ETV Bharat / business

ఆల్​-టైమ్ హై రికార్డ్ వద్ద ముగిసిన సెన్సెక్స్​ & నిఫ్టీ - Sensex Hit A New Closing Peak - SENSEX HIT A NEW CLOSING PEAK

Stock Market Today June 14, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 181 పాయింట్లు లాభపడి 76,992 వద్ద; నిఫ్టీ 66 పాయింట్లు వృద్ధిచెంది 23,465 వద్ద జీవన కాల గరిష్ఠాలతో ముగిశాయి.

Stock Market Today June 14, 2024
Stock Market Today June 14, 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 14, 2024, 3:57 PM IST

Updated : Jun 14, 2024, 4:32 PM IST

Stock Market Today June 14, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 181 పాయింట్లు లాభపడి 76,992 వద్ద లైఫ్​ టైమ్ హై రికార్డ్ వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 66 పాయింట్లు వృద్ధి చెంది 23,465 వద్ద జీవన కాల గరిష్ఠాలను టచ్​ చేసి స్థిరపడింది. మదుపరులు హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్ ఇండస్ట్రీస్​, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లను భారీ స్థాయిలో కొనడమే ఇందుకు కారణం.

  • లాభపడిన స్టాక్స్​ : ఎం అండ్ ఎం, టైటాన్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, రిలయన్స్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్​
  • నష్టపోయిన షేర్స్​ : టెక్ మహీంద్రా, టీసీఎస్, విప్రో, హెచ్​సీఎల్ టెక్, కోటక్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎస్​బీఐ

ఎగుమతులు పెరిగాయ్
శుక్రవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024 మే నెలలో భారతదేశ సరకుల (మర్చండైస్​) ఎగుమతులు 9 శాతం పెరిగి 38.13 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది కూడా మదుపరుల సెంటిమెంట్​ను బలపరిచింది. దీనితో శుక్రవారం దేశీయ మార్కెట్లు రికార్డ్ స్థాయిలో లాభపడ్డాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారతదేశం చేసుకుంటున్న దిగుమతులు కూడా భారీగానే పెరిగాయి. 2023 మే నెలలో 57.48 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంటే, 2024 మే నాటికి 61.91 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకున్నాం.

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్​, టోక్యో, షాంఘై లాభాలతో ముగిశాయి. హాంకాంగ్ మాత్రం నష్టాలతో స్థిరపడింది. ప్రస్తుతానికి యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. గురువారం యూఎస్​ మార్కెట్లు మిశ్రమ ఫలితాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, గురువారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.3,033 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయించారు.

ముడిచమురు ధర
Crude Oil Prices June 14, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో ముడిచమురు ధరలు 0.12 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్​ క్రూడ్​ ఆయిల్ ధర 82.65 డాలర్లుగా ఉంది.

జులై 22న కేంద్ర బడ్జెట్‌ - జులై 3న ఆర్థిక సర్వే! - Union Budget 2024

కూరగాయల ధరలకు రెక్కలు - 15 నెలల గరిష్ఠానికి టోకు ద్రవ్యోల్బణం - WPI Inflation Rises

Last Updated : Jun 14, 2024, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.