ETV Bharat / business

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు - ధర అక్షరాలా రూ.232 కోట్లు - ఆ హ్యాండ్​మేడ్​ వెహికల్ గురించి మీకు తెలుసా?

Most Expensive Car In The World : మీకు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు గురించి తెలుసా? దాని ధర అక్షరాలా రూ.232 కోట్లు. అపర కుబేరులు కూడా దానిని కొనాలంటే, కాస్త జంకుతారు. ఇప్పటి వరకు కేవలం ముగ్గురు మాత్రమే దానిని సొంతం చేసుకోగలిగారు. ఇంతకీ ఆ సూపర్​ స్పెషాలిటీ కారులో ఏముందో మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉందా?

Rolls Royce Boat Tail
most expensive car in the world
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 18, 2024, 1:14 PM IST

Most Expensive Car In The World : ఐశ్వర్యవంతులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు తమ స్టేటస్​కు అనుగుణంగా సూపర్ లగ్జరీ కార్లను ప్రత్యేకంగా తయారు చేయించుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్లకు కూడా అందనంత ఖరీదైన కారు ఒకటి ఉంది. అదే రోల్స్​ రాయిస్​ కంపెనీ రూపొందించిన, ప్రపంచంలోనే అత్యంత కారు. దాని పేరు 'రోల్స్ రాయిస్​ బోట్ టెయిల్'. దీని ఖరీదు అక్షరాల 28 మిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో చెప్పుకుంటే రూ.232 కోట్లు కంటే కాస్త ఎక్కువే.

డెక్ పిక్నిక్ టేబుల్​
రోల్స్ రాయిస్​ కంపెనీ ఈ కారుకు 'బోట్​ టెయిల్'​ అని పేరు పెట్టడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. వాస్తవానికి ఈ కారు డిజైన్​ దాదాపు రేసింగ్ బోట్ ​లాగా ఉంటుంది. కారు వెనుక ఉన్న డెక్​ - పిక్నిక్ టేబుల్​లాగా మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది. అందుకే దీనికి 'బోట్​ టెయిల్'​ అని పేరు పెట్టారు.

లగ్జరీ ఫీచర్స్
రోల్స్​ రాయిస్​ కంపెనీ ఈ బోట్​ టెయిల్​ కారులో సూపర్ లగ్జరీ ఫీచర్లను పొందుపరిచింది. రోల్స్ రాయిస్​ కంపెనీ రూపొందించిన వేరే ఏ కార్లలోనూ ఇలాంటి ఫీచర్లు లేకపోవడం విశేషం.

ఈ రోల్స్ రాయిస్​ బోట్​ టెయిల్ కారు చాలా వరకు కార్బన్ ఫైబర్​ కవర్​తో రూపొందించారు. ఇది కన్వర్టబుల్​​ ఓపెన్​ టాప్​ రూఫ్​తో వస్తుంది. కనుక లాంగ్ డ్రైవ్​ చేయడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. ఈ రోల్స్ రాయిస్​ బోట్​ టెయిల్​ కారులో నాలుగు లగ్జరీ సీట్స్ ఉంటాయి. కారు వెనుక భాగంలో ఉన్న డెక్​లో కాక్టెయిల్​ స్టోర్ ఉంటుంది. ఇందులో మనకు నచ్చిన డ్రింక్స్ ఉంచుకోవచ్చు. ఇంకా దీనిలో కన్వర్టబుల్​ టేబుల్స్​, చైర్స్ కూడా ఉంటాయి. పిక్నిక్​లకు, విహార యాత్రలకు వెళ్లినప్పుడు ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ కారులోని బూట్​ డోర్స్​ను ఓపెన్ చేస్తే, సీతాకోకచిలుక రెక్కల లాగా విచ్చుకుంటాయి.

ఈ రోల్స్​ రాయిస్​ బోట్ టెయిల్​లో వీ12 6.75 లీటర్​ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. వాస్తవానికి ఈ ఇంజిన్​ను కల్లినన్​, ఫాంటమ్​, బ్లాక్ బ్రిడ్జ్ లాంటి రోల్స్ రాయిస్ బ్రాండ్​ కార్లలోనూ ఉపయోగించారు. ఈ ఇంజిన్ గరిష్ఠంగా 563 bhp పవర్ జనరేట్ చేస్తుంది.

స్ఫూర్తి
రోల్స్ రాయిస్​ కంపెనీ 2017లో స్వెప్టైల్ కారును లాంఛ్ చేసింది. దీనిని ప్రేరణగా తీసుకునే ఈ సరికొత్త 'బోట్​ టెయిల్' కారును రూపొందించింది.

తయారీకి నాలుగేళ్లు
రోల్స్ రాయిస్ కంపెనీ ఈ కారును కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుతుంది. ఇది పూర్తిగా హ్యాండ్​మేక్ కావడం గమనార్హం. దీనిని పూర్తి చేయడానికి ఏకంగా నాలుగేళ్లు పట్టిందని కంపెనీ తెలిపింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

కేవలం ముగ్గురి దగ్గరే
ఇప్పటి వరకు కేవలం ముగ్గురు మాత్రమే ఈ సూపర్ లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. డైలీ మెయిల్ ప్రకారం, ప్రముఖ మ్యూజిక్​ కపుల్​ జే-జెడ్​, బియాన్స్ వద్ద ఒక రోల్స్ రాయిల్ బోట్ టెయిల్ కారు ఉంది. అర్జెంటీనా ఫుట్​బాల్ ప్లేయర్​ మౌరీ ఇకార్డి దగ్గర మరొకటి ఉంది. మూడవది మరొక గుర్తుతెలియని బిలియనీర్ జంట వద్ద ఉంది.

మోస్ట్​ పవర్​ఫుల్​ బైక్​​ కొనాలా? ఈ టాప్​-5 టూ-వీలర్స్​పై ఓ లుక్కేయండి!

కొత్తగా కారు డ్రైవింగ్ నేర్చుకుంటున్నారా? ఈ టాప్​-6 టిప్స్​ మీ కోసమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.