ETV Bharat / business

క్రెడిట్​ కార్డ్ యూజర్లకు గుడ్ న్యూస్​ - ఇకపై మీకు నచ్చిన కార్డ్​ను ఎంచుకోవచ్చు! - Credit card rule change 2024

RBI New Credit Card Rules 2024 : రిజర్వ్ బ్యాంక్​ ఆఫ్ ఇండియా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్​ కార్డుల విషయంలో తమకు నచ్చిన నెట్​వర్క్​ను ఎంచుకునే స్వేచ్ఛను కస్టమర్లకు ఇవ్వాలని ఆదేశించింది. అంటే ఇకపై యూజర్లు తమకు నచ్చిన క్రెడిట్ కార్డును ఎంచుకునే అవకాశం ఉంటుంది.

RBI New Credit Card guidelines
RBI New Credit Card Rules 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 3:25 PM IST

RBI New Credit Card Rules 2024 : క్రెడిట్ కార్డు యూజర్లకు శుభవార్త. ఆర్​బీఐ అన్ని ప్రభుత్వ, ప్రైవేట్​ బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. క్రెడిట్​ కార్డుల విషయంలో, తమకు నచ్చిన నెట్​వర్క్​ను ఎంచుకునే స్వేచ్ఛను వినియోగదారులకు ఇవ్వాలని ఆదేశించింది.

కోరుకున్న క్రెడిట్ కార్డ్​ను ఎంచుకోవచ్చు!
ప్రస్తుతం 'కార్డు నెట్‌వర్క్‌'లు వివిధ బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతో కలిసి క్రెడిట్‌​ కార్డులను జారీ చేస్తున్నాయి. అయితే కస్టమర్లకు ఏ నెట్‌వర్క్‌ కార్డును ఇవ్వాలనేది బ్యాంకులు, ఆర్థిక సంస్థలే నిర్ణయిస్తున్నాయి. ఇది ప్రధానంగా ఆయా నెట్‌వర్క్‌లతో వాటికి ఉన్న ఒప్పందాలపై ఆధారపడి ఉంటోంది. దీని వల్ల కస్టమర్లకు, తమకు నచ్చిన కార్డ్​ నెట్​వర్క్​ను ఎంచుకునే అవకాశం లేకుండా పోతోంది. అందుకే ఆర్​బీఐ దీనిని పూర్తిగా సమీక్షించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మార్చేందుకు పేమెంట్ అండ్ సెటిల్​మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 కింద దఖలుపడిన అధికారాలను ఉపయోగించి, బ్యాంకులకు, ఆర్థిక సంస్థలకు పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా పరిమితులు విధించే కార్డు నెట్‌వర్క్‌లతో ఒప్పందాలు చేసుకోకూడదు.

2. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ యూజర్లకు, నచ్చిన నెట్‌వర్క్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇవ్వాలి.

3. ఇప్పటికే క్రెడిట్​/డెబిట్​ కార్డు కలిగి ఉన్నవారికి రెన్యువల్‌ సమయంలో నచ్చిన నెట్‌వర్క్‌కు మారే అవకాశాన్ని కల్పించాలి.

కార్డ్​​ నెట్​వర్క్​ల జాబితా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) భారత దేశంలో అనుమతి ఉన్న కార్డు నెట్​వర్క్​ల జాబితాను విడుదల చేసింది. అవి ఏమిటంటే,

1. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌

2. డైనర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌

3. మాస్టర్‌ కార్డ్‌ ఏషియా/పసిఫిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

4. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-రూపే

5. వీసా వరల్డ్‌వైడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌

నిబంధనలు పాటించాల్సిందే!
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు సహా కార్డ్​ నెట్‌వర్క్‌లు అన్నీ తమ మధ్య కుదిరిన ఒప్పందాలను రెన్యువల్‌ చేసే సమయంలో, తాజా నిబంధనలకు అనుగుణంగా వాటిలో సవరణలు చేయాలని ఆర్​బీఐ ఆదేశించింది. అలాగే తాము విధించిన నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. తాజా మార్గదర్శకాలను 2024 మార్చి 6 నుంచి ఆరు నెలల్లోపు అమలు చేయాలని పేర్కొంది.

ప్రత్యేక మినహాయింపులు!
పది లక్షల కంటే తక్కువ యాక్టివ్‌ కార్డులు ఉన్న జారీదారులకు తాజా నిబంధనలు వర్తించవని ఆర్​బీఐ స్పష్టం చేసింది. అలాగే సొంత నెట్‌వర్క్‌ ద్వారా కార్డు జారీ చేస్తున్న సంస్థలకు కూడా ఈ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చింది.

మార్చి డెడ్​లైన్స్​ - గడువులోగా ఈ పనులన్నీ కంప్లీట్​ చేయాల్సిందే!

అలర్ట్ - త్వరలో బంగారం ధర రూ.70వేలకు పెరిగే ఛాన్స్​ ​- కారణం ఏమిటంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.