Points To Remember While Taking New Credit Card : ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరి దగ్గర క్రెడిట్ కార్డు తప్పనిసరి వస్తువుగా మారిపోయింది. మంచి సిబిల్ స్కోరు ఉంటే చాలు ఉద్యోగం, జీతంతో సంబంధం లేకుండా చాలావరకు బ్యాంకులు వీటిని తమ కస్టమర్లకు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే అలా బ్యాంకుల ఇచ్చే ప్రతి క్రెడిట్ కార్డును తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో మీరు ఆర్థికంగా ఇబ్బంది పడవచ్చు. ఈ నేపథ్యంలో మీకు సరిగ్గా నప్పే లేదా సూట్ అయ్యే క్రెడిట్ కార్డులను మాత్రమే తీసుకోవడం ద్వారా మీరు మంచి ప్రయోజనాలను పొందగలుగుతారు. మరి మీకు అనువుగా మీ ఆర్థిక అవసరాలను తీర్చే విధంగా ఉండే క్రెడిట్ కార్డులను ఎంచుకునే ముందు లేదా కొత్తగా క్రెడిట్ కార్డును తీసుకోవాలనేవారు ముందుగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మీ లైఫ్ స్టైల్‌కు అనుగుణంగా
మీకు ట్రావెలింగ్ ఇష్టమైతే అందుబాటు ధరలో ఉండే ఫ్లైట్ టికెట్స్‌ను, మీరు బస చేసే హోటల్స్‌లో డిస్కౌంట్స్ ఇచ్చే క్రెడిట్ కార్డులను మాత్రమే ఎంచుకోండి. ఫుడ్ లవర్ అయితే రెస్టారెంట్ల చెల్లింపులపై డిస్కౌంట్లు ఇచ్చే కార్డుల కోసం వెతకండి. ఇవే కాకుండా అధిక క్యాష్‌బ్యాక్‌లు ఇచ్చే కార్డులను ఎంచుకోవటం ద్వారా మనం ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేయవచ్చు.
మీ ఖర్చులకు అనుగుణంగా
మీ ఆదాయానికి అనుగుణంగా క్రెడిట్ కార్డు బ్యాలెన్స్‌ను మెయింటైన్ చేయండి. ఆ విధంగానే ఖర్చులు చేయండి. ఒకవేళ ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఇచ్చే కార్డులను తీసుకుంటే బిల్లులు తిరిగి చెల్లించేటప్పుడు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మీ ఖర్చులను ముందే అంచనా
మీరు వేటిపైన అధికంగా ఖర్చు చేస్తున్నారో గుర్తించండి. మీరు నిత్యావసరాలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారా లేదా ఆన్లైన్ షాపింగ్‌పైనా, రెస్టారెంట్లపైనా ఇలా దేనిపైన ఎక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారో ముందే ఓ అంచనాకు రండి. దానివల్ల మీకు అయ్యే అధిక ఖర్చులను నియంత్రించవచ్చు. ఇందుకు అనుగుణంగా ఉండే క్రెడిట్ కార్డులను మాత్రమే ఎంచుకోండి.
ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయా చూడండి
కొన్ని బ్యాంకులు క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్లతో పాటు పండుగ వేళల్లో అదనపు లేదా అడిషనల్ బెనిఫిట్స్‌ను తమ కస్టమర్లకు అందిస్తాయి. అలాంటి ప్రోత్సహకాలు ఏమైనా ఉన్నాయా లేవా అనే వాటిని పరిగణనలోకి తీసుకొని మీకు ఉపయోగకరంగా ఉండే క్రెడిట్ కార్డును ఎంచుకోండి.
క్యాష్‌బ్యాక్ షరతులుపై ఓ లుక్కేయండి
కొన్ని బ్యాంకులు తమ క్యాష్‌బ్యాక్ ఆఫర్లకు కొన్ని షరతులను విధిస్తాయి. ఉదాహరణకు మీరు చేసే రూ.10,000ల నిత్యవసరాలు కొనుగోళ్లపై 10% మేర తగ్గింపు లేదా క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటిస్తుంటాయి. అయితే కొన్నిసార్లు మీకు బ్యాంక్ ఫిక్స్ చేసిన మొత్తంలో నిత్యావసరాలు కొనే అవసరం కాకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆ క్యాష్‌బ్యాక్ లేదా ఇతర పెర్క్‌ల ఆఫర్లు వృథాగా పోతాయి. అలాంటి వాటిని గమనించి క్రెడిట్ కార్డు తీసుకుంటే మంచిది.
కార్డుల రుసుములను సరిచూసుకోండి
క్రెడిట్ కార్డులు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా గమనించివల్సిన అంశం- మీరు తీసుకునే కార్డుపై విధించే ఛార్జీలు లేదా రుసుములు. అలాగే కార్డుల ఛార్జీల విధానం మీకు అవసరమైన కొనుగొలు వస్తువుల సంస్థలతో సదరు బ్యాంకుకు ఒప్పందం ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధరించుకోండి. అంతేకాకుండా సదరు బ్యాంకు ఇచ్చే రివార్డులనూ అంచనా వేయండి. వీటితో పాటు మీ క్రెడిట్ కార్డు నెలసరి వినియోగం దాని బ్యాలన్స్ లిమిట్లో 30 శాతం లోపల ఉండేలా చూసుకోండి. తద్వారా మీ క్రెడిట్ స్కోరు మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
సీనియర్ సిటిజన్స్ కోసం 3 సూపర్ స్కీమ్స్- ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు!
మీ కారు ఇంటీయర్ను క్లీన్ చేసుకోవాలా? ఈ 5-సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు!