Tips to Increase Car Life Time: చాలా మంది.. కారు కొనుగోలు చేయడంలో చూపించిన శ్రద్ధ, దాని మెయింటెనెన్స్ విషయంలో చూపించరు. తొలినాళ్లలో అంతో ఇంతో కేర్ తీసుకున్నా.. ఆ తర్వాత సమయానికి సర్వీసింగ్ చేయించరు. ఇలా చాలా విషయాల్లో నిర్లక్ష్యం వహిస్తారు. కానీ.. ఇవే కారుకు ముప్పు తీసుకొస్తాయి. షెడ్డుకు తీసుకెళ్తాయి అంటున్నారు నిపుణులు! అలా జరగొద్దంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాలని సూచిస్తున్నారు.
తక్కువ డ్రైవ్ చేయడం: కొద్దిమంది తక్కువ దూరాలకు కూడా కార్లు బయటికి తీస్తుంటారు. అయితే అలా చేయొద్దని అంటున్నారు నిపుణులు. వీటివల్ల ఇంజన్ దెబ్బతింటుందని చెబుతున్నారు. దూరం ప్రయాణాలు చేయాలంటే కారును డైలీ నడపొచ్చని.. అలా కాకుండా తక్కువ దూరాలు ప్రయాణాలు చేయాలంటే.. వారానికి ఒక్కసారి మాత్రమే కారును నడపాలి అంటున్నారు. ఎందుకంటే కారును ఊరికే బయటికి తీయడం వల్ల ఫ్యూయల్ లీక్‌తోపాటు ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.
బైక్ పార్క్ చేస్తున్నారా? ఈ టిప్స్ పాటించకుంటే దొంగలు ఎత్తుకెళ్లడం ఖాయం!
ఫ్లూయిడ్స్ చెక్ చేయాలి: మీరు మీ యాంటీ-ఫ్రీజ్, ఆయిల్, ట్రాన్స్‌మిషన్ ఫ్లూయిడ్, పవర్ స్టీరింగ్ ఫ్లూయిడ్, బ్రేక్ ఫ్లూయిడ్ స్థాయిని క్రమం తప్పకుండా తనిఖీ చేయాలి. ఎందుకంటే.. మీ కారు డైలీ ఫ్లూయిడ్స్‌ను లీక్ చేయకపోయినా.. ఎప్పుడో ఒకసారి ఈ పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి.. ఎప్పడికప్పుడు వీటిని చెక్ చేయాలి. దీనివల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవడంతో పాటు కారు లైఫ్‌టైమ్ పెంచుకోవచ్చు.
శుభ్రంగా ఉంచడం: చాలా మంది కారును వాడిన తర్వాత దానిని శుభ్రం చేయడం మర్చిపోతారు. అయితే అలా చేయొద్దంటున్నారు నిపుణులు. కారును శుభ్రం చేయడం వల్ల వెహికల్ లైఫ్‌టైమ్ పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. కారులో ఉన్న చెత్త, దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయడం వల్ల కారులోని కొన్ని భాగాలు తుప్పు పట్టకుండా చూసుకోవచ్చు. తద్వారా కార్ లైఫ్‌టైమ్ పెరుగుతుంది.
ఫైనాన్స్‌లో కారు కొనేటప్పుడు చేసే పొరపాట్లు ఇవే - ఆర్థికంగా చాలా నష్టం!
ఎయిర్ ఫిల్టర్‌ని మార్చండి: ఎయిర్ ఫిల్టర్‌ని క్రమం తప్పకుండా మార్చడం వల్ల మీ కారు పనితీరు, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అలాగే జాగ్రత్తగా డ్రైవ్ చేయడం అంటే కొద్దిమంది ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల కారు తొందరగా షెడ్డుకు వెళ్తుంది. అలా కాకుండా జాగ్రత్తగా నడపడం వల్ల లైఫ్‌టైమ్ పెంచుకోవచ్చు.
ఇంజన్‌ఆయిల్ మార్చడం: చాలా మంది ఇంజన్ ఆయిల్ మార్చే విషయంలో నిర్లక్ష్యం వహిస్తారు. అలా కాకుండా రెగ్యులర్‌గా ఇంజన్ ఆయిల్ మార్చడం వల్ల ఇంజన్ దెబ్బతినకుండా ఉంటుంది. అంటే కంపెనీ చెప్పిన టైం ప్రకారం ఇంజన్ ఆయిల్ మార్చాలి. ఇలా చేయడం వల్ల కార్ జీవిత కాలం కూడా పెరుగుతుంది.
టైర్ల ఎయిర్ ప్రెషర్‌ను చెక్ చేయండి: చాలా మంది కారు ఓనర్లు పెద్దగా పట్టించుకోని విషయం ఇది. టైర్లలో గాలి నిండుగా ఉంటేనే అది సాఫీగా సాగిపోతుంది. మరికొందరు అవసరానికి మించి గాలి నింపుతారు. ఇది కూడా ఇబ్బందే. గాలి తక్కువగా ఉండటం వల్ల టైర్లకు, రోడ్డుకు మధ్య ఘర్షణ పెరిగి.. ఇంజిన్‌కు ఎక్కువ శక్తి అవసరం అవుతుంది. ఇది మైలేజ్‌పై ప్రభావం చూపుతుంది. గాలి ఎక్కువైతే ఒక్కోసారి టైర్లు పేలే అవకాశం ఉంటుంది. కాబట్టి టైర్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కారు లైఫ్‌టైమ్ పెరుగుతుంది.
ఓవర్‌లోడింగ్: మీ కారును ఓవర్‌లోడ్ చేయడం వల్ల ఇంజిన్, ట్రాన్స్‌మిషన్, సస్పెన్షన్‌పై అదనపు ఒత్తిడి పడుతుంది. ఇది మీ కారు జీవిత కాలాన్ని తగ్గిస్తుంది.
మీ కారులో స్టీరింగ్ వీల్ కవర్ లేదా? - వస్తువు చిన్నదే, సేఫ్టీ పెద్దది!