ETV Bharat / business

బీ అలర్ట్ - జూన్​ 1 నుంచి వచ్చే మార్పులు ఇవే - త్వరగా ఆ పనులు పూర్తి చేయండి! - Rules Changing From June 1 - RULES CHANGING FROM JUNE 1

Rules Changing From June 1, 2024 : బీ అలర్ట్​. జూన్ 1 నుంచి పలు ఆర్థిక నియమ, నిబంధనలు మారనున్నాయి. ఇవి మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

New Financial Rules From June 1st 2024
Rules Changing From June 1, 2024 (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 31, 2024, 12:05 PM IST

Rules Changing From June 1, 2024 : జూన్​ 1 నుంచి అనేక ఫైనాల్సియల్ మార్పులు రానున్నాయి. ఇవి మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే జూన్​ నెలలో వచ్చే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ అప్డేట్​, బ్యాంక్ సెలవులు, ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్​ వినియోగానికి సంబంధించిన పలు మార్పులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

New Driving Licence Rules
కొత్త డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు : రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ ట్రైవింగ్ లైసెన్స్ రూల్స్​లో జూన్ 1 నుంచి కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం, జూన్ 1 నుంచి కొత్త డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఆర్​టీఓ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రైవేట్ డ్రైవింగ్ శిక్షణా కేంద్రాల్లో నిర్వహించే డ్రైవింగ్ పరీక్షలకు హాజరై, వారు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాలతో లైసెన్స్ పొందవచ్చు.

భారీ జరిమానాలు
వాహనాలు నడిపేవాళ్లు ఓవర్​ స్పీడ్​తో డ్రైవ్ చేస్తే రూ.1000 నుంచి రూ.2000 వరకు ఫైన్​ విధిస్తారు. ఒకవేళ ఎవరైనా మైనర్ వాహనాన్ని నడిపితే రూ.25,000 వరకు జరిమానా విధిస్తారు. అంతేకాదు ఆ వాహన యజమాని రిజిస్ట్రేషన్​ కార్డును కూడా క్యాన్సిల్ చేస్తారు. సదరు మైనర్​కు 25 ఏళ్లు నిండే వరకు డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేయరు. పూర్తి వివరాల కోసం ఈ లింక్​ను క్లిక్ చేయండి.

ఆధార్ కార్డ్ అప్​డేట్​
Aadhaar Card Update Last Date : చాలా కాలం నుంచి ఆధార్ కార్డ్ అప్​డేట్ చేయనివారు జూన్​ 14లోపు ఆ పని చేయాలి. మీరు సింపుల్​గా ఆన్​లైన్​లోనే ఆధార్​ వివరాలను అప్డేడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్​లైన్​లో ఆధార్ అప్​డేట్ చేయాలంటే, ప్రతి అప్డేట్​కు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్​
LPG Gas Cylinder Prices : చమురు సంస్థలు ప్రతి నెలా మొదటి రోజున ఎల్​పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తూ ఉంటాయి. వాస్తవానికి ఇవి మే నెలలో వాణిజ్య సిలిండర్​ ధరలను తగ్గించాయి. జూన్​ నెలలో కూడా ఎల్​పీజీ సిలిండర్ ధరలు తగ్గించే అవకాశం ఉంది. అలాగే జూన్​ 1న పెట్రోల్​, డీజిల్ ధరల్లోనూ మార్పులు చేయవచ్చని తెలుస్తోంది.

బ్యాంక్ సెలవులు
Bank Holidays In June 2024 : జూన్ నెలలో దాదాపు 10 రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. వీటిలో శని, ఆదివారాలు, జాతీయ, ప్రాంతీయ, పండగల సెలవులు కూడా ఉన్నాయి. కనుక మీ బ్యాంకింగ్ అవసరాలకు అనుగుణంగా మీ షెడ్యూల్​ను ప్లాన్​ చేసుకోవడం మంచిది.

అలర్ట్ - ఆధార్​తో పాన్ లింక్ చేసుకున్నారా? నేటి వరకే అవకాశం​ - లేకుంటే రెట్టింపు TDS కట్​! - Aadhaar PAN Link

రియల్ ఎస్టేట్ స్కామ్స్​ నుంచి సేఫ్​గా ఉండాలా? ఈ టిప్స్ పాటించాల్సిందే! - Tips To Avoid Real Estate Scams

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.