Stock Market Close : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, విదేశీ పెట్టుబడులు పెరగడం వల్ల వరుసగా 12వ రోజు కూడా మన దేశీయ మార్కెట్లు లాభపడ్డాయి. ఫార్మా, రియాలిటీ షేర్లు రాణించిన నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి.
ముఖ్యంగా బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 231 పాయింట్లు లాభపడి ఆల్ టైమ్ రికార్డ్ పీక్స్ 82,365 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 83 పాయింట్లు వృద్ధిచెంది జీవనకాల గరిష్ఠం 25,235 వద్ద స్థిరపడింది.
- లాభపడిన షేర్లు : బజాజ్ ఫిన్సెర్వ్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్
- నష్టపోయిన షేర్లు : టాటా మోటార్స్, రిలయన్స్, టెక్ మహీంద్రా, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, నెస్లే ఇండియా, మారుతి సుజుకి
దూసుకెళ్లిన పేటీఎం షేర్లు : పేటీఎం పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్‌లో పెట్టుబడులకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో, పేటీఎం షేర్లు ఇవాళ బాగా రాణించాయి. ఇంట్రాడేలో ఈ షేరు రూ.631 వద్ద ఆరు నెలల గరిష్ఠాన్ని తాకింది. చివరికి ఎన్‌ఎస్‌ఈలో 12.70 శాతం లాభపడి రూ.624.90 వద్ద ముగిసింది. ఈ ఏడాది మే 9న పేటీఎం షేరు 52 వారాల కనిష్ఠమైన రూ.310 తాకిన సంగతి తెలిసిందే.
Stock Market Today August 30, 2024 : శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డ్ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 502 పాయింట్లు లాభపడి 82,637 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 25,257 వద్ద లైఫ్ టైమ్ పీక్స్‌ను టచ్ చేసింది. డొమెస్టిక్ స్టాక్స్ బుల్లిష్ ట్రెండ్‌లో ఉండడం, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం, విదేశీ సంస్థాగత పెట్టుబడులు పెరగడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 214 పాయింట్లు లాభపడి 82,349 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 71 పాయింట్లు వృద్ధిచెంది 25,222 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టైటాన్, బజాజ్ ఫిన్సెర్వ్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, ఏసియన్ పెయింట్స్, టాటా స్టీల్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, ఐటీసీ
విదేశీ పెట్టుబడులు
స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం రూ.3,260 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) సైతం రూ.2,691 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లు
యూఎస్ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. నేడు ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్‌లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి విలువ
Rupee Open August 30, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 7 పైసలు పెరిగింది. ప్రస్తుతం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.82గా ఉంది.
ముడి చమురు ధర
Crude Oil Prices August 30, 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.23 శాతం మేర పెరిగాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 80.12 డాలర్లుగా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices August 30, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.