Best Small Savings Schemes : మీరు చిన్న మొత్తాల్లో పొదుపు చేయాలని అనుకుంటున్నారా? రిస్క్ లేకుండా స్థిరమైన రాబడి రావాలని ఆశిస్తున్నారా? అయితే కచ్చితంగా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రస్తుతం చాలానే ప్రభుత్వ పొదుపు పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇవి ప్రభుత్వ పథకాలు కాబట్టి గ్యారెంటీ రిటర్న్స్ వస్తాయి. మరెందుకు ఆలస్యం చిన్న మొత్తాల పొదుపు పథకాలు - వాటిపై వచ్చే వడ్డీ రేట్లు, ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకుందాం రండి.
1. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ : ఈ పథకంలో కనీస పెట్టుబడి రూ.500. గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. అకౌంట్లో కనీసం రూ.500 మెయింటెయిన్ చేయకపోతే రూ.50 జరిమానా పడుతుంది. అకౌంట్ బ్యాలెన్స్ జీరోకు చేరితే ఖాతా క్లోజ్ అవుతుంది. దీంట్లో పెట్టుబడులు పెడితే ఏడాదికి 4 శాతం చొప్పున వడ్డీ రేటు లభిస్తుంది.
2. నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ : దీంట్లో కనీసం రూ.1000 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయాలి. గరిష్ఠ పరిమితి అంటూ ఏం లేదు. ఏడాది టైమ్ డిపాజిట్‌పై 6.9 శాతం, రెండేళ్ల టెన్యూర్‌పై 7 శాతం, మూడేళ్ల వ్యవధిపై 7.10 శాతం, ఐదేళ్ల టైమ్ డిపాజిట్‌పై 7.50 శాతం చొప్పున వడ్డీ వస్తుంది.
3. ఫైవ్-ఇయర్ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ : ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.100 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్ఠ పెట్టుబడిపై ఎలాంటి పరిమితి లేదు. ఈ పథకంపై ప్రస్తుతం 6.7 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు.
4. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ : సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌లో చేరాలంటే కనీసం రూ.1000 డిపాజిట్‌తో అకౌంట్ తెరవాలి. గరిష్ఠంగా రూ.30 లక్షలు వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకంపై వడ్డీ రేటు 8.20 శాతంగా ఉంది.
5. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ : ఈ పథకంలో పెట్టుబడులు పెట్టినవారు నెలవారీగా ఆదాయం అందుకోవచ్చు. కనీసం రూ.1000, సింగిల్ అకౌంట్ కింద గరిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్ అకౌంట్ కింద రూ.15 లక్షలు వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. అకౌంట్ తెరిచినప్పటి నుంచి ప్రతి నెలా వడ్డీ రూపంలో ఆదాయం లభిస్తుంది. దీంట్లో వడ్డీ రేటు 7.40 శాతంగా ఉంది.
6. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC) : ఈ పథకంలో చేరాలనుకునేవారు కనీసం రూ.1000 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.70 శాతం ఉంటుంది.
7. పీపీఎఫ్ (పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) : పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో కనీస మొత్తంగా రూ.500, గరిష్ఠంగా రూ.1,50,000 వరకు ఒక ఏడాదిలో పెట్టుబడి పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్‌పై 7.71 శాతం వడ్డీ రేటు అందిస్తున్నారు.
8. కిసాన్ వికాస్ పత్ర : ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌లో కనీసం రూ.1000 డిపాజిట్‌తో అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది.
9. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ : ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే కనీసం రూ.1000తో అకౌంట్ తెరవాలి. ఒక అకౌంట్‌పై గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. 3 నెలల వ్యవధితో ఎన్ని ఖాతాలైనా తెరవొచ్చు. దీంట్లో వార్షిక వడ్డీ రేటు 7.50 శాతంగా ఉంది.
10. సుకన్య సమృద్ధి యోజన : కేంద్ర ప్రభుత్వం ఈ సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చింది. దీంట్లో 8.20 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. కనీసం రూ.250తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు.