Surge 32 Hero Vehicle : ఎలక్ట్రిక్ బైక్‌ను క్షణాల్లోనే ఆటో రిక్షాగా మార్చుకునేలా ఓ కొత్త వాహనాన్ని హీరో మోటోకార్ప్‌కు చెందిన సర్జ్ స్టార్టప్ రూపొందించింది. ఇటీవల జరిగిన 'హీరో వరల్డ్' ఈవెంట్‌లో దీన్ని ప్రదర్శించారు. సర్జ్ 32 పేరిట ఈ వాహనాన్ని ఆవిష్కరించారు. స్వయం ఉపాధి పొందే వారి కోసం ప్రత్యేకంగా దీన్ని రూపొందించినట్లు కంపెనీ పేర్కొంది.
ఇది టూ-ఇన్- వన్ ఎలక్ట్రిక్ వెహికల్. అవసరాలకు తగ్గట్టుగా కావాల్సిన విధంగా మార్చుకోవచ్చు. వ్యాపార అవసరాల కోసం త్రీవీలర్‌గానూ, వ్యక్తిగత అవసరాల కోసం 2 వీలర్‌గానూ కేవలం మూడు నిమిషాల్లోనే మార్చుకోవచ్చు. సాధారణ ఆటో రిక్షాల మాదిరిగానే ఈ త్రీ వీలర్ ఆటో రిక్షాలోనూ విండ్ స్క్రీన్, హెడ్‌ల్యాంప్, టర్న్ ఇండికేటర్లు, విండ్ స్క్రీన్ వైపర్లు ఉన్నాయి. ఆటోకు డోర్లు లేనప్పటికీ జిప్‌తో కూడిన సాఫ్ట్‌డోర్‌లను అందించే అవకాశం ఉంది.
ఇక కొత్త తరహా వాహనంలో త్రీవీలర్, టూవీలర్‌కు వేర్వేరు సామర్థ్యాలు నిర్ణయించారు. త్రీవీలర్‌లో 10KW ఇంజిన్ ఇచ్చారు. 11KWh బ్యాటరీని అమర్చారు. ఇక స్కూటర్‌లో 3KW ఇంజిన్ ఉంటుంది. వ్యక్తిగత అవసరాలకు సరిపోయేలా 3.5 KWh బ్యాటరీని అమర్చారు. త్రీవీలర్ టాప్ స్పీడ్ 50 కిలోమీటర్లు. 500 కిలోల వరకు బరువును మోసుకెళ్లగలదు. టూవీలర్ గరిష్ఠంగా 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఏథర్ నుంచి మరో బైక్
Ather Electric Scooter Price : ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ నుంచి ఇటీవలే మరో కొత్త స్కూటర్ విడుదలైంది. ఎప్పటి నుంచో టీజర్లతో ఊరిస్తూ వస్తున్న ఏథర్ 450 అపెక్స్‌ను ఆ సంస్థ లాంచ్ చేసింది. దీని ధర రూ.1.89 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్) కంపెనీ నిర్ణయించింది. ఏథర్ ప్రస్తుతం 450 ఎస్, 450 ఎక్స్ పేరిట రెండు మోడళ్లను విక్రయిస్తోంది. వాటితో పోలిస్తే కొత్త స్కూటర్‌లో అదనంగా ఏమేం తీసుకొచ్చారు? కొత్త స్కూటర్ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఏథర్ కొత్త స్కూటర్‌లో 3.7KWh బ్యాటరీ ఇచ్చారు. ఇది సింగిల్ ఛార్జితో 157 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో మొత్తం ఐదు రైడింగ్ మోడ్‌లు ఇచ్చారు. వ్రాప్ మోడ్ స్థానంలో కొత్తగా వ్రాప్ ప్లస్‌ను పరిచయం చేశారు. అలాగే మ్యాజిక్ ట్విస్ట్ అనే ఫీచర్‌ను తీసుకొచ్చారు. సాధారణంగా బ్రేక్ వేసేటప్పుడు థ్రోటల్ రిలీజ్ చేస్తూ బ్రేక్ అప్లై చేస్తుంటాం. ఈ కొత్త ఫీచర్‌లో థ్రోటల్ రిలీజ్ చేసిన ప్రతిసారీ బ్రేక్ వేయాల్సిన అవసరం ఉండదు. ఆటోమేటిక్‌గా బ్రేక్ అప్లై అవుతుంది.
సెకండ్ హ్యాండ్ బైక్ కొంటున్నారా? ఈ 6 డాక్యుమెంట్స్ తప్పనిసరి!