ETV Bharat / business

ఉన్నత విద్య కోసం విదేశాలు వెళ్తున్నారా? ట్రావెల్​ ఇన్సూరెన్స్ మస్ట్​ - బెనిఫిట్స్ ఏమిటంటే?​ - student travel insurance details

Students Travel Insurance : జీవిత, వాహ‌న బీమా ఉన్న‌ట్లే విదేశాల్లో చ‌దువుకునే వారికి ప్ర‌త్యేక బీమా ఉంద‌ని మీకు తెలుసా? దాన్ని స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటారు. మ‌రి ఈ ట్రావెల్​ ఇన్సూరెన్స్ ఎక్క‌డ తీసుకోవాలి? దాని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Travel Insurance for students
Students Travel Insurance
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 1, 2024, 2:53 PM IST

Students Travel Insurance : విదేశాల్లో చ‌దువుకునే విద్యార్థుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఉన్న‌త చ‌దువుల కోసం విదేశీ విశ్వ‌విద్యాల‌యాలను చాలా మంది ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి వారికి స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ త‌ప్ప‌నిస‌రి. అకస్మ‌ాత్తుగా వ‌చ్చే ఆర్థిక న‌ష్టాల నుంచి ఇది మ‌న‌ల్ని కాపాడుతుంది. ఇందులో మెడిక‌ల్, నాన్ మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ బెనిఫిట్స్​తోపాటు, ఆటోమేటిక్ రెన్యువ‌ల్ ఫీచ‌ర్ల‌ు ఉంటాయి. దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల విదేశాల్లో చ‌దువుకునే విద్యార్థుల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది.

ట్రావెల్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్​

  • అత్యవసర ఆసుప‌త్రి ఖ‌ర్చులు
  • ఊహించని వైద్య ఖర్చులు
  • ట్రావెల్ డిలే ఖర్చులు
  • శారీరక గాయాలు, ఆస్తి నష్టం, వైద్య బిల్లులు, లీగల్ ఖర్చులు
  • ప్ర‌యాణంలో ల‌గేజీ పోయినప్పుడు పరిహారం లభిస్తుంది.
  • చదువుల్లో అంత‌రాయం ఏర్ప‌డినప్పుడు పరిహారం పొందవచ్చు.
  • స్పాన్సర్ మరణించిన సందర్భంలో బ్యాలెన్స్ కోర్సు ఫీజును కవర్ చేస్తుంది.
  • పాస్‌పోర్ట్ పోయినా ఈ పాలసీ కవర్ చేస్తుంది.

అందుకే విద్యార్థుల విదేశీ పర్యటనల సమయంలో ప్రయాణ బీమా తీసుకోవ‌డం చాలా ముఖ్యం. ఉదాహ‌ర‌ణ‌కు ఒక విద్యార్థి తన పాస్‌పోర్ట్‌ను పోగొట్టుకుంటే, ఈ బీమా వారికి తాత్కాలిక పాస్​పోర్టు అందిస్తుంది.

ప్రయాణ బీమాకు ఎంత‌ ఖర్చు అవుతుంది?
ఇది ఆరోగ్య, అంతర్జాతీయ ప్రయాణ బీమాల ప్రత్యేక కలయిక అని చెప్ప‌వ‌చ్చు. విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 16 - 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న భారతీయ విద్యార్థులు దీనికి అర్హులు. ప్రయాణ బీమా వ్యవధి 1 నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని యూనివ‌ర్సిటీలు వారి విద్యార్థుల కోసం ప్ర‌యాణ బీమా వివ‌రాల్ని త‌మ వెబ్​సైట్ల‌లో పొందుప‌రుస్తాయి. మ‌రి కొన్ని విశ్వవిద్యాలయాలు అడ్మిషన్ ప్రక్రియలో భాగంగా వీటిని తీసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి చేశాయి. ప్రయాణ బీమా యూఎస్, కెనడాకు కనీసం రూ.1. 50 కోట్లు; యూకే, ఇతర దేశాలకు రూ.37 ల‌క్ష‌ల నుంచి రూ.1.50 కోట్ల క‌వ‌రేజీని క‌లిగి ఉంటుంది.

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి దేశాన్నీ కవర్ చేస్తుంది. కానీ దీని బీమా కవరేజీ అమౌంట్​ ఒక దేశం నుంచి మ‌రో దేశానికి మారుతుంది. ఉదాహరణకు, ఇతర దేశాలతో పోల్చినప్పుడు అమెరికాలో వైద్య సహాయం ఎక్కువగా ఉంటుంది. కనుక క‌వ‌రేజీతో పాటు ప్రీమియం కూడా ఎక్కువగానే ఉంటుంది.

చిన్న‌పిల్ల‌ల‌కు బీమా వ‌ర్తిస్తుందా?
ప్రయాణ బీమా పాలసీ 18 ఏళ్లలోపు పిల్లలకు కూడా కవరేజీని అందిస్తుంది. ఇది వారు ప్ర‌యాణించే విధానంపై ఆధారప‌డి ఉంటుంది. ఇందులో ల‌గేజీ చోరీకి గురి కావ‌డం, మెడిక‌ల్ ఖ‌ర్చులు, వారు త‌ప్పిపోతే వారిని తిరిగి ఇంటికి తీసుకురావ‌డానికి అయ్యే ఖ‌ర్చు, క‌రోనా వైర‌స్ ఖ‌ర్చులు ఉంటాయి.

పాల‌సీ వ్య‌వ‌ధి, రెన్యువ‌ల్ సంగ‌తేంటి?
ప్రయాణ బీమాకు నిర్దిష్ట కాల వ్యవధి ఉంటుంది. ఇది 1 నుంచి 3 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉంటుంది. చాలా కంపెనీలు ఆటోమేటిక్ రెన్యువ‌ల్ ఆప్ష‌న్ కూడా ఇస్తాయి.

స్టూడెంట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విష‌యాలు

  • సామానులు, ఇతర వ్యక్తిగత వస్తువులను పోతే : విద్యార్థి విదేశీ పర్యటనలో పాస్‌పోర్ట్/లగేజీ/వ్యక్తిగత వస్తువులను పోగొట్టుకుంటే, ఈ బీమా పాలసీ ద్వారా పరిహారం పొందవచ్చు. పాస్‌పోర్ట్ పోయినట్లయితే, తాత్కాలిక పాస్‌పోర్ట్ మంజూరు చేస్తారు.
  • మెడికల్ ఎమర్జెన్సీ : అనారోగ్యం, గాయాలు కావ‌డం, ఆసుపత్రిలో చేరితే బీమా సంస్థ వైద్య ఖర్చులు చెల్లిస్తుంది.
  • తాత్కాలిక వసతి : ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఈ పాలసీదారులకు ఇన్సూరెన్స్ కంపెనీ ఆశ్రయం క‌ల్పిస్తుంది.
  • న్యాయపరమైన విషయాలు : వివిధ దేశాల్లో వివిధ రకాల చట్టాలు, నిబంధనలు ఉంటాయి. ఒక విద్యార్థి న్యాయపరమైన చిక్కుల్లో ఇరుక్కుంటే దానికి కావాల్సిన బీమా సంస్థ ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తుంది. కేసు ఖర్చులు భరిస్తుంది. బెయిల్ కూడా ఇప్పిస్తుంది.

క‌వ‌ర్ కాని అంశాలు

  • అజాగ్ర‌త్తతో, లేదా నిర్ల‌క్ష్యంతో సామాన్లు పోగొట్టుకున్నప్పుడు
  • మానసిక రుగ్మతలు, స్వీయ హాని, ఆందోళన చెంద‌డం, మాదకద్రవ్యాల దుర్వినియోగం, మద్యం, ఒత్తిడి, నిరాశలతో ఆత్మహత్య చేసుకుంటే బీమా సంస్థ ఎలాంటి పరిహారం అందించదు.
  • హెచ్​ఐవీ, ఎయిడ్స్​ లాంటి రోగాలకు కూడా పరిహారం లభించదు.
  • యుద్ధం లేదా అణుబాంబు ముప్పు కారణంగా తలెత్తే నష్టాలు కూడా ఈ ఇన్సూరెన్స్ కింద కవర్ కావు.

పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన పత్రాలు పోగొట్టుకున్న సందర్భంలో, ప్రయాణ బీమా తాత్కాలిక పాస్‌పోర్ట్, ఇతర పత్రాలను అందిస్తుంది. దీంతోపాటు కొత్త పాస్​పోర్టుకు అయ్యే ఖ‌ర్చుల్ని కూడా చెల్లిస్తుంది. పాలసీ డాక్యుమెంట్‌లో పేర్కొన్న విధంగా వ్యక్తిగత గాయాలు, అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, ప్ర‌మాదానికి గురైన స‌మ‌యంలో అన్ని వైద్య ఖర్చులను ఈ ప్రయాణ బీమా కవర్ చేస్తుంది.

అంగన్వాడీలు, ఆశావర్కర్లకు ఆయుష్మాన్ భారత్ కార్డులు - గృహ రుణాలు!

ఊరట ఇవ్వని కేంద్ర బడ్జెట్! పన్ను విధానంలో మార్పుల్లేవ్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.