ETV Bharat / business

35 కి.మీ మైలేజ్​తో నెక్ట్స్​జెన్​ మారుతి సుజుకి బాలెనో- ఫీచర్స్​ అదుర్స్!

Next-Gen Maruti Suzuki Baleno : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి రానున్న రెండెళ్లలో సరికొత్త కార్లను మార్కెట్​లో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. వాటిలో నెక్ట్స్​జెన్​ బాలెనో కారు కూడా ఒకటి. మరెందుకు ఆలస్యం ఆ కారు కొత్త ఫీచర్లేంటో ఓ లుక్కేద్దాం రండి.

Next-Gen Maruti Suzuki Baleno
Next-Gen Maruti Suzuki Baleno
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 7:54 AM IST

Next-Gen Maruti Suzuki Baleno : కార్ల ప్రియులకు గుడ్​న్యూస్. మారుతి సుజుకి నెక్ట్స్​ జనరేషన్ బాలెనో కారును 2026లో మార్కెట్లోకి తీసుకురానున్నట్లుగా తెలుస్తోంది. కొద్ది కాలం క్రితం మారుతి కంపెనీ పరిచయం చేసిన ఈ బాలెనో కారు కస్టమర్లలో మంచి క్రేజీ సంపాదించింది. ప్రస్తుతం ఈ బాలెనో కారు 1.2 L సిరీస్ పెట్రోల్​, 1.2L టర్బో బూస్టర్​ జెట్ పెట్రోల్​ ఇంజిన్​తో మార్కెట్​లో అందుబాటులో ఉంది. అయితే హైబ్రిడ్​ టెక్నాలజీని ఉపయోగించి సరికొత్త ఫీచర్స్​తో మారుతీ నెక్ట్స్​​జెన్​ కారును పరిచయం చేయనుంది ఆ సంస్థ. ఆ కంపెనీ కొత్తగా తీసుకువస్తున్న మారుతి బాలెనో ఎంత మైలేజ్​ ఇస్తుంది. ఇంజన్ ప్రత్యేకతలు ఏంటి? అనే వివరాలు మీ కోసం.

ఈ 5 సీటర్ కారు దేశంలోనే బెస్ట్​ సెల్లర్స్​లో ఒకటిగా నిలిచింది. మారుతి సుజుకి ఇప్పటికే తన పోర్ట్​ఫోలియోలో గ్రాండ్ విటారా, ఇన్​విక్టో మైల్డ్ హైబ్రిడ్​ కార్లను కలిగి ఉంది. ఈ రెండు కార్లు టయోటా కంపెనీకి చెందిన హైబ్రిడ్ టెక్నాలజీ ఆధారంగానే పనిచేస్తాయి. అయితే నెక్ట్స్​జెన్​ బాలెనోలో మారుతి సుజుకి సొంతంగా అభివృద్ధి టెక్నాలజీతో కూడిన హైబ్రిడ్ సిస్టమ్​ ఉంటుంది. హైబ్రిడైజిడ్ మాస్​ మార్కెట్ వెహికల్స్​ను మార్కెట్​లోకి తీసుకురావాలని మారుతి సుజుకి భావిస్తోంది. ఈ హైబ్రిడ్ కార్లను మార్కెట్​లో కాంపిటేటివ్ ధరలకే ఇవ్వాలని సన్నాహలు చేస్తోంది. హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్స్​గా ఈ విధానాన్ని వ్యవహరిస్తున్నారు.

సరికొత్త సాంకేతికతతో
నెక్ట్స్​జన్​ మారుతీ సుజుకి బాలెనో పెట్రోల్​ మిల్​ ఉంటుంది. వెహికల్ రేంజ్​ను పెంచడంలో పెట్రోల్​ మిల్​ ముఖ్యపాత పోషిస్తుంది. అయితే డైరెక్ట్​గా ప్రొపెల్ అవ్వకుండా ఎలక్ట్రిక్​ మోటర్​తో పవర్​ను జనరేట్​ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్​ లేదా జనరేటర్​ నుంచి ఎలక్ట్రిక్ మోటర్​ శక్తిని గ్రహిస్తుంది. తద్వారా ఇంజిన్​ జనరేటర్​గా పనిచేస్తుంది. ఈ కారు 35KMPL మైలేజ్​ను ఇస్తుందని అంచనాలున్నాయి.

మారుతి సుజుకి తయారు చేస్తున్న ఈ సాంకేతికత నిస్సాన్ వాహనాల్లో ఉండే 'ఈ-పవర్' టెక్నాలజీని పోలి ఉంటుంది. ఎలక్ట్రిక్ మోటర్ మాత్రమే చక్రాలను ముందు నడిపిస్తుంది కనుక సంప్రదాయ హైబ్రిడ్ మోడల్స్​తో పోలిస్తే ఈ కారు చాలా సింపుల్​గా ఉంటుంది. అందువల్ల వీటి తయారీ, ఉత్పత్తి వ్యయాలు తగ్గుతాయి. 2026 నాటికి దీన్ని సిద్ధం చేసి ఏటా 60,000 యూనిట్ల నెక్ట్స్​జెన్ కార్లను తయారు చేయాలని కంపెనీ అంచనా వేసుకుంటోంది.

కొత్త ఇంజిన్- 13రంగులు- మారుతి స్విఫ్ట్ నయా మోడల్ ఫీచర్లు అదుర్స్!

రూ.10 లక్షల బడ్జెట్లో - బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్​ ఉన్న టాప్​-5 కార్స్​ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.