ETV Bharat / business

పేటీఎం 3 రోజుల నష్టాలకు బ్రేక్​ - లాభాల్లోకి కంపెనీ షేర్స్​ - కారణం ఏమిటంటే? - Paytm Payments Bank RBI Issue

Paytm Stocks Rise : పేటీఎం మాతృసంస్థ అయిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ షేర్లు పుంజుకున్నాయి. గత మూడు రోజులుగా భారీ నష్టాలను చూసిన ఈ సంస్థ స్టాక్​లు మంగళవారం ఉదయం నుంచి ఒక్కసారిగా లాభాల్లో ట్రేడ్​ అవ్వడం ప్రారంభించాయి. ఇందుకు కారణం ఏమిటంటే?

Paytm Shares Rebound After Three Days Of Heavy Fall
Paytm Stocks Rise
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2024, 12:34 PM IST

Updated : Feb 6, 2024, 1:02 PM IST

Paytm Stocks Rise : మూడు రోజులుగా భారీ నష్టాలను ఎదుర్కొన్న పేటీఎం షేర్లు మరలా పుంజుకున్నాయి. పేటీఎం మాతృసంస్థ అయిన వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్ స్టాక్స్​ మంగళవారం ఉదయం నుంచి లాభాల బాట పట్టాయి. బీఎస్​ఈలో ఒక్కో పేటీఎం షేరు 7.79 శాతం మేర పెరిగి రూ.472.50 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈలో ఒక్కో పేటీఎం షేరు ధర 7.99 శాతం పెరిగి రూ.473.55 వద్ద ట్రేడవుతోంది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్​ లిమిటెడ్​ (పీపీబీఎల్‌)పై ఆర్​బీఐ చర్యల నేపథ్యంలో గత మూడు రోజుల్లో పేటీఎం స్టాక్‌లు 42 శాతానికి పైగా క్షీణించాయి. దీనితో కంపెనీ దాదాపుగా రూ.20,471.25 కోట్లు నష్టపోయింది.

ఆర్​బీఐ ఏం చెప్పింది?
Why RBI Ban Paytm : పేటీఎం సంస్థకు సంబంధించి ఇటీవల ఆర్​బీఐ పలు కీలక ఆదేశాల జారీ చేసింది. దీని ప్రకారం, 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ తమ ఖాతాదారుల నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదు. దీనితో వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్టాగ్​లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు వినియోగించడానికి వీలుపడదు. ఫలితంగానే కంపెనీ షేర్లు భారీగా నష్టపోయాయి.

వీటికి మినహాయింపు : ఆర్​బీఐ
పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో కస్టమర్లకు ఉన్న సేవింగ్స్‌ ఖాతా, కరెంట్‌ అకౌంట్​, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్లు, ఫాస్టాగ్‌, ఎన్‌సీఎమ్‌ కార్డులను మాత్రం బ్యాలెన్స్‌ అయిపోయేంత వరకు ఎటువంటి ఆంక్షలు లేకుండా వినియోగించుకునే వెసులుబాటును ఆర్​బీఐ కల్పించింది. అయితే వాలెట్‌కు లింక్​ అయి ఉన్న వాటిల్లో మాత్రం అదనంగా డబ్బులను డిపాజిట్​ చేసేందుకు ఫిబ్రవరి 29 తరవాత అవకాశం ఉండదు.

పేటీఎం రియాక్షన్​!
పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌లో 51 శాతం వాటాను కలిగి ఉన్నారు. మిగతా 49 శాతం వన్‌97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌కు చెందినది. ఇక ఇటీవలే తమ సంస్థపై ఆర్‌బీఐ విధించిన ఆంక్షలపై విజయ్‌ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని, దేశానికి సేవ చేసేందుకు తాము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని ట్వీట్​ చేశారు.

ముకేశ్ అంబానీ పేటీఎం వాటా కొంటారా?
జియో ఫైనాన్సియల్ సర్వీసెస్​ పేటీఎంలో దాదాపు 15 శాతం వరకు వాటా కొనుగోలు చేయవచ్చని వార్తలు వచ్చాయి. అంతేకాదు ఈ రోజు బ్లాక్‌ డీల్ ద్వారా పెద్ద ఎత్తున షేర్లు చేతులు మారినట్లు కూడా వార్తలు రావడం వల్ల వార్తలు రావటంతో పేటీఎం షేర్లు పుంజుకున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

మేం కొనడం లేదు: జియో
మరోవైపు పేటీఎం వాలెట్‌ వ్యాపారాన్ని కొనుగోలు చేయనున్నట్లు వస్తున్న వార్తల్ని జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఖండించింది. ఈ మేరకు సోమవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం అందించింది. నిబంధనల ప్రకారం, అన్ని విషయాలను ఎప్పటికప్పుడు తామే స్వయంగా వెల్లడిస్తామని చెప్పింది. పేటీఎం సైతం తాము ఎవరితోనూ వ్యాపార అమ్మకాల నిమిత్తం చర్చలు జరపడం లేదని స్పష్టం చేసింది.

పేటీఎం యూపీఐ సేవలు కొనసాగేనా?
ఆర్​బీఐ ఆంక్షల నేపథ్యంలో తమ సంస్థ తరఫున అందించే యూపీఐ సేవలను కొనసాగించే దిశగా చర్యలను చేపట్టింది పేటీఎం. ఇందుకోసం ఇతర బ్యాంకులతో చర్చిస్తున్నట్లు పేటీఎం పేర్కొంది. అయితే ఇందుకు ఏ బ్యాంకూ ప్రస్తుతానికి ముందుకురావడం లేదని సమాచారం. ఆర్‌బీఐ నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు వచ్చేవరకు ఈ విషయంలో బ్యాంకులు తమ నిర్ణయాలను ప్రకటించకపోవచ్చని తెలుస్తోంది.

Paytm ఆడిటింగ్​లో నమ్మలేని నిజాలు! మనీలాండరింగ్‌కు అవకాశం!

BSNL యూజర్లకు బంపర్ ఆఫర్​ - రూ.99కే అన్​లిమిటెడ్ బెనిఫిట్స్​!

Last Updated : Feb 6, 2024, 1:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.