ETV Bharat / business

కైనెటిక్ లూనా రిటర్న్స్​- ఒక్కసారి ఛార్జింగ్​తో 150కి.మీ జర్నీ- యాక్సిడెంట్ల నుంచి కాపాడే యమహా సూపర్ బైక్

Kinetic E Luna Price In India : ఒకప్పుడు భారీ ఆదరణ పొందిన వింటేజ్​ లూనాను కైనెటిక్​ గ్రీన్​ సంస్థ మళ్లీ మార్కెట్​లో విడుదల చేసింది. కానీ ఈసారి విద్యుత్​ వెర్షన్​లో తీసుకొచ్చింది. అందుబాటులో ధరలో వస్తున్న 'ఇ-లూనా' ఫీచర్లు, బ్యాటరీ కెపాసిటీ, ధర, రేంజ్​ వంటి వివరాలు మీ కోసం.

Kinetic E Luna Price In India
Kinetic E Luna Price In India
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 8, 2024, 4:04 PM IST

Kinetic E Luna Price In India : ఒకప్పుడు భారత్‌లో భారీ ఆదరణ పొందిన ద్విచక్ర వాహనం 'లూనా'ను తిరిగి మార్కెట్​లోకి విడుదల చేసింది 'కైనెటిక్‌ గ్రీన్' కంపెనీ. ఈసారి విద్యుత్తు వెర్షన్‌లో 'ఇ-లూనా'ను సరికొత్తగా తీసుకొచ్చింది. పాత లూనా గుర్తొచ్చేలా ఈ విద్యుత్​ వెర్షన్​ను రూపొందించారు. ఎవరైనా సులభంగా ఉపయోగించేలా డిజైన్​ చేసిన ఇ-లూనా, కేవలం 96 కిలోల బరువు ఉంటుంది. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యమున్న ఈ ఎలక్ట్రిక్​ లూనా ఫీచర్లు, ధర, రేంజ్​ గురించి తెలుసుకుందాం.

లోడ్​, బ్యాటరీ కెపాసిటీ
వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఈ కొత్త లూనాను రూపొందించారు. ఇ-లూనా​ 150 కిలోల లోడ్​ను మోసుకెళ్లగలదని కంపెనీ తెలిపింది. ఈ విద్యుత్ లూనాలో 2kWh సామర్థ్యం గల బ్యాటరీని పొందుపరిచారు. ఈ బ్యాటరీ ఫుల్​ ఛార్జ్​ కావాలంటే 4 గంటల సమయం పడుతుందని, ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 110 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ వెల్లడించింది.

మూడు వేరియెంట్లలో
సరికొత్త 'ఇ-లూనా' మొత్తం మూడు బ్యాటరీ వేరియంట్లలో (2kWh, 1.7 kWh, 3.0 kWh) అందుబాటులో ఉంది. ఇక టాప్​ వేరియంట్​ (3.0 kWh) 'ఇ- లూనా', 150 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. రూ.69,999 ( దిల్లీ ఎక్స్​ షోరూమ్ ) ప్రారంభ ధరతో లాంఛ్​ చేసిన ఇ-లూనాలో 16 అంగుళాల టీవీఎస్​ యూరోగ్రిప్ టైర్లను అమర్చారు.

డిజిటల్ హంగులు
'ఇ-లూనా'కు డిజిటల్ హంగులు జోడించింది కంపెనీ. మూడు రైడింగ్ మోడ్స్​ ఉన్న ఈ బైక్​లో యూఎస్​బీ ఛార్జింగ్​ పోర్ట్​ను కూడా పొందుపరిచారు. ఆరు కలర్​ వేరియంట్లలో (ఎరుపు, బ్లూ, పసుపు, ఆకుపచ్చ, బ్లాక్​) వస్తున్న ఈ కొత్త లూనా ​బుకింగ్స్​ ఓపెన్ అయ్యాయి. రూ.500 చెల్లించి బైక్​ను బుక్​ చేసుకోవాల్సి ఉంటుందని, అమెజాన్​, ఫ్లిప్​కార్ట్​ వంటి ఈ కామర్స్​ వెబ్​సైట్​ల నుంచి కూడా బుక్​ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. త్వరలో డెలివరీలు మొదలు పెట్టనున్నట్లు వెల్లడించింది.

'రఫ్​ అండ్ టఫ్' యమహా ట్రేసర్​ 9జీటీ+
Yamaha Tracer 9 GT : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటర్ సరికొత్త ఫీచర్లతో అడ్వాన్స్​డ్​ బైక్​ 'ట్రేసర్ 9జీటీ+ (TRACER 9 GT+)ను తీసుకొచ్చింది. ఈ 'సూపర్​' బైక్​లో మిల్లి రేడియో వేవ్​ రాడార్​తో పనిచేసే క్రూయిజ్ కంట్రోల్​ వ్యవస్థను పొందుపరిచింది. ప్రపంచంలో ఇలాంటి వ్యవస్థ ఉన్న తొలి బైక్​ ఇదేనని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. వేరే వాహనం అకస్మాత్తుగా బ్రేక్​ వేసినా, ఆగినప్పుడు జరిగే ప్రమాదాల నుంచి రైడర్​ను ఈ వ్యవస్థ కాపాడుతుందని తెలిపింది. కారులో రైడ్​ చేసే అనుభూతి కలుగుతుందని యమహా మోటార్ ప్రతినిధి సతోషి కసై వెల్లడించారు. ఈ వ్యవస్థ వల్ల ఎక్కువ దూరం ప్రయాణించినా రైడర్​కు అలసట అనిపించదని చెప్పారు. రైడ్​ను మరింత సౌకర్యవంతంగా, ఉత్తేజకరంగా చేయడమే యమహా లక్ష్యమని కంపెనీ పేర్కొంది.

గ్రాండ్ ప్రీ​ రైడర్​ షిన్యా నకానో కూడా ఈ అద్భుతమైన ఫీచర్లు కలిగిన బైక్​ను నడిపారు. యమహా అత్యాధునికమైన టెక్నాలజీని కొనియాడారు. "సాధారణంగా, అత్యవసర బ్రేకింగ్ సమయంలో మోటర్‌బైక్ అస్థిరంగా ఉంటుంది. కానీ ఈ బైక్ దానిని గుర్తిస్తుంది, దానికి సస్పెన్షన్ సపోర్ట్ చేస్తుంది. తద్వారా బైక్​ వేగం తగ్గుతుంది. ఈ బైక్​ గొప్ప పనితీరును కనబర్చింది. యమహాలో నైపుణ్యం ఉందని నేను భావిస్తున్నాను" అని నకనో తెలిపారు.

మంచిగా బైక్​ మెయింటెనెన్స్ చేయాలా? ఈ టాప్-10 టిప్స్​ మీ కోసమే!

రూ.70,000 బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్​-8 మోడల్స్ ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.