Road Safety Tips For Bike Riders : బైక్స్‌పై ప్రయాణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కార్స్‌తో పోల్చుకుంటే, చాలా తక్కువ ఖర్చుతోనే బైక్ ప్రయాణం పూర్తవుతుంది. టూ-వీలర్స్‌తో లాంగ్ ట్రాఫిక్ జామ్‌లను కూడా వేగంగా దాటుకుంటూ, మీ గమ్యస్థానాన్ని చేరుకోగలరు. ఏది ఏమైనప్పటికీ, బైక్స్‌పై ప్రయాణం ఉల్లాసాన్ని అందించినా, అవి కార్ల కంటే ప్రమాదకరమైనవి అనే వాస్తవాన్ని గుర్తించాలి. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, ఇతర వాహనాల కంటే బైక్ యాక్సిడెంట్స్ వల్ల దాదాపు 30 రెట్లు ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. 2019లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22,637 మంది కారు ప్రమాదాల్లో మరణించగా, 58,747 మంది బైక్ యాక్సిడెంట్స్‌లో మరణించినట్లు NCRB గణాంకాలు తెలియజేస్తున్నాయి.
Tips For Safe Driving :
- రైడింగ్ చేసేటప్పుడు ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలి. దీని వల్ల తలకు ఎలాంటి గాయాలు కాకుండా ఉంటాయి. ఫలితంగా చాలా వరకు ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. మోటారు వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం, ఇండియాలో బైక్ లేదా స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు రైడర్స్ హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అలా చేయకపోతే రూ.2000 జరిమానా విధిస్తారు. అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్‌పై 3 నెలల పాటు సస్పెన్షన్ విధించవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రెండూ చేయవచ్చు.
- పెద్దపెద్ద బైకులు కూడా రోడ్డుపై చిన్న వాహనాల మాదిరిగానే ఉంటాయని మీరు గుర్తించుకోవాలి. అందువల్ల బస్సులు, ట్రక్కులు లాంటి భారీ వాహనాలకు మీరు తగిన దూరంలో ఉండాలి. బ్లైండ్ స్పాట్స్‌లో ఉండకుండా జాగ్రత్త పడాలి.
- మీరు ఇతర వాహనాలకు కనిపించేలా రిఫ్లెక్టివ్ బ్యాండ్‌లు లేదా హెల్మెట్‌లను ధరించాలి. రాత్రి సమయంలో, హైవేలపైన ప్రయాణించేటప్పుడు మీరు తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీ ద్విచక్ర వాహనానికి ముందు, వెనుకవైపున రిఫ్లెక్టివ్ బ్యాండ్లు ఏర్పాటు చేసుకోవాలి.
- బైక్ నడుపుతున్నప్పుడు, మీరు ఎల్లప్పుడూ ఇతర వాహనాల నుంచి సురక్షితమైన దూరంలో ఉండాలి. డ్రైవర్ సడెన్‌గా బ్రేక్స్ వేసినా లేదా లేన్‌లను మార్చినా, మరొక వాహనం మిమ్మల్ని ఢీకొనకుండా ఇది సహాయపడుతుంది. అలాగే ఇతర వాహనాలకు కాస్త దూరంగా ఉండడం వల్ల మీరు సులువుగా పక్కకు వెళ్లడానికి, స్పీడ్‌ని తగ్గించడానికి వీలవుతుంది.
- కదులుతున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసేటప్పుడు, రెండు వాహనాల మధ్య చాలా ఖాళీ ఉండేలా చూసుకోండి. మీ ముందు కదులుతున్న వాహనం మీకు పాస్ ఇచ్చే వరకు ఓవర్‌టేక్ చేయకూడదు. రెండు కదులుతున్న వాహనాల మధ్య నుంచి వెళ్లడానికి ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఒకవేళ అలా చేస్తే, ప్రాణాంతకమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.
- శక్తివంతమైన ఇంజన్‌లతో కూడిన ఫ్యాన్సీ బైక్‌లు మిమ్మల్ని ఆకర్షిస్తున్నా సరే, మీరు నిపుణులైతే తప్ప వాటిని తొక్కడం మానుకోవాలి. దానికి బదులుగా, మీరు సులభంగా నడపగలిగే మోటార్ సైకిల్‌ను మాత్రమే వాడాలి. ఇందు కోసం ఈజీగా డ్రైవ్ చేయడానికి, హ్యాండిల్ చేయడానికి అనువైన స్కూటర్‌ని మాత్రమే ఎంచుకోవాలి.
- మీరు లాంగ్ బైక్ రైడ్‌లను ఇష్టపడే వారైతే, మీరు ఈ చిట్కాను చాలా సీరియస్‌గా తీసుకోవాలి. మీరు బైక్ రైడింగ్‌కు వెళ్లే ముందు కచ్చితంగా ఎల్బో గార్డ్, మోకాలి గార్డ్, జాకెట్, షూలను ధరించాలి. ఒకవేళ ప్రమాదం జరిగినా, మీరు తీవ్రమైన గాయాలపాలు కాకుండా ఇవి మిమ్మల్ని కాపాడతాయి.
- వాతావరణ బాగా లేనప్పుడు, ముఖ్యంగా భారీ వర్షాలు, మంచు పడుతున్నప్పుడు, తీవ్రమైన గాలులు వీస్తున్నప్పుడు, మీరు టూ-వీలర్‌పై ప్రయాణం చేయకపోవడమే మంచిది. ఒక వేళ కచ్చితంగా ప్రయాణం చేయాల్సి వస్తే, కచ్చితంగా అన్ని ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. హెడ్ లైట్స్, ఇండికేటర్స్‌ను ఆన్ చేసుకుని ఉంచుకోవాలి. అప్పుడే మిమ్మల్ని ఇతర రైడర్లు గుర్తించి, తగినంత దూరంలో ఉంటారు.
- బైక్‌లను బాగా మెయింటైన్ చేయడం కూడా చాలా ముఖ్యం. కనీసం 6 నెలలకు ఒకసారైనా బైక్‌ను సర్వీస్ చేయించాలి. అంతేకాదు టైర్స్లోని ఎయిర్ ప్రెజర్, బ్రేక్స్, క్లచ్, సస్పెన్షన్, లైట్లను చెక్ చేసుకోవాలి. దీని వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం తగ్గుతుంది. పైగా ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ పెరుగుతుంది.
- టూ-వీలర్స్ నడిపేవాళ్లు అందరూ కచ్చితంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. చాలా మంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు. దీనితోపాటు కాంప్రిహెన్సివ్ బీమా పాలసీ తీసుకోవడం చాలా అవసరం. దీని వల్ల ఎదుటి వ్యక్తులకు జరిగిన నష్టమేకాదు. మీకు కూడా పరిహారం లభిస్తుంది. బైక్ దొంగతనానికి గురైనా, డ్యామేజ్ అయినా మీకు బీమా సంస్థ మీకు పరిహారం అందిస్తుంది.
గుడ్ న్యూస్ - భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు - Gold Rate Today March 22nd 2024