TCS Leads LinkedIn Top Rankings 2024 : ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ విడుదల చేసిన 2024 టాప్ కంపెనీస్ లిస్ట్‌లో దేశీయ టెక్ దిగ్గజం 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (టీసీఎస్) అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో యాక్సెంచర్, మూడో స్థానంలో కాగ్నిజెంట్ ఉన్నాయి. ఈ విధంగా దేశంలోని అగ్రగామి సంస్థల్లో టాప్-3 ర్యాంక్‌లను ఐటీ కంపెనీలే సొంతం చేసుకున్నాయి.
ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫాం లింక్డ్ఇన్ మంగళవారం 2024 టాప్ కంపెనీల జాబితా విడుదల చేసింది. ఇందులే టాప్-3 ర్యాంక్స్ ఐటీ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. అయితే జాబితాలోని 25 లార్జ్ కంపెనీల్లో ఆర్థిక సేవలు (ఫైనాన్సియల్ సర్వీసెస్) అందించే సంస్థలే 9 ఉన్నాయి. అంటే ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థలే స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించాయి.
లింక్డ్ ఇన్ విడుదల చేసిన 8వ ఎడిషన్ ఇది. ఇందులో 25 పెద్ద కంపెనీలు, 15 బెస్ట్ మిడ్-సైజ్ కంపెనీలు ఉన్నాయి. ఇన్-డిమాండ్ స్కిల్స్, టాప్ లొకేషన్స్, జాబ్ ఫంక్షన్స్ ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది లింక్డ్ఇన్. అలాగే కెరీర్ పురోగతికి అవసరైన ఎనిమిది అంశాలను ఆధారంగా చేసుకుని ఈ టాప్ కంపెనీల జాబితాను రూపొందించింది. అవి ఏమిటంటే? సామర్థ్యం, నైపుణ్యాల పెరుగుదల, కంపెనీ స్థిరత్వం, లింగ వైవిధ్యం, విద్యా నేపథ్యం, ఉద్యోగుల ఉనికి, ఎక్స్టర్నల్ ఆపర్చ్యూనిటీస్, కంపెనీ అఫినిటీ.
టాప్ - లార్జ్ కంపెనీస్
- ఇండియాలో 500+ ఉద్యోగులు ఉన్న పెద్ద కంపెనీల్లో టీసీఎస్ తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. యాక్సెంచర్, కాగ్నిజెంట్ వరుసగా 2,3 స్థానాల్లో ఉన్నాయి.
- ఫైనాన్సియల్ సర్వీసెస్ కంపెనీలైన మ్యాక్క్వేరీ గ్రూప్ (4వ స్థానం), మెర్గాన్ స్టాన్లీ (5వ స్థానం), జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో (6వ స్థానం)లో ఉన్నాయి.
టాప్ - మిడ్-సైజ్ కంపెనీస్
250 నుంచి 500 ఉద్యోగులు ఉన్న మిడ్-సైజ్ కంపెనీల్లో 'సాఫ్ట్వేర్-యూజ్-ఏ-సర్వీస్' (SaaS) ప్లాట్‌ఫామ్ 'లెంట్రా' ప్రథమ స్థానంలో నిలిచింది. ఇండియన్ ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్‌ఫాం 'మేక్ మై ట్రిప్' రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఫ్యాషన్ అండ్ బ్యూటీ రిటైలర్ 'నైకా', ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్‌ఫామ్ 'డ్రీమ్ 11' కూడా ఉన్నాయి.
ఇన్-డిమాండ్ స్కిల్స్
ఆర్థిక సేవల రంగంలోని అగ్రశ్రేణి కంపెనీలు మూలధన మార్కెట్లు, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, పెట్టుబడిదారుల సంబంధాలు లాంటి ఇన్-డిమాండ్ స్కిల్స్ కోసం వెతుకుతున్నాయి.
టెక్నాలజీ రంగంలోని కంపెనీలు ప్రధానంగా ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్, డేటా స్టోరేజ్ టెక్నాలజీ, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ (ఎస్డీఎల్సీ), ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నైపుణ్యాల కోసం చూస్తున్నాయి. రెవెన్యూ అనాలసిస్, నాన్-ప్రాఫిట్ మేనేజ్మెంట్, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లాంటి నైపుణ్యాలకు కూడా డిమాండ్ పెరుగుతోంది.
అగ్రస్థానంలో బెంగళూరు
ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరు పొందిన బెంగళూరులో అగ్రగామి టెక్ కంపెనీలు ఉన్నాయి. ఇవి ప్రతిభావంతులైన యువతీ, యువకులను నియమించుకుంటున్నాయి. బెంగళూరు తరువాత స్థానాల్లో హైదరాబాద్, ముంబయి మెట్రోపాలిటన్ రీజియన్, పుణె ఉన్నాయి.
జియో బంపర్ ఆఫర్ - ఈ పాపులర్ ప్లాన్‌పై 78GB ఎక్స్ట్రా డేటా! - JIO OFFERING 78GB EXTRA DATA