ETV Bharat / business

రిటైర్మెంట్ తర్వాత ఎంత నిధి అవసరం? రూ.1 కోటి సరిపోతుందా? - Retirement Investment Planning

Retirement Planning : చాలా మంది పదవీ విరమణ నిధిని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారు. అయితే ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి? ఒక కోటి రూపాయల నిధి మీకు సరిపోతుందా? లేదా? అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

Retirement Planning In Telugu
Retirement Investment Planning
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 13, 2024, 3:50 PM IST

Retirement Planning In Telugu : ఎవరికైనా వారి పదవీ విరమణ అనంతర జీవితం చాలా ముఖ్యం. అయితే పదవీ విరమణ తర్వాత మిగతా జీవిత కాలానికి రూ.1 కోటి సరిపోతుందా? లేదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వ్యక్తుల లైఫ్ స్టైల్, ద్రవ్యోల్బణం, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను బట్టి ఎంత పదవీ విరమణ నిధి ఉండాలనేది మారుతూ ఉంటుంది.

జీవనశైలి, ఖర్చులు ఆధారంగా
హాయిగా రిటైర్‌ కావడానికి ఎంత సొమ్ము సరిపోతుందని అడిగితే, సరిపోయే సమాధానం అందరి దగ్గర ఉండకపోవచ్చు. దీనిని ప్రతి వ్యక్తికి వారి లైఫ్ స్టైల్ ప్రకారం లెక్కించాలి. ప్రస్తుతం ఉన్న జీవనశైలి 60 ఏళ్ల వయసులో భిన్నంగా ఉండొచ్చు. ప్రస్తుతానికి రూ.1 కోటి అంటే గొప్పగా అనిపించినప్పటికీ, పదవీ విరమణ తర్వాత మీ అవసరాలు భిన్నంగా ఉండవచ్చు. కొందరు పొదుపుగా ఉండొచ్చు. మరి కొందరు అతిగా ఖర్చులు పెట్టవచ్చు. అందువల్ల మీ పదవీ విరమణ నిధిని ప్లాన్‌ చేస్తున్నప్పుడు ఎల్లప్పుడూ జీవనశైలిలో మార్పులను పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం.

ద్రవ్యోల్బణం పెరిగితే
ద్రవ్యోల్బణం కాలక్రమేణా డబ్బు విలువను తగ్గిస్తుంది. కనుకన మీ కొనుగోలు శక్తి తగ్గుతుంది. ఈ రోజు రూ.1 కోటి విలువైనదిగా అనిపించొచ్చు కానీ అధిక ద్రవ్యోల్బణం, సామాజిక భద్రత లేకపోవడం వల్ల భారత్‌లో మనుగడ సాగించడానికి ఇంకా పెద్ద మొత్తమే అవసరం అవ్వవచ్చు. వస్తు, సేవల ధరలు పెరిగే కొద్దీ, పదవీ విరమణ ప్రణాళికలో మీ పొదుపు విలువ తగ్గుతుంది. పదవీ విరమణ ప్రణాళికను ఎంపిక చేసుకునేటప్పుడు ద్రవ్యోల్బణం రేటును పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం.

ఆరోగ్య సంరక్షణ ఖర్చులు పెరుగుదల
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు కాలక్రమేణా పెరుగుతున్నాయి. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం కోసం బాగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వైద్యం, బీమాతో పాటు వీటికి సంబంధించిన ఇతర ఖర్చులు పదవీ విరమణ ప్రణాళికలో కీలక భాగంగా ఉండాలి. పదవీ విరమణ వయసులో ఎటువంటి హెచ్చరిక లేకుండా ఆరోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ బీమా రేటూ పెరుగుతుంది. కాబట్టి వైద్య ఖర్చులు, ఆరోగ్య బీమా కోసం ముందుగానే ప్లాన్‌ చేసుకోండి. మీకు వైద్య బీమా లేకుంటే, పదవీ విరమణ నిధిలో ఊహించని తరుగుదలను ఎదుర్కోవలసి రావచ్చు.

ఆయుర్ధాయం
నేడు ప్రజల ఆయుర్థాయం పెరుగుతోంది. దీనివల్ల పదవీ విరమణ అనంతరం మరింత ఎక్కువ కాలం జీవించాల్సి వస్తోంది. కనుక మీకు అధిక నిధులు అవసరం అవుతాయి. ఆయుర్ధాయం ఎంత ఎక్కువ ఉంటే, మరింత ఎక్కువ నిధి అవసరం. పదవీ విరమణ తర్వాత చివరి దశలో జీవన వ్యయాలు ఎక్కువే ఉంటాయి. ఉదాహరణకు 60 ఏళ్ల వయసులో రూ.50 వేల నెలవారీ ఖర్చుతో ప్రారంభిస్తే 80 ఏళ్లు చేరుకునే సమయానికి (సగటు వార్షిక ద్రవ్యోల్బణం 5 శాతంగా ఉంటే) నెలవారీ ఖర్చు రూ.1.32 లక్షలకు చేరుతుంది.

రూ.1 కోటి ఎంత కాలం?
ఇది ఒక వ్యక్తి వ్యయంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీ దగ్గర కోటి రూపాయలు ఉంది అనుకుందాం. దానిపై ఏటా 7 శాతం రాబడి వస్తుంది అనుకుందాం. అప్పుడు ప్రతి నెలా రూ.50 వేలు ఖర్చు చేస్తే, 30 ఏళ్ల 4 నెలల వరకు సరిపోతుంది. అదే రూ.75 వేలు ప్రతి నెలా ఖర్చు చేస్తే 20 ఏళ్ల 7 నెలల వరకు సరిపోతుంది. ప్రతి నెలా రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తే, రూ. కోటి నిధి 12 ఏళ్ల 3 నెలల వరకు మాత్రమే వస్తుంది.

ఒక డీమ్యాట్ ఖాతాలోని షేర్లను మరోదానికి ట్రాన్స్​ఫర్ చేయాలా? ఈ సింపుల్​ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Transfer Shares

అంచనాలకు మించి రాణించిన TCS - క్యూ4లో రూ.12,434 కోట్లు లాభం - భారీగా డివిడెండ్​ ప్రకటన - TCS Net Profit In Q4

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.