ETV Bharat / business

ఫ్లాట్​గా ముగిసిన స్టాక్ మార్కెట్లు - రాణించిన మీడియా, రియాలిటీ షేర్లు - Stock Market Today - STOCK MARKET TODAY

Stock Market Close July 29th, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకులకు లోనై చివరకు ఫ్లాట్​గా ముగిశాయి. మీడియా, రియాలిటీ స్టాక్స్ మాత్రం లాభపడ్డాయి.

Share Market Today July 29th, 2024
Stock Market Today July 29th, 2024 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 29, 2024, 9:47 AM IST

Updated : Jul 29, 2024, 3:46 PM IST

Stock Market Close : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్​గా ముగిశాయి. ఉదయం మంచి లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు, తరువాత తీవ్ర ఒడుదొడుకులకు లోనయ్యాయి. ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లను ప్రకటించనుంది. అందుకే మదుపరులు ముందు జాగ్రత్త చర్యగా ఎఫ్​ఎంసీజీ, ఐటీ షేర్ల నుంచి లాభాలు స్వీకరించారు. అందుకే ఎర్లీ ట్రేడింగ్​లో భారీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​, నిఫ్టీలు చివరకు ఫ్లాట్​గా ముగిశాయి. అయితే మీడియా, రియాలిటీ షేర్లు మాత్రం లాభపడ్డాయి.

చివరకు బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 23 పాయింట్లు లాభపడి 81,355 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 1.25 పాయింట్లు వృద్ధిచెంది 24,836 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్​ : ఎల్​ అండ్ టీ, బజాజ్​ఫిన్​సెర్వ్​, ఎం అండ్ ఎం, ఆల్ట్రాటెక్ సిమెంట్​, ఎస్​బీఐ, రిలయన్స్​, ఇండస్​ఇండ్ బ్యాంక్​, సన్​ఫార్మా, మారుతి సుజుకి, ఐసీఐసీఐ బ్యాంక్​
  • నష్టపోయిన షేర్స్​ : ​టైటాన్​, భారతీ ఎయిర్​టెల్​, ఐటీసీ, టెక్ మహీంద్రా, కోటక్ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఎన్​టీపీసీ, యాక్సిస్ బ్యాంక్​, పవర్​గ్రిడ్​, హెచ్​సీఎల్ టెక్​

అంతర్జాతీయ మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్​, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ లాభాలు మూటగట్టుకున్నాయి. శుక్రవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరోపియన్ మార్కెట్లు మిక్స్​డ్ ట్రెండ్​లో నడుస్తున్నాయి.

ముడి చమురు ధర
Crude Oil Prices July 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.31 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80.88 డాలర్లుగా ఉంది.

Stock Market Today July 29th, 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 416 పాయింట్లు లాభపడి 81,749 వద్ద జీవన కాల గరిష్ఠాన్ని తాకింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 145 పాయింట్లు వృద్ధిచెంది 24,902 వద్ద లైఫ్​ టైమ్ పీక్స్​ను టచ్​ చేసింది. విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 270 పాయింట్లు లాభపడి 81,602 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 67 పాయింట్లు వృద్ధిచెంది 24,920 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : ఐసీఐసీఐ బ్యాంక్​, ఎస్​బీఐ, ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఎల్ అండ్ టీ, ఎన్​టీపీసీ, టాటా మోటార్స్​, ఇన్ఫోసిస్​, రిలయన్స్​, టాటా స్టీల్​, అదానీ పోర్ట్స్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ​టైటాన్​, భారతీ ఎయిర్​టెల్​, టెక్ మహీంద్రా, ఐటీసీ, పవర్​గ్రిడ్​, ఏసియన్ పెయింట్స్​, సన్​ఫార్మా, కోటక్ బ్యాంక్​, హెచ్​సీఎల్ టెక్​, నెస్లే ఇండియా

ఆసియా మార్కెట్లు
ఏసియన్ మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ అన్నీ పాజిటివ్ ట్రేండ్​లోనే కొనసాగుతున్నాయి. శుక్రవారం యూఎస్​ మార్కెట్లు మంచి లాభాలతో ముగిసిన విషయం తెలిసిందే.

విదేశీ సంస్థాగత పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు రూ.2,546.38 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులతో కూడా కలుపుకుంటే, ఈ పెట్టుబడుల విలువ రూ.5,320 కోట్లుగా ఉంది.

రూపాయి విలువ
Rupee Open July 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.72గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices July 29, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.35 శాతం పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 81.41 డాలర్లుగా ఉంది.

బంగారు, వెండి ఆభరణాలు కొనాలా? నేటి ధరలు ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోవడం మస్ట్! - demat account opening mistakes

Last Updated : Jul 29, 2024, 3:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.