184 సీసీ, 4 సిలిండర్​, టర్బో-ఛార్జ్​డ్​, ఇంటర్​కూలర్​ డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 163 హెచ్​పీ పవర్​, 300 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుందని సమాచారం.

ఈ ఫోర్త్ జనరేషన్​ నిస్సాన్​ కారు సింగిల్ వేరియంట్​లో వస్తుంది. ఈ 7 సీటర్​ కారులో 8 అంగుళాల టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్, యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వైర్​లెస్లీ ఉంటాయి. అలాగే 12.3 అంగుళాల పూర్తి డిజిటల్​ డ్రైవర్స్​ డిస్​ప్లే ఉంటుంది. ఇంకా ఈ కారులో వైర్​లెస్​ ఫోన్​ ఛార్జర్​, పనోరమిక్​ సన్​రూఫ్​, డ్యూయెల్​-జోన్​ ఎయిర్​ కండిషనింగ్ ఉంటాయని తెలుస్తోంది. వాస్తవానికి ఈ నిస్సాన్​ ఎక్స్​-ట్రైల్​ కారును నిస్సాన్, రెనో కలిసి డెవలప్ చేశాయి. ఈ కారులో స్ల్పిట్​ ఎల్​ఈడీ హెడ్​లైట్ సెటప్​, లార్జ్ గ్రిల్​ ఉంటాయి. ఈ కారులో 20 అంగుళాల అల్లాయ్ వీల్స్​, ఎల్​ఈడీ టెయిల్​లైట్స్​ కూడా ఉంటాయని తెలుస్తోంది.

6. Mercedes-Benz CLE Cabriolet
మెర్సిడీస్​-బెంజ్ సీఎల్​ఈ కాబ్రియోలెట్​ కారును 2023 జులైలో పరిచయం చేశారు. త్వరలోనే దీనిని లాంఛ్ చేయనున్నారు. ఇది కూపే, కన్వర్టిబుల్​ స్టైల్స్​లో లభిస్తుంది. అయితే ఇండియాలో ఇది కేవలం కన్వర్టిబుల్ స్టైల్​లో మాత్రమే లభించనుంది. ఈ సీఎల్​ఈ కారు చూడడానికి సీ-క్లాస్​ కారులానే ఉంటుంది. ఈ కారులో 2+2 సీటింగ్ లేఅవుట్ ఉంటుంది. క్యాబిన్ విషయానికి వస్తే, దీనిలో 11.9 అంగుళాల పోట్రైట్ స్టైల్​ ఇన్ఫోటైన్​మెంట్​ డిస్​ప్లే, ఫుల్లీ డిజిటల్​ 12.3 అంగుళాల ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి.

ఈ కారు గ్లోబల్​గా పలు ఇంజిన్​ ఆప్షన్లలతో లభిస్తుంది. ప్రధానంగా రెండు కాన్ఫిగరేషన్లతో 2.0 లీటర్​, 4 సిలిండర్​ పెట్రోల్​ ఇంజిన్​; 3.0 లీటర్​, 6-సిలిండర్​ పెట్రోల్ ఇంజిన్​; 2 లీటర్​ టర్బో డీజిల్ ఇంజిన్​ ఆప్షన్​లు ఉంటాయి. వీటిలో ఏ వేరియంట్​ను ఇండియాలో లాంఛ్ చేస్తారో చూడాలి.

7. Mercedes-AMG GLC 43 4Matic
మెర్సిడీస్​-ఏఎంజీ జీఎల్​సీ​ 43 4 మ్యాటిక్ కారు​ కూడా త్వరలో లాంఛ్ కానుంది. ఈ కూపే కారు బ్లాక్ ఇంటీరియర్​ విత్ నిప్పా లెదర్​తో ఉంటుంది. ఈ కారులో స్పోర్టీ బకెట్​ సీట్స్​, ఏఎంజీ స్పెక్​ స్టీరింగ్ వీల్​ ఉంటాయి. ఈ కారులోని ఇన్ఫోటైన్​మెంట్​ సిస్టమ్ సరికొత్త ఎంబీయూఎక్స్​ యూఐతో వస్తుంది. ఇంకా ఈ కారులో డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్​, హెచ్​యూడీ డిస్​ప్లే, ఏఎంజీ ట్రాక్​ పేస్​ సాఫ్ట్​వేర్​ ఉంటాయి.

ఈ మెర్సిడీస్ కారులో మైల్డ్-హైబ్రీడ్​ 2.0 లీటర్​, 4 సిలిండర్​, టర్బో ఛార్జ్​డ్​ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 416 హెచ్​పీ పవర్​, 500 ఎన్​ఎం టార్క్​ జనరేట్ చేస్తుంది. ఇది కేవలం 4.7 సెకెన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని, దీని టాప్​ స్పీడ్​ గంటకు 250 కి.మీ అని కంపెనీ చెబుతోంది. ఈ కారు 9-స్పీడ్​ ఆటోమేటిక్ గేర్​ బాక్స్ కలిగి ఉంటుంది. అంతేకాదు ఈ మెర్సిడీస్​ 4-మ్యాటిక్​ ఏడబ్ల్యూడీ సిస్టమ్ విత్ రియర్-వీల్ స్టీరింగ్​తో వస్తుంది.

8. Lamborghini Urus SE
ఈ లాంబోర్గినీ ఉరుస్​ ఎస్​ఈ కారులో చాలా ఇంటీరియర్​, ఎక్స్​టీరియర్ స్టైలింగ్​​ అప్​డేట్స్​​ చేశారు. దీనిలోని బోనెట్​ను రీడిజైన్ చేశారు. మ్యాట్రిక్స్ టెక్నాలజీతో ఎల్​ఈడీ లైట్స్ అమర్చారు. అంతేకాదు దీనిలో కొత్త ఫ్రంట్​, రియర్​ బంపర్స్​, రీడిజైన్డ్​ టెయిల్​గేట్​ పొందుపరిచారు. ఈ కారులో 12.3 అంగుళాల సెంట్రల్ టచ్​స్క్రీన్​ను కొత్తగా జోడించారు. ఈ కారులో 4.0 లీటర్​ ట్విన్ టర్బో వీ8 ఇంజిన్​ను అమర్చారు. దీనిలో 25.9 కిలోవాట్స్​ సామర్థ్యం కలిగిన లిథియం-ఐయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ కారులోని ఎలక్ట్రిక్ మోటార్​, 8 స్పీడ్​ ఆటోమేటిక్​ ట్రాన్స్​మిషన్​తో అనుసంధానమై పనిచేస్తుంది. ఈ టోటల్ సిస్టమ్ 800 హెచ్​పీ పవర్​, 950 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ బండి కేవలం ఎలక్ట్రిక్ పవర్​తోనే 60 కి.మీ ప్రయాణం చేస్తుందని, దీని టాప్​ స్పీడ్ గంటకు​ 312 కి.మీ అని, ఇది కేవలం 3.4 సెకెన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకుంటుందని కంపెనీ చెబుతోంది.

నోట్​ : ఈ కార్ల ధరలను సదరు ఆటోమొబైల్ కంపెనీలు అధికారికంగా ప్రకటించలేదు. పూర్తి వివరాలు లాంఛ్ అయిన తరువాతనే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది.

బిజినెస్‌ కోసం వెహికల్ కొనాలా? సాలిడ్‌గా ఉండాలా? బెస్ట్ ఆప్షన్స్‌ ఇవే! - Best Commercial Vehicles In India

ఆగస్టు 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డ్ రూల్స్ - పెరిగిన ఛార్జీలు, ఫీజుల వివరాలు ఇవే! - HDFC Bank Credit Card Rules

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.