Tax Saving Investments For Senior Citizens : ఈ మార్చి 31తో 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. అందువల్ల సీనియర్ సిటిజన్లు రిస్క్ లేకుండా మంచి రాబడి అందించే స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. ఈ స్కీమ్స్ అదనపు ఆదాయాన్ని అందించడంతో పాటు, పన్ను మినహాయింపులను కూడా అందించాలి. అందుకే ఈ ఆర్టికల్‌లో రిటైర్మెంట్ ప్లానింగ్ ఉన్నవారు, భవిష్యత్ అవసరాలకోసం సరైన పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారు ఎలాంటి స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకుందాం.
1. ఫిక్స్డ్ డిపాజిట్లు (FIXED DEPOSIT)
సీనియర్ సిటిజన్లకు ఫిక్స్డ్ డిపాజిట్లు మలి వయసులో భరోసా కల్పిస్తాయి. వీటికి 5 సంవత్సరాల లాకింగ్ పీరియడ్ ఉంటుంది. మార్కెట్ ఒడుదొడుకల ప్రభావం దీనిపై ఉండదు. కనుక గ్యారంటీ రాబడిని అందిస్తాయి. ప్రధాన బ్యాంకులైన SBI, HDFC, ICICI బ్యాంకులు సీనియర్ సిటిజన్లకు 5.50 శాతం నుండి 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. ఈ పెట్టుబడి మీద వచ్చిన వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ ఈ స్కీములో పెట్టుబడిదారులు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.
2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF )
భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సీనియర్ సిటిజన్లు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది 15 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కలిగి ఉంటుంది. ఈ పీపీఎఫ్‌పై 7.1 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఇది ఫిక్స్డ్ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీ కన్నా అధికం. పెట్టుబడి మీద సంపాదించిన వడ్డీపైనా, మెచ్యూరిటీ అమౌంట్పైనా పన్ను మినహాయింపు లభిస్తుంది. పెట్టుబడిదారులు సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పీపీఎఫ్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF ) పొదుపు చేసిన పెట్టుబడిదారులు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు.
3. నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS)
సీనియర్ సిటిజన్లు తమ రిటైర్మెంట్ ప్లాన్‌ను సరైన పద్దతిలో చేసుకోవడానికి నేషనల్ పెన్షన్ స్కీమ్ చక్కగా ఉపయోగపడుతుంది. ఇది ఈక్విటీ, కార్పొరేట్ బాండ్లు, డెట్ పెట్టుబడి ఎంపికలతో కూడిన పథకం. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. ఈ స్కీములో సంవత్సరానికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు మదుపు చేసుకోవచ్చు.సెక్షన్ 80సీసీడీ(1బీ) కింద రూ.50,000 వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది.
4. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS)
సీనియర్ సిటిజన్లు పన్ను ప్రయోజనాలు పొందడం కోసం ఈక్విటీ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టవచ్చు. దీనికి ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ (ELSS) అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్స్ మూడేళ్ల లాక్- ఇన్ పీరియడ్ కలిగి ఉంటాయి. అధిక రాబడిని కూడా అందిస్తాయి. ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినవారు సెక్షన్ 80సీ కింద రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే దీనిలో కాస్త రిస్క్ ఉంటుందనే విషయాన్ని సీనియర్ సిటిజన్లు గుర్తించాలి.
5. పన్ను రహిత బాండ్లు (TAX FREE BONDS)
పన్ను రహిత బాండ్లపై వచ్చే వడ్డీకి ఆదాయపన్ను వర్తించదు. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్పొరేషన్లు- గవర్నమెంట్ తరుపున ఈ బాండ్లను జారీచేస్తాయి. ఇవి పెట్టుబడిదారులకు ఫిక్స్డ్ వడ్డీని పొందే అవకాశాన్ని కల్గిస్తున్నాయి. ఎటువంటి రిస్క్ లేని పెట్టుబడులు పెట్టాలనుకునే సీనియర్ సిటిజన్లు ఇవి మంచి ఆప్షన్ అవుతాయి.
షేర్ మార్కెట్లో లాభాలు సంపాదించాలా? ఈ 5 టిప్స్ పాటించండి!
తక్కువ వడ్డీకే లోన్ ఇస్తామంటున్నారా? సైబర్ నేరగాళ్లు కావచ్చు - జర జాగ్రత్త!