Atal Pension Yojana : భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తరువాత పెన్షన్ లభిస్తుంది. ప్రైవేట్ సెక్టార్‌లోని ఉద్యోగులకు కూడా పెన్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. మరి అసంఘటిత రంగంలో పనిచేసే వారి పరిస్థితి ఏమిటి? 60 ఏళ్లు దాటిన తరువాత, ఉద్యోగం చేయలేని పరిస్థితిల్లో ఉన్నప్పుడు, వారికి ఆర్థిక భద్రత ఎలా కలుగుతుంది? ఈ సమస్యను తీర్చడానికే ప్రభుత్వం 'అటల్ పెన్షన్ యోజన' పథకాన్ని తీసుకువచ్చింది. ఈ స్కీమ్‌లో చేరితే చాలు, అసంఘటిత రంగంలో పనిచేసేవారు కూడా వృద్ధాప్యంలో పెన్షన్ పొందడానికి వీలవుతుంది. అందుకే అటల్ పెన్షన్ యోజన గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
అటల్ పెన్షన్ యోజన
Atal Pension Yojana Benefits : అటల్ పెన్షన్ యోజన అనేది ఒక ప్రభుత్వ పథకం. కనుక మీ పెట్టుబడి సురక్షితంగా ఉంటుంది. వృద్ధాప్యంలో కచ్చితంగా మీకు పెన్షన్ లభిస్తుంది. అంటే మీకు ఆర్థిక భరోసా కలుగుతుంది. ఇంతకు ముందు అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్లకు కూడా 'నేషనల్ పెన్షన్ స్కీమ్' అందుబాటులో ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం 2015 నుంచి ఎన్పీఎస్ స్వావలంబన్ స్కీమ్‌ను పాజ్‌లో పెట్టింది. దీనికి బదులుగా అసంఘటిత రంగంలో పనిచేసేవాళ్ల కోసం 'అటల్ పెన్షన్ యోజన'ను తీసుకువచ్చింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే?
- పెన్షన్ : చందాదారునికి 60 ఏళ్లు నిండగానే, అతను కట్టిన కంట్రిబ్యూషన్‌ను బట్టి నెలకు రూ.1000 నుంచి రూ.5000 వరకు పెన్షన్ లభిస్తుంది.
- అర్హతలు : 18 ఏళ్లు నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న భారతీయ పౌరులు అందరూ ఈ స్కీమ్‌లో చేరవచ్చు. అయితే వీరికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ కూడా కచ్చితంగా ఉండాలి.
- కంట్రిబ్యూషన్ : పాలసీదారుని వయస్సును బట్టి, కోరుకున్న పెన్షన్ అమౌంట్‌ను బట్టి కట్టాల్సిన చందా మారుతుంది.
- జీవిత భాగస్వామికి పెన్షన్ : పాలసీదారు బతికి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. ఒక వేళ అతను/ ఆమె చనిపోతే, వారి జీవిత భాగస్వామికి కూడా జీవితాంతం పెన్షన్ వస్తుంది.
- డెత్ బెనిఫిట్స్ : పాలసీదారు, అతని/ఆమె జీవిత భాగస్వామి ఇద్దరూ మరణిస్తే, నామినీకి పాలసీ డబ్బులు (పరిహారం) చెల్లిస్తారు.
- ట్యాక్స్ బెనిఫిట్స్ : అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరిన వారికి పన్ను మినహాయింపులు కూడా లభిస్తాయి.
ఎన్పీఎస్ స్వావలంబన్ నుంచి అటల్ పెన్షన్ యోజనకు మారడం ఎలా?
Transition From NPS Swavalamban To APY : మీరు ఇప్పటికే ఎన్పీఎస్ స్వావలంబన్ పథకంలో డబ్బులు కడుతూ ఉంటే, డోంట్ వర్రీ. మీరు చాలా ఈజీగా అటల్ పెన్షన్ యోజనకు ట్రాన్స్ఫర్ కావచ్చు. అయితే 18 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న పాలసీదారులకే ఈ సదుపాయం ఉంటుంది. 40 ఏళ్లు పైబడిన వాళ్లు అటల్ పెన్షన్ యోజనకు షిప్ట్ కాలేరు. వాళ్లు ఎన్‌పీఎస్‌లోనే కొనసాగాలి. వారికి 60 ఏళ్లు పూర్తయిన తరువాత ఎన్పీఎస్ పథకం కింద పెన్షన్ లభిస్తుంది. ఈ రెండూ ప్రభుత్వ పథకాలే కనుక మీకు ఎలాంటి నష్టభయం లేకుండా ఉంటుంది. భవిష్యత్ ఆర్థిక భద్రతకు భరోసా లభిస్తుంది.
రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలా? సరైన పింఛన్ ప్లాన్ రెడీ చేసుకోండిలా!
40 ఏళ్లకే పెన్షన్ కావాలా? నెలకు రూ.12,500 ఇచ్చే బెస్ట్ పాలసీ ఇదే!