ETV Bharat / business

మీ క్రెడిట్ కార్డు పోయిందా? వెంటనే ఇలా చేయండి - లేదంటే చాలా నష్టం సుమా! - Credit Card Lost Or Stolen

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 3:47 PM IST

Steps To Take When The Credit Card Is Lost Or Stolen : మీరు క్రెడిట్ కార్డు వినియోగదారులా? అయితే ఈ స్టోరీ మీకోసమే. మీ క్రెడిట్ కార్డు పోయినా లేదా ఎవరైనా దానిని దొంగిలించినా ఏం చేయాలో తెలుసా?

What happens if your credit card is lost or stolen?
What if my CREDIT card is lost or stolen? (ETV Bharat)

Steps To Take When The Credit Card Is Lost Or Stolen : ఈ రోజుల్లో క్రెడిట్ కార్డు వాడడం సర్వసాధారణం అయిపోయింది. చేతిలో డబ్బులు లేనప్పుడు మనల్ని అవసరాల నుంచి గట్టేక్కించేవి ఈ కార్డులే. అయితే అనుకోకుండా ఎప్పుడైనా మీ క్రెడిట్ కార్డు పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా దానిని వెంటనే బ్లాక్ చేయాలి. లేదంటే చాలా ప్రమాదం. ఎందుకంటే, మోసగాళ్లు మీ క్రెడిట్ కార్డు ద్వారా డబ్బులు డ్రా చేయవచ్చు. లేదా మీ క్రెడిట్ కార్డుతో అనధికార కార్యకలాపాలకు పాల్పడవచ్చు. అందుకే క్రెడిట్ కార్డు పోయినప్పుడు, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తీసుకోవాల్సిన చర్యలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

1. క్రెడిట్ కార్డ్​ను బ్లాక్ చేయాలి
మీ క్రెడిట్ కార్డు పోయినా, ఎవరైనా దొంగిలించినా లేదా అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గుర్తించినా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని కార్డును బ్లాక్ చేయడం. మీ క్రెడిట్ కార్డు పోగానే వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్​ను సంప్రదించి కార్డును బ్లాక్ చేయమని చెప్పాలి. లేదా బ్యాంక్ యాప్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డును మీరే బ్లాక్ చేసుకోవచ్చు. ఇలా క్రెడిట్ కార్డును బ్లాక్ చేయడం వల్ల, ఆపై ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరపకుండా మోసగాళ్లను నియంత్రించవచ్చు.

2. FIR ఫైల్ చేయాలి
మీ క్రెడిట్ కార్డు పోయిందని బ్యాంకుకు తెలియజేసిన తర్వాత, వెంటనే మీ సమీపంలోని పోలీస్​ స్టేషన్​కు వెళ్లి ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యేట్లు చూడాలి. ఇలా చేయడం వల్ల మీ క్రెడిట్ కార్డుతో మోసగాళ్లు చేసిన అనధికార ఆర్థిక లావాదేవీలకు, కార్యకలాపాలకు మీరు బాధ్యత వహించే బాధ తప్పుతుంది. అలాగే ఈ ఎఫ్​ఐఆర్​ మీ క్రెడిట్ కార్డు రీప్లేస్​మెంట్ కోసం చట్టపరమైన రుజువుగా ఉపయోగపడుతుంది.

3. క్రెడిట్ బ్యూరోని సంప్రదించాలి
క్రెడిట్ కార్డ్‌ పోగొట్టుకున్న విషయాన్ని క్రెడిట్ కార్డ్ బ్యూరోలకు కచ్చితంగా తెలియజేయాలి. దీని వల్ల మీ క్రెడిట్ స్కోర్​పై ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుంది. అలాగే మీ క్రెడిట్ నివేదికను బాగా పరిశీలించి, ఏవైనా వ్యత్యాసాలు గమనిస్తే, వాటిని క్రెడిట్​ బ్యూరోకు నివేదించాలి. అప్పుడే మీ క్రెడిట్​ స్కోర్​ ప్రభావితం కాకుండా ఉంటుంది.

4. లావాదేవీలను గమనించాలి
దొంగతనానికి గురైన క్రెడిట్ కార్డుతో జరిగిన లావాదేవీలు, స్టేట్​మెంట్లను మీరు నిరంతరం గమనిస్తుండాలి. మీ క్రెడిట్ కార్డుతో అనధికారిక లావాదేవీలు జరిగినట్లు గమనిస్తే, వెంటనే బ్యాంకుకు సమాచారం అందివ్వాలి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, మీ క్రెడిట్ కార్డుతో మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు వెంటనే బ్యాంకుకు తెలియజేయాలి. ఆలస్యంగా సమాచారం అందిస్తే బ్యాంకు/కస్టమర్​కు నష్టం జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వినియోగదారులు సంబంధిత బ్యాంకుకు వీలైనంత త్వరగా సమాచారం అందించాలి.

5. నష్టం భరించేది ఎవరు?
రిజర్వ్ బ్యాంకు నిబంధనలు ప్రకారం, క్రెడిట్ కార్డుతో మోసపూరిత లావాదేవీలు జరిగినా, రెండు సందర్భాల్లో కస్టమర్ బాధ్యత సున్నాగా (జీరో లయబిలిటీ) ఉంటుంది. మొదటిది కార్డు జారీచేసిన సంస్థ నిర్లక్ష్యం లేదా లోపం వల్ల మోసపోవడం. రెండోది థర్డ్ పార్టీ ఉల్లంఘన కారణంగా మోసపూరిత లావాదేవీ జరిగితే కస్టమర్ బాధ్యత సున్నాగా ఉంటుంది. అయితే కస్టమర్​ తన క్రెడిట్ కార్డు పోయిన 3 పనిదినాల్లోపు బ్యాంకుకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.

కస్టమర్ అజాగ్రత్త కారణంగా మోసం జరిగితే, బ్యాంకుకు అనధికార లావాదేవీల ఆధారాలను సమర్పించేంత వరకు ఆ నష్టాన్ని వినియోగదారుడే భరించాల్సి ఉంటుంది. అనధికార ట్రాన్సాక్షన్స్​ వివరాలు సమర్పించిన తర్వాత ఆ నష్టాన్ని బ్యాంక్ భరిస్తుంది. అలాగే థర్డ్ పార్టీ ఉల్లంఘన బాధ్యత బ్యాంక్‌పైగానీ, కస్టమర్​పై గానీ ఉండదు.

క్రెడిట్ కార్డు పోయిన తర్వాత ఆలస్యంగా బ్యాంకుకు సమాచారం అందిస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఆలస్యంగా రిపోర్ట్ చేస్తే, రూ.5 లక్షల వరకు పరిమితి ఉన్న పొదుపు ఖాతాలు లేదా క్రెడిట్ కార్డ్​ల విషయంలో కస్టమర్ బాధ్యత రూ.10,000 వరకు ఉంటుంది. అంటే కస్టమర్​ రూ.10వేల వరకు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. రూ.5 లక్షల కంటే ఎక్కువ క్రెడిట్ పరిమితి ఉన్న క్రెడిట్ కార్డ్​లకు ఆ బాధ్యత రూ.25,000 వరకు ఉంటుంది. అంటే కస్టమర్​ రూ.25వేల వరకు నష్టపోవాల్సి వస్తుంది. అందుకే క్రెడిట్ కార్డు మోసం జరిగిన 7 రోజుల్లోపు బ్యాంకుకు తెలియజేయడం మంచిది. లేదంటే జరిగిన నష్టానికి కస్టమర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. అయితే ఇది ఆయా బ్యాంకుల నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.

ITR​ ఫైల్ చేస్తే ఏం లాభం అనుకుంటున్నారా? ఈజీగా వీసా, లోన్​ సహా బోలెడు బెనిఫిట్స్! - ITR Filing 2024

FD కంటే అధిక వడ్డీ కావాలా? RBI గ్యారెంటీతో వచ్చే ఈ బాండ్స్‌పై ఓ లుక్కేయండి! - RBI Floating Rate Bonds

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.