Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఎగ్జిట్ పోల్ జోష్‌తో సెన్సెక్స్, నిఫ్టీ దూసుకుపోయాయి. చివరికి సెన్సెక్స్ & నిఫ్టీ జీవనకాల గరిష్ఠాల వద్ద స్థిరపడ్డాయి. మదుపరులు ఏకంగా రూ.12.50 లక్షల కోట్ల మేర లాభపడ్డారు.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2507 పాయింట్లు లాభపడి 76,468 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 733 పాయింట్లు వృద్ధిచెంది 23,263 వద్ద ముగిసింది.
- లాభపడిన స్టాక్స్ : ఎన్టీపీసీ, ఎస్బీఐ, పవర్‌గ్రిడ్, ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, టాటా స్టీల్స్, టాటా మోటార్స్, విప్రో
- నష్టపోయిన షేర్స్ : హెచ్‌సీఎల్ టెక్, సన్‌ఫార్మా, ఏసియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, ఇన్ఫోసిస్
సోమవారం అదానీ గ్రూప్ షేర్లు భారీ లాభాలు ఆర్జించాయి. ముఖ్యంగా అదానీ పవర్ స్టాక్స్ 16 శాతం వరకు లాభపడింది. బ్లూ-చిప్ స్టాక్స్ అయిన రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎస్బీఐ కూడా భారీ లాభపడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని చెప్పడంతో, రోజంతా బుల్ రన్ ఎక్కడా తగ్గకుండా కొనసాగింది. ఈ బుల్ రన్లో పీఎస్‌యూ, పవర్, యుటిలిటీస్, ఆయిల్, ఎనర్జీ, క్యాపిటల్ గూడ్స్, రియాలిటీ రంగాలు అన్నీ రాణించాయి.
Asian Markets : ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్ మంచి లాభాలతో ముగిశాయి. షాంఘై మాత్రం నష్టపోయింది. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. యూఎస్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.1,613.24 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
ముడిచమురు ధర
Crude Oil Prices June 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.18 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 81.26 డాలర్లుగా ఉంది.
03.15 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2602 పాయింట్లు లాభపడి 76,562 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 763 పాయింట్లు వృద్ధిచెంది 23,293 వద్ద కొనసాగుతోంది.
02.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2377 పాయింట్లు లాభపడి 76,324 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 712 పాయింట్లు వృద్ధిచెంది 23,243 వద్ద కొనసాగుతోంది.
01.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2323 పాయింట్లు లాభపడి 76,288 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 696 పాయింట్లు వృద్ధిచెంది 23,226 వద్ద కొనసాగుతోంది.
12.00 PM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2306 పాయింట్లు లాభపడి 76,246 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 694 పాయింట్లు వృద్ధిచెంది 23,147 వద్ద కొనసాగుతోంది.
11.00 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2025 పాయింట్లు లాభపడి 75,984 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 616 పాయింట్లు వృద్ధిచెంది 23,224 వద్ద కొనసాగుతోంది.
10.30 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2135 పాయింట్లు లాభపడి 76,097 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 661 పాయింట్లు వృద్ధిచెంది 23,192 వద్ద కొనసాగుతోంది.
10.00 AM : ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2017 పాయింట్లు లాభపడి 75,983 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 629 పాయింట్లు వృద్ధిచెంది 23,160 వద్ద కొనసాగుతోంది.
Stock Market Today June 3, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైల్ హైరికార్డ్ను క్రాస్ చేశాయి. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించవచ్చని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు కనీ, వినీ ఎరుగని రీతిలో భారీ లాభాల్లో దూసుకుపోతున్నాయి.
ఎర్లీ ట్రేడ్‌లో సెన్సెక్స్ ఏకంగా 2,777 పాయింట్లు (3.75 శాతం) లాభపడి 76,738 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ 808 పాయింట్లు (3.58 శాతం) వృద్ధి చెంది 23,338 వద్ద లైఫ్ టైమ్ హైరికార్డ్ను క్రాస్ చేసింది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 2001 పాయింట్లు లాభపడి 75,886 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 615 పాయింట్లు వృద్ధిచెంది 23,146 వద్ద కొనసాగుతోంది.
లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : అన్ని రంగాల స్టాక్స్ కూడా లాభాల్లో దూసుకుపోతున్నాయి. ప్రధానంగా పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా మార్కెట్లు
Asian Markets June 3, 2024 : ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, హాంకాంగ్‌లు మంచి లాభాలతో కొనసాగుతున్నాయి. షాంఘై మాత్రం నష్టాల్లో కొనసాగుతోంది. యూఎస్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.
రూపాయి విలువ
Rupee Open June 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 42 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices June 3, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.04 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 81.08 డాలర్లుగా ఉంది.
గుడ్ న్యూస్ - భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - Gold Rate Today