ETV Bharat / business

రక్తమోడిన దలాల్​ స్ట్రీట్​- సెన్సెక్స్ 4390 పాయింట్లు డౌన్- రూ.35లక్షల కోట్లు ఆవిరి! - Stock Market Close

Stock Market Close Today June 4, 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. మదుపరుల సంపద ఏకంగా రూ.35 లక్షల కోట్ల వరకు ఆవిరైపోయింది. సెన్సెక్స్​ 4390 పాయింట్లు, నిఫ్టీ 1379 పాయింట్లు మేర పతనం అయ్యాయి.

bear market
stock market (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 4, 2024, 3:40 PM IST

Stock Market Close Today June 4, 2024 : కలలో కూడా ఊహించని రితీలో, కనీవినీ ఎరుగని నష్టాలతో దలాలా స్ట్రీట్ రక్తమోడింది. ఒకానొక దశలో సెన్సెక్స్​ 6000 పాయింట్లు, నిఫ్టీ 1900 పాయింట్లకు పైగా నష్టపోయి మదుపరులకు కన్నీళ్లు మిగిల్చాయి. ఒక అంచనా ప్రకారం, ఈ ఒక్కరోజే దాదాపు రూ.35 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. మోదీ గెలుపేమో కానీ, మదుపరులకు మాత్రం ఈ రోజు తీరని ఆవేదన మిగిల్చింది.

దలాల్ స్ట్రీట్ ఢమాల్​
బేర్ దెబ్బకు దలాల్ స్ట్రీట్ ఢమాల్ అయ్యింది. రోజంతా భారీ నష్టాల్లోనే స్టాక్ మార్కెట్లు ట్రేడయ్యాయి. చివరికి బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 4390 పాయింట్లు నష్టపోయి 72,079 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 1379 పాయింట్లు కోల్పోయి 21,884 వద్ద ముగిసింది.

  • లాభపడిన స్టాక్స్​ : హిందుస్థాన్ యూనిలివర్​, నెస్లే ఇండియా, టీసీఎస్​, హెచ్​సీఎల్ టెక్​, ఏసియన్ పెయింట్స్, సన్​ఫార్మా
  • నష్టపోయిన స్టాక్స్​ : ఎన్​టీపీసీ, ఎస్​బీఐ, ఎల్​ అండ్ టీ, పవర్​గ్రిడ్​, టాటా స్టీల్​, ఇండస్​ఇండ్​ బ్యాంక్​, రిలయన్స్, భారతీ ఎయిర్​టెల్​

ఎందుకిలా జరిగింది?
ఎగ్జిట్ పోల్స్​ అన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమికి భారీ మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. దీనితో సోమవారం స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను మూటగట్టుకున్నాయి. కానీ మంగళవారం పరిస్థితి మొత్తం తారుమారు అయ్యింది. ఇండియా బ్లాక్ నుంచి ఎన్​డీఏ కూటమికి గట్టిపోటీ ఎదురైంది. బీజేపీ మళ్లీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చే అవకాశం బాగా తగ్గింది. దీని వల్ల ఇకపై బీజేపీ స్వయం నిర్ణయాధికారం బాగా తగ్గుతుంది. మిత్రపక్షాలపై ఆధారపడే పరిస్థితి వస్తుంది. ఈ కారణంగానే మదుపరుల సెంటిమెంట్ బాగా దెబ్బతింది. ఫలితంగానే స్టాక్ మార్కెట్లు భారీ నష్టపోయాయి.

వాస్తవానికి ఈ రోజు ఏ దశలోనూ స్టాక్​ మార్కెట్లు కోలుకోలేదు. ఒకానొక దశలో సెన్సెక్స్​ 6000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 1900 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ప్రధానంగా నిఫ్టీ గత రెండేళ్లలో ఒకే రోజు అత్యంత దారుణమైన పతనాన్ని చవిచూసింది. దీనితో మదుపరులు భారీగా నష్టపోయారు. ఒక అంచనా ప్రకారం, ఈ ఒక్కరోజే మదుపరుల సంపద దాదాపు రూ.35 లక్షల కోట్లు ఆవిరైంది.

అన్ని రంగాలు నష్టాల్లోనే!
మంగళవారం దాదాపు అన్ని రంగాలు కూడా నష్టపోయాయి. ప్రధానంగా పీఎస్​యూ స్టాక్స్​, స్మాల్​, మిడ్ క్యాప్​ స్టాక్స్​ అయితే భారీగా నష్టాలు చవిచూశాయి.

ఎన్​టీపీసీ - 15 శాతం, ఎస్​బీఐ - 13 శాతం, పవర్​గ్రిడ్ -​ 12 శాతం, ఎల్​ అండ్ టీ - 11 శాతం మేర నష్టపోయాయి. అలాగే ఇండస్​ఇండ్ బ్యాంక్​, టాటా స్టీల్​, రిలయన్స్​, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, టాటా మోటార్స్, ఐటీసీ, టైటాన్​ కూడా భారీగా నష్టాలు చవిచూశాయి.

అదానీ గ్రూప్ షేర్లు అయితే మరింత దారుణంగా నష్టపోయాయి. ఒక అంచనా ప్రకారం అదానీ గ్రూప్ షేర్లు అన్నీ సుమారుగా 18 శాతం వరకు నష్టపోయి మదుపరులకు కన్నీళ్లు మిగిల్చాయి.

అదానీ టోటల్ గ్యాస్​ - 18 శాతం, అదానీ ఎనర్జీ -19 శాతం, అదానీ పవర్​ - 19 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీ - 7 శాతం, అదానీ ఎంటర్​ప్రైజెస్​ - 7 శాతం, అదానీ పోర్ట్స్​ - 20 శాతం, అదానీ విల్మర్​ - 8.5 శాతం మేర నష్టపోయాయి.

ఆ ఒక్కటీ!
మంగళవారం షేర్​ మార్కెట్ భారీ నష్టాల్లోకి కూరుకుపోయినప్పటికీ, హిందుస్థాన్ యూనిలివర్ మాత్రం 5 శాతానికి పైగా లాభపడడం విశేషం.

మంచి ఆరోగ్య బీమా పాలసీ ఎంచుకోవాలా? ఈ టాప్​-6 టిప్స్ మీ కోసమే! - How To Choose Best Health Insurance

EPF అకౌంట్​లోని మీ వివరాలు మార్చుకోవాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - EPF KYC Correction

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.