ETV Bharat / business

పేదలకు గుడ్​న్యూస్​- రూ.100 తగ్గిన వంట గ్యాస్ ధర, మహిళలకు మోదీ ఉమెన్స్ డే గిఫ్ట్

LPG Gas Cylinder Price Reduced : మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మహిళలకు కానుక ఇచ్చారు. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన నారీ శక్తికి ప్రయోజనం చేకూరుస్తుందని చెప్పారు.

LPG Gas Cylinder Price Reduced
LPG Gas Cylinder Price Reduced
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 9:18 AM IST

Updated : Mar 8, 2024, 9:53 AM IST

LPG Gas Cylinder Price Reduced : మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుడ్‌న్యూస్‌ చెప్పారు. వంట గ్యాస్‌ సిలిండర్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీని వల్ల లక్షలాది కుటుంబాలపై ఉన్న ఆర్థిక భారం తగ్గుతుందని తెలిపారు. ముఖ్యంగా 'నారీశక్తి'కి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వంటగ్యాస్‌ను అందుబాటు ధరలో అందించటం వల్ల కుటుంబాల శ్రేయస్సుకు మద్దతునిస్తున్నామని చెప్పారు. తద్వారా వారికి ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. మహిళా సాధికారత, సులభతర జీవన విధానాన్ని అందించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

ప్రస్తుతం 14.2 కేజీల వంట గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ. 955గా ఉండగా కేంద్రం తాజా నిర్ణయంతో రూ.855కి చేరనుంది. దేశ రాజధాని దిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 903గా ఉండగా ఇప్పుడు రూ. 803కు తగ్గనుంది. కోల్​కతాలో రూ.929గా ఉండగా రూ.829కు తగ్గింది. ముంబయిలో రూ.802.50కు తగ్గింది.

మరోవైపు, ఉజ్వల యోజన కింద ఎల్‌పీజీ సిలిండర్‌పై అందిస్తున్న రూ.300 రాయితీని వచ్చే ఆర్థిక సంవత్సరం(2024-25) వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం గురువారం ప్రకటించింది. కాగా, మార్చి 31వ తేదీతో సబ్సిడీ గడువు ముగియనున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించింది కేంద్రం. అలాగే రక్షాబంధన్‌ సందర్భంగా గతేడాది సిలిండర్‌ ధరను కేంద్రం రూ.200 తగ్గించింది.

సబ్సిడీ ఇలా అందుతుంది?
సిలిండర్‌ను మార్కెట్‌ ధరకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. 2022లో ఉజ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌లో సబ్సిడీ మొత్తాన్ని రూ.300కు పెంచింది. ప్రస్తుతం దిల్లీలో ఒక్కో సిలిండర్‌ ధర రూ.903గా ఉంది. ఆ లెక్కన ఉజ్వల పథకం లబ్ధిదారులకు రూ.603కే ఒక వంటగ్యాస్​ లభిస్తుంది. ఈ స్కీమ్ కింద లబ్ధిదారులు సగటున ఏడాదికి 3.68 రీఫిల్స్‌ వినియోగిస్తున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు యథాతథం :
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రికార్డు స్థాయిలో గత 21 నెలలుగా పెట్రోల్, డీజిల్ ధరలను యథాతథంగానే ఉంచుతున్నాయి. ప్రస్తుతం దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72, లీటర్​ డీజిల్ ధర రూ.89.62గా ఉంది.

వాణిజ్య సిలిండర్​ ధర రూ.25 పెంపు - వంట గ్యాస్​ రేటు ఎంతంటే?

రూ.500కే గ్యాస్​ సిలిండర్ - లబ్ధిదారుల ఖాతాలోకి రాయితీ నగదు బదిలీనే

Last Updated : Mar 8, 2024, 9:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.