ETV Bharat / business

SIP చేస్తున్నారా? 7-5-3-1 నియమం పాటిస్తే భారీ లాభాలు గ్యారెంటీ! - Mutual Fund Investment Tips - MUTUAL FUND INVESTMENT TIPS

Mutual Fund 7-5-3-1 Rule : మీరు మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా? అయితే ముందుగా మీరు 7-5-3-1 నియమం గురించి తెలుసుకోవాలి. అప్పుడే మీరు మంచి లాభాలు పొందడానికి వీలవుతుంది.

Mutual Fund Investment strategy
Mutual Fund SIP 7-5-3-1 Rule
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 2, 2024, 2:55 PM IST

Mutual Fund 7-5-3-1 Rule : మ్యూచువల్ ఫండ్స్​లో చాలా మంది పెట్టుబడి పెట్టాలనుకుంటారు. కానీ నష్ట భయంతో ముందుకు వెళ్లరు. అయితే సిస్టమేటిక్ ఇన్వెస్ట్​మెంట్ ప్లాన్ (SIP) ద్వారా మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 7-5-3-1 రూల్ పాటిస్తే, కాలక్రమేణా ఒక పద్దతిలో ఆదాయాన్ని పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్​లో 7-5-3-1 రూల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

7-5-3-1 నియమం అంటే ఏంటి?
మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టే ముందు ఈ 7-5-3-1 నియమం గురించి తెలుసుకోవాలి. దీని ఆధారంగా పలు (అసెట్ క్లాసెస్​) విభాగాలకు ఎలా నిధులు కేటాయించాలో తెలుస్తుంది. ఈ నియమం మీ పెట్టుబడికి ఒక మంచి ఫ్రేమ్​వర్క్​ను అందిస్తుంది. పోర్ట్​ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి కూడా వీలు కల్పిస్తుంది.

(7) వార్షిక ఆదాయానికి ఏడు రెట్లు ఉండేలా :
ఈ 7-5-3-1 రూల్​లో 7 అనే దానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. దీని ప్రకారం, మీ వార్షిక ఆదాయానికి కనీసం 7 రెట్లు మొత్తంతో సిప్​ ప్రారంభించాలి. ఇది మీ పెట్టుబడి వ్యూహానికి మంచి పునాది వంటిది. మీ పెట్టుబడి ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.

(5) డైవర్సిఫికేషన్ కోసం 5 సిప్స్​​ : మీరు మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడులు పెడదామని నిర్ణయించుకున్న తరువాత 5 రకాల సిప్​లను ప్రారంభించాలి. ముఖ్యంగా డెట్​, ఈక్విటీ, హైబ్రిడ్​ ఫండ్స్​ లాంటి వైవిధ్యమైన మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్ చేయండి. దీని వల్ల రిస్క్ తగ్గుతుంది. అయితే మీ రిస్క్ టాలరెన్స్, ఆర్థిక లక్ష్యాల ఆధారంగానే ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

(3) మూడు అసెట్ క్లాసెస్​ : 7-5-3-1 రూల్​లో 3 అంటే మూడు అసెట్ క్లాసెస్​. అవే ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ ఫండ్స్​. ఈక్విటీ ఫండ్స్​లో రిస్క్, రివార్డ్ రెండూ ఎక్కువగా ఉంటాయి. డెట్ ఫండ్స్ తక్కువ రిస్క్‌ను కలిగి ఉంటాయి. కానీ ఆదాయం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ ఈ డెట్​ ఫండ్స్ వల్ల మీకు స్థిరమైన రాబడి లభిస్తుంది. హైబ్రిడ్ ఫండ్స్ అనేవి ఈక్విటీ, డెట్ ఫండ్ల కలయికగా ఉంటుంది. కనుక ఈ ఆస్తి తరగతుల్లో మీ పెట్టుబడులను పెట్టడం వల్ల నష్టభయం తగ్గుతుంది. దీర్ఘకాలంలో మంచి రాబడి వచ్చే అవకాశం పెరుగుతుంది.

(1) వన్ టైం ఇన్వెస్ట్​మెంట్ : మీరు వివిధ మ్యూచువల్ ఫండ్లలో సిప్ విధానంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం మంచిదే. కానీ ఒకేసారి పెద్ద మొత్తంలో కూడా మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టవచ్చు. దీని వల్ల భారీ లాభాలు సంపాదించే అవకాశం ఉంటుంది. వాస్తవానికి దీని వల్ల రిస్క్ ఉన్నప్పటికీ, మీ పోర్ట్‌ఫోలియోను రీబ్యాలెన్స్ చేయడానికి, మార్కెట్ తిరోగమనాల ప్రయోజనాన్ని పొందడానికి, ఎమర్జింగ్​ ట్రెండ్‌లకు అనుగుణంగా లాభాలు పొందడానికి వీలవుతుంది. ఈ విధంగా 7-5-3-1 రూల్ అనేది మీ మ్యూచువల్ ఫండ్​ పెట్టుబడులకు ఒక బ్లూప్రింట్​గా పనిచేస్తుంది.

మీ పాన్ కార్డ్ దుర్వినియోగం అవుతోందా? వెంటనే రిపోర్ట్ చేయండిలా! - How To Check PAN Card Fraud

వాహనదారులకు గుడ్ న్యూస్​ - సార్వత్రిక ఎన్నికల తర్వాతే కొత్త టోల్‌ ఛార్జీలు! - Toll Tax Relief

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.