ETV Bharat / business

ఈ పోస్టాఫీస్ స్కీమ్​లో ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు డబుల్​! - post office scheme tax benefits

Post Office Time Deposit Scheme Benefits : మీరు భవిష్యత్​ కోసం పెట్టుబడులు పెడదామని అనుకుంటున్నారా? ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రాబడి రావాలని ఆశిస్తున్నారా? అయితే ఇది మీ కోసమే. పోస్టాఫీస్​ టైమ్​ డిపాజిట్ స్కీమ్​లో పెట్టుబడి పెడితే కచ్చితంగా మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. పైగా పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి. పూర్తి వివరాలు మీ కోసం.

post office fixed deposit scheme benefits
post office time deposit scheme benefits
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 13, 2024, 10:56 AM IST

Post Office Time Deposit Scheme Benefits : ప్రజలు తమ భవిష్యత్ అవసరాల కోస డబ్బును పొదుపు చేసుకోవాలని అనుకుంటారు. ఇందుకోసం బెస్ట్ స్కీమ్స్ ఏమున్నాయా అని చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్ పోస్ట్​ ఒక బెస్ట్ స్కీమ్​ను అందిస్తోంది. అదే పోస్టాఫీస్​ టైమ్ డిపాజిట్​ స్కీమ్​. ఏ మాత్రం నష్టభయంలేని, మంచి రాబడిని ఇచ్చే సురక్షితమైన పొదుపు పథకం ఇది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫీస్​ టైమ్ డిపాజిట్ స్కీమ్ బెనిఫిట్స్​​

మీరు ఈ పోస్టాఫీస్​ స్కీమ్​లో రూ.5 లక్షలు డిపాజిట్ చేశారనుకుందాం. దీనిపై మీకు 7.5 శాతం వరకు వడ్డీ వస్తుంది. అందువల్ల 5 ఏళ్లలో మీకు రూ.2,24,974 వడ్డీ వస్తుంది. ఒకవేళ మీరు పదేళ్లపాటు ఇదే స్కీమ్​లో కొనసాగారనుకోండి. అప్పుడు మీకు ఏకంగా రూ.5,51,175ల వడ్డీ వస్తుంది. అంటే పదేళ్ల తరువాత మీరు డిపాజిట్ చేసిన సొమ్ము రెట్టింపు కంటే ఎక్కువ అవుతుంది. ఈ పోస్టాఫీస్​ స్కీమ్​లో చేరడానికి ఎలాంటి పరిమితులు లేవు. కేవలం రూ.100లతో పొదుపు ప్రారంభించినా సరిపోతుంది.

పథకం చేరడానికి కావాల్సిన అర్హతలు

  • ఈ పోస్టాఫీస్​ స్కీమ్​లో చేరాలంటే, కచ్చితంగా టైమ్ డిపాజిట్​/ ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.
  • రూ.1000 కనీస మొత్తంతో ఈ పథకంలో చేరవచ్చు. గరిష్ఠ మొత్తంపై ఎలాంటి పరిమితులు లేవు.
  • ఈ స్కీమ్​లో చేరాలంటే, ఖాతాదారుని వయస్సు తప్పనిసరిగా 10 ఏళ్లు నిండి ఉండాలి.
  • మైనర్ల తరపున వారి తల్లిదండ్రులు ఈ పోస్టాఫీస్ అకౌంట్​ను ఓపెన్ చేయవచ్చు.
  • మీరు ఈ స్కీమ్​లో 1, 2, 3, 5 ఏళ్లు టైమ్​ పీరియడ్స్​లో పొదుపు చేయవచ్చు.
  • వ్యక్తిగతంగా ఈ స్కీమ్​లో చేరవచ్చు. లేదా ఇతరులతో కలిసి జాయింట్ అకౌంట్ కూడా తెరవవచ్చు.

టైమ్ డిపాజిట్ - వడ్డీ వివరాలు
మీరు ఒక సంవత్సర కాలానికి టైమ్ డిపాజిట్ (టీడీ) చేస్తే 6.8 శాతం వడ్డీ ఇస్తారు. అదే 2 సంవత్సరాల కాలానికి టీడీ చేస్తే 6.9 శాతం వడ్డీ, మూడేళ్ల కాలానికి 7 శాతం వడ్డీ అందిస్తారు. 5 ఏళ్లకు డిపాజిట్ చేస్తే 7.5శాతం వడ్డీ అందిస్తారు. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ ప్రతి త్రైమాసికంలోనూ ఈ వడ్డీ రేట్లను క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది.

ఈ పోస్టాఫీస్​ స్కీమ్​లో వచ్చిన రాబడిపై, ఇన్​కం ట్యాక్స్​ సెక్షన్ 80-సీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సాధారణంగా రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.

గోల్డ్ బాండ్ సబ్​స్క్రిప్షన్​ షురూ - వారికి స్పెషల్​ డిస్కౌంట్ - అప్లై చేయండిలా!

రూ.1 లక్ష బడ్జెట్లో మంచి స్కూటీ కొనాలా? అయితే ఈ టాప్​-10 మోడల్స్​పై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.